- ఎటూ తేల్చుకోలేని కోట్ల వర్గీయులు
- కోట్ల కుటుంబానికి ఒకే టికెట్ అంటున్న టీడీపీ
- కర్నూల్ ఎంపీ టికెట్ బీసీలకే: టీడీపీ
అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో పాత తరం రాజకీయాలు, ప్రస్తుత రాజకీయాలు పరిశీలిస్తే ఓడలు బడ్లు, బడ్లు ఓడలు అవుతాయాన్న నానుడి నిజం అవుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి తెలుగు నాట సూపరిచుతుడు. కర్నూల్ జిల్లాలో మారు మూల గ్రామంలో ఉన్న వ్యక్తులను సైతం పేరుపెట్టి కోట్ల విజయభాస్కర్ రెడ్డి పిలిచేవారు. తనను నమ్ముకున్న వ్యక్తులకు బాసటగా నిలిచిన ఘనత కోట్ల విజయభాస్కర్ రెడ్డి కే దక్కతుందని అయన వర్గీయులు చెపుతుంటారు. అటువంటి కోట్ల కుటుంబం నేటి రాజకీయాల్లో ఎటు వైపు వెళ్లలో తెలియక అయోమయంలో గందరగోళం అవుతున్నది. గత ఎన్నికల సమయంలో ఎంపీ, ఎమ్మెల్యేలకు టికెట్లను కోట్ల టిక్ చేసేవారని ఆయన వర్గీయులు గుర్తు చేస్తున్నారు. అటువంటి కోట్ల కుటుంబ సభ్యులు 2024 ఏపీలో జరగనున్న ఎన్నికల్లో కర్నూల్ జిల్లాలో ఎంపీ, ఎమ్మెల్యే టికెట్ దక్కించుకోవడానికి పార్టీల నాయకత్వాల అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు. 2019 ఎన్నికల్లో కర్నూల్ ఎంపీ సీటు టీడీపీ నుంచి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి పోటీ చేసి ఓటమి చెందారు. ప్రకాష్ రెడ్డి భార్య సుజాతమ్మ ఆలూరు నుంచి ఎమ్మెల్యే గా పోటీ చేసి ఓటమి చెందారు. ప్రస్తుతం వచ్చే ఎన్నికల్లో కర్నూల్ ఎంపీ టికెట్ బీసి వర్గాలకు కేటాయించాలని టీడీపీ పరిశీస్తోంది. దీంతో కోట్ల ప్రకాష్ రెడ్డి కి ఎంపీ టికెట్ ఇవ్వలేమని టీడీపీ చెప్పకనే చెప్పుతోంది. టీడీపీ సూచనలతో కోట్ల ప్రకాష్ రెడ్డి అసంతృప్తి తో రగిలిపోతున్నారు. భవిష్యత్ ఏమిటని కోట్ల ప్రకాష్ రెడ్డి తన వర్గీయులతో సమాలోచన చేస్తున్నారు. మరోపక్క ఏపీ రాజకీయాల్లో వచ్చే ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధం అవుతోంది. కాంగ్రెస్ నుంచి కర్నూల్ ఎంపీ కి పోటీ చేయాలనీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా అదేసిస్తే ప్రకాష్ రెడ్డి ఎటు వైపు వెళతారని కోట్ల వర్గీయులు రచ్చ బండ చర్చలు జరుపుతున్నారు. కోట్ల ప్రకాష్ వచ్చే ఎన్నికల్లో ఎటు పయనిస్తారో నని రాజకీయ పరిశీలకులకు అంతుప ట్టడంలేదు.