Tuesday, January 21, 2025

ఇప్పుడేమి చేయవలె, మంత్రులకు రావణుడి ప్రశ్న

రామాయణమ్ 166

ఒక్క కోతి వచ్చి మన లంకను, లంకానగరాధిదేవతను, లంకానగరపౌరులను నానా చికాకు పరచి లంకేశుడనైన నన్ను ధిక్కరించి ,హుంకరించి లంకను తగులపెట్టి భద్రముగా తిరిగి వెళ్ళినది!

ఏమైనది మన రక్షణ వ్యవస్థ?

ఎటుపోయింది  శత్రుదుర్నీరక్ష్యమైన మన శౌర్యం?

మనమిప్పుడు ఏమి చేయవలెను?

ఏది యుక్తము?

Also read: మహేంద్ర పర్వత సానువుల్లో రామలక్ష్మణులు, వానరసైన్యం

మనకు ఏది హితము నాకు తెలియ చెప్పండి!

ఓ మహాబుద్ధిమంతులారా! సరి అయిన మంత్రాంగమే సకల కార్యసిద్ధికి మూలము!

రాముని విషయమున ఆలోచించండి!

ధీరులు, శూరులు అయిన వేలకొలది వానరులతో కలసి లంకానగరము పైకి రాముడు శీఘ్రమే రానున్నాడు.

లోకములో ఉత్తములు, మధ్యములు, అధములు అయిన కార్యసాధకులైన పురుషులు ఉన్నారు.

ఎవడు సమర్ధులు, తన హితము కోరువారు అయిన మంత్రులతో మంత్రాంగము చేయునో అలా చేసి పనులను ప్రారంభించి విజయవంతముగా దైవానుగ్రహముతో వాటిని పూర్తి చేయునో అతడు ఉత్తముడు.

ఎవడు ఒంటరిగానే ఆలోచన చేసి ఒంటరిగానే ధర్మమును నిర్ణయించుచూ ఒంటరిగానే పనులు చేయునో అతడు మధ్యముడు.

Also read: సముద్ర తీరానికి బయలుదేరిన వానరసేన

గుణదోషములు నిర్ణయించకుండా పూర్తిగా దైవము మీదనే ఆధారపడి ,”చేయవచ్చునులే” అని కార్యమును ఉపేక్షించువాడు అధముడు.

అనుచూ రావణుడు తన మంత్రులతో ప్రసంగము కొనసాగించుచున్నాడు.

ఏమి చేయవలెనో నిర్ణయించండి!..

మీరంతా ఏకాభిప్రాయముతో ముక్త కంఠముతో కర్తవ్యమును తెలిపిన అది ఉత్తమమైన ఆలోచన అగును.

అటులగాక మీలో మీరు అభిప్రాయ భేదములతో ఉండి చివరకు ఒక అభిప్రాయమునకు వచ్చిన అది మధ్యమము …(దీనిగురించి..మధ్యమము.. modern వివరణ క్రింద చూడండి)

ఎవరికి వారు అభిప్రాయ భేదములతో ఉండి ఐకమత్యములేక ఏకాభిప్రాయమునందు ప్రీతి చూపక చేయు మంత్రాంగము అధమము.

Also read: సముద్రము దాటే ఉపాయం కోసం అన్వేషణ

అందుచేత ఉత్తమమైన బుద్ధిగల మీరంతా ఆలోచన చేసి ఇప్పటికిప్పుడు మన కర్తవ్యము తెలుపుడు. దానినే నేను అంగీకరించి అమలు పరచెదను.

ఆ రాముడు సామాన్యుడు కాడు. సముద్రమును సుఖముగా దాటగలడు. అవసరమయినచో సముద్రమును ఎండించి వేయగలడు లేక దారి మళ్ళించి వేయగలడు. సముద్రమును చీల్చి దారి చేసుకొనగలడు.

తమ రాజైన రావణుని మాటలు శ్రద్ధగా విన్న మంత్రులు తమతమ అభిప్రాయములను ప్రకటింపచేస్తున్నారు ….అయితే వారెవరికీ రాముని శక్తిసామర్ధ్యముల పట్ల కనీస అవగాహన కూడా లేదు …వారు ఈ విధముగా పలుక జొచ్చిరి.

NB

There is a concept called as Six thinking hats

This is a system designed by Edward de Bono, a Professor of psychology.

This  tells about a tool for group discussion and individual thinking.

He assigns six different colours for six thought streams .

He calls them as hats. Black , red, green, blue, yellow ,

and white hats …difference of opinion is natural and inevitable….but how to arrive at  the best solution? !!

“Six Thinking Hats”   this he christened as …

Parallel Thinking .

This process provides a way for groups to plan thinking.

This method was trialled within the U. K’s civil service.

ఈ రకమైన మంత్రాంగము మధ్యమము అని వాల్మీకి మహర్షి చెప్పారు…

ఇలాంటి మంత్రాంగము, ఆలోచనా విధానాల గురించి మన సాహిత్యములో ఎంతో ఉంది.

Also read: సీతమ్మను చూసినట్టు శ్రీరామునికి తెలిపిన హనుమ

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles