భారతీయ వివాహ వ్యవస్థలో పెను మార్పులు సంభవిస్తున్నాయా? వివాహ వ్యవస్థ మీద ఎన్నో పరిశోధనలు చేస్తున్న డా. కృష్ణ మోహన్ రావు గారు నాకు ఫోన్ చేశారు. ఒక్క సారిగా నన్ను వివిధ కోణాల్లో అభిప్రాయ సేకరణ కోసం, విషయ సమాచారం కోసం ప్రశ్నలు వేశారు. వాటికి నేను సమాధానం దాట వేస్తూ వచ్చాను … ఆయన పరిశోధన అంతా ఇప్పుడు ముప్ఫయి ఏళ్ల వయసు వారి వైవాహిక జీవిత వైఫల్యాల గురించి జరిపిన పరిశోధన సారాంశాలు! గొప్ప విద్యా వేత్త ఎన్నో పరిశోధన పత్రాలు రాశారు ఆయన! వివిధ విషయాలను అధ్యయనం చేసి, Phd లు చేశారు. వారు వేసిన ప్రశ్నలు ఈ నాటి నవతరం వైవాహిక వ్యవస్థలో విచ్చిన్న పాత్ర గురించి ఆయన ఆలోచన విధానం తప్పని చెప్పే ధైర్యం నాకు ఉంది కానీ ఆయన తట్టుకోగలడా? తట్టుకుంటే కదా నా పరిజ్ఞానాన్ని ఆయన ఇచ్చిన విలువ అనుకొని “సార్ మీరు గురివింద గింజ” అన్నాను. గురివింద గింజ తన నలుపు తాను ఎరగదు! ప్రొఫెసర్ గారు స్టన్ అయ్యారు ముందు మీ యాభై ఐదేళ్ల జీవితాన్ని వడబోయండి! మీరు ముప్ఫయి రెండేళ్ల వైవాహిక జీవితంలో మీ ఇగో తో మేడం ను ఎంత మానసిక క్షోభ కు గురిచేసి, మీరు కూడా గురై ఇప్పుడు “యూత్ మ్యారేజ్ లైఫ్” పై చేసే మీ పరిశోధనలు వారిపై ప్రభావం చూపావేమో అన్నాను!
Also Read: భయమంటే….నీకు హెచ్చరిక!
ఫోన్ పెట్టేశారు…! ఆయన ఇగో హార్ట్ అయిందని అనిపించింది…తరువాత అరగంటకు ఫోన్ చేశారు! అప్పుడు ఆయనతో జరిగిన సంభాషణ వల్ల ఈ ఆర్టికల్ పుట్టింది! 1980 తరువాత 1995 మధ్య జరిగిన వివాహాల్లో జన్మించిన పిల్లల్లో చాలా జంటలు మానసిక సంఘర్షణకు గురవుతున్నారు. 1982 నుండి పుట్టిన పిల్లల్లో వివిధ భావోద్రేకాలకు అన్యోన్య దాంపత్యానికి ఆమడ దూరంలో ఉన్నారు. అప్పటి పేరెంట్స్ అతి క్రమశిక్షణ, అతి గారాబం వల్ల వారి పెంపకం గాడి తప్పిపోయింది. ఇందులో అందరూ కాదు సుమా. మెజార్టీ శాతం పిల్లలపై మానసిక సంఘర్షణలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పైకి గంభీరంగా సాగుతున్న కుటుంబాల్లో ని వివిధ పరిస్థితుల్లో తల్లి /తండ్రి మధ్య తమ బాల్యంలో జరిగిన ఘర్షణల్లో తమను అన్వయించుకుంటూ ఇరవై ఒక్క ఏళ్లకే పెళ్లి అయిన అమ్మాయి భర్తతో కీచులాటలకు దిగడం భార్యపై చేయిచూసుకునే విద్యాధికులైన మరియు ఉద్యోగం చేస్తున్న వారు కోర్టు మెట్లు ఎక్కడానికి ముమ్మాటికీ వారి తల్లి దండ్రుల పెంపకం కారణం. జీవితం చాల బాగుంది అనుకుంటున్న దశలో పెన్ను నుండి కీ బోర్డుకు మారారు! అప్పుడప్పుడే కంప్యూటర్ యుగంలోకి ప్రవేశిస్తున్న కాలం అది!
“మరణం మనం విడిపోయే వరకు ఎప్పటికీ ప్రేమించండి” అని బాసలు పలికిన కాలమది!
అలాంటి దశలో ఇద్దరు ఉద్యోగం చేయడం గానీ లేదా అంతో ఇంతో అస్తిపరులున్న జీవిత భాగస్వామిగా ఉన్నవారు తమలో తామే పడిన అహంభావ వైఖరికి ఇప్పుడు మూల్యం చెల్లిస్తున్నారు. “నేను ఎప్పుడూ సరైనవాడిని, నా జీవిత భాగస్వామి ఎప్పుడూ నా ఆలోచనలకు విరుద్ధం ” అనే భావన వచ్చేది! అక్కడి నుండి మొదలయ్యే అహంభావం మీ జీవిత భాగస్వామికి మధ్య అహంకార ఘర్షణలు దారితీసేవి! మెల్లిమెల్లిగా వైవాహిక జీవితం లో శత్రుత్వం కోరలు తెరుచుకునేవి! మీరు విజేతగా ఎదగాలని, తన మాట వేద వాక్కని ఒకరికొకరు అధిగమించడానికి ప్రయత్నం చేసేవారు! అదే వైవాహిక జీవితం పతనానికి కారణం అయింది!
మీ వైవాహిక జీవితంలో అహం ఘర్షణలు ఎందుకు భయంకరమైన ప్రభావాన్ని చూపుతున్నాయని మీరు ఆలోచించక పోవడం వల్ల పడక గదుల వేరయ్యాయి. చెరో రూమ్ లో నిద్రించే పరిస్థితి ఏర్పడింది. డబుల్ బెడ్ రూమ్ ఇంట్లో పిల్లలను చెరొక్కరు చేరదీసి వారి బెడ్ ను ఆక్రమించి సంసార ఆగాదాన్ని సృష్టించుకున్నారు!
ఎందుకంటే మీరు మీ పార్ట్నర్ తో జీవితం పట్ల అహంభావంగా ఉన్నప్పుడు, మీ వైవాహిక జీవితం గురించి ప్రతిదీ దాని మనోజ్ఞతను కోల్పోయింది… మీ అహంభావ స్వభావం మీ ఇంటిలోని వాతావరణాన్ని కలుషితం చేసి మనసుల మధ్య అగ్నిపర్వతం రాజేసింది!
Also Read: వివాహ వ్యవస్ధ పయనం ఎటు?
ఆమె/ఆయన యొక్క దృక్కోణాన్ని వినడానికి మీరు ఇష్టపడలేదు! మీరు ఎల్లప్పుడూ సరైనవారని, మీ ఎదుటి వారిదే ఎప్పుడూ తప్పుగా ఆలోచన చేస్తున్నారని మీరు భావించారు! మీ వివాహంలో మరే ఇతర అంశాలు చేయలేని విధంగా అహం ఘర్షణలు మీ సంబంధాన్ని అక్షరాలా హత్య చేయడానికి కారణ భూతమయ్యాయి! అహం – ఘర్షణలు రెండూ ఒకదానికొకటి ఉదాసీనంగా మారాయి! మీ అహం మీ తప్పులను అంగీకరించడానికి మిమ్మల్ని ఎప్పటికీ అనుమతించదు కాబట్టి మీరు మీ జీవిత భాగస్వామి కి మధ్య గ్యాప్ పెరిగింది! అక్కడి నుండి పట్టింపులు మొదలయ్యాయి! రెండింటి యొక్క పరస్పర చర్య, చేదు వాదనలలో ప్రతి నిత్యం ఘర్షణే! ఇద్దరు తమ మాట నెగ్గాలనే స్వార్థపరత్వం వల్ల మీ పిల్లలపై ఆ ప్రభావం పడుతూ వచ్చింది! పంతాలు పట్టింపులతో ఒకరి నొకరు క్షమాపణ చెప్పలేక అహం అడ్డు వచ్చింది!
మీరు అనేక అంశాలలో మీరే బెటరన మీకు మేరే అనుకున్నారు…నేను కుటుంబానికి అధిపతి అని నా మాటే చెల్లాలనే మూర్ఖత్వం వల్ల పాతికేళ్ళ వైవాహిక జీవితంలో అపశృతులు ఎదురయ్యాయి! మీరు మీ జీవిత భాగస్వామి యొక్క భావాల పట్ల కఠినంగా వ్యవహరించి… మీ స్వంత కంఫర్ట్ లెవల్‌పై ఎక్కువ దృష్టి పెట్టారు!మీరు మీ సమస్యను ప్రేమతో కమ్యూనికేట్ చేయలేక పోయారు! మీరు మీ జీవిత భాగస్వామి కంటే చాలా రకాలుగా మంచివారని మీకు మీరే అనుకున్నారు! పరస్పరం మాటలతో మనసు గాయపరిచుకున్నారు!
మీరు మీ లైఫ్ పార్ట్నర్ ను మానసికంగా హింసించారు! మీ మధ్య మీకు తెలియకుండానే విస్తృత చీలిక ఏర్పడింది!
మిమ్మల్ని నిర్లక్ష్యం చేసినట్లు భావించారు! దీన్ని మీ రక్త సంబంధీకులు అడ్వాంటేజ్ గా తీసుకున్నారు…అప్పుడు ఎదుగుతున్న పిల్లల పై తీవ్ర దుష్ప్రభావం పడింది..ఇద్దరు అతి ప్రేమ చేయడం వల్ల యుక్త వయసు వచ్చాకా “అమ్మా నాన్న మీకేం తెలియదు” అనే పరిస్థితి చేజేతులరా మీ వారసులు నుండి మాట పడ్డారు! ఇన్నాళ్ళు ప్రేమతో కాక సమాజం కోసం కాపురం చేసారని నిజాన్ని తెలుసుకునే లోపే మీ పిల్లలు పెళ్లీడు కు వచ్చి టీనేజ్ లో తమకు సాంత్వన ఇచ్చే ప్రేమికుడి కోసం వేట ప్రారంభించి మీ మాట జవదాటారు!!ఇక నేటి తరం..కులం లేదు..మతం లేదు.. ఉన్నా కొత్త సంబంధాలు…నచ్చిన వారు కనబడితే… డేటింగ్ లు..
చాట్లు..ఫెస్ బుక్ స్నేహాలు.
Also Read: అమ్మకు ప్రతి రూపం కూతురు! అమావాస్య అదృష్టం ఆమెదే! పౌర్ణమి ఆటు పోట్లు ఆవిడవే!!
తల్లి దండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకోవడాలు…ఉద్యోగం ఇద్దరికి ఆర్థిక పటిష్టత అన్న కోణం తప్పా…భవిష్యత్ పరిణామాలు..ఆర్థిక పటిష్ఠతకు అలోచించకుండా తప్పటడుగులు వేస్తున్నారు… ఈశాన్య భారతం, లేదా ఉత్తర భారతం, అమ్మాయి/ అబ్బాయి దక్షిణాది అమ్మాయి/ అబ్బాయి తో ప్రేమ పెళ్లిళ్ళు లేదా ఖండాంతగ వివాహాలు ముందు గొప్పగా అనిపిస్తున్నాయి… కానీ వారి పేరెంట్స్ మధ్య కెమీస్ట్రీ కుదరడం లేదు… రెండు కుటుంబాల మధ్య ఆచార వ్యవహారాల గ్యాప్ ఏర్పడి..అత్త – కోడలు, కూతురు- అల్లుడు మధ్య కుటుంబ సన్నిహిత వాతావరణం లేదు…బాష పరిణామాలు, బంధుత్వాలు లేకపోవడం వారి మధ్య ఉత్తర దక్షిణ దృవాలు అయ్యాయి! ఇంటర్ ఫెత్ సంబంధాలు ఒక జంటకు ఉంటే కాదు…మొత్తం కుటుంబం మధ్య సయోధ్య కుదిర్చే ఓపిక కొత్త జంటలకు లేక పోవడం వల్ల మంచి చెడు చెప్పలేని పెద్దలు వారికి కరువయ్యారు. చిన్నప్పుడు అమ్మా నాన్నా పడ్డ ఘర్షణలు వాళ్ల కళ్ల ముందు కనబడుతున్నాయి. పెళ్లి మోజు తీరే లోపే ప్రెగ్నెన్సీ ఇక కష్టాలు మొదలు.
అటు పెద్దల ఆదరణ లేకపోవడం…ఇటు ఒకరి సంపాదనకు బ్రేక్ పడడం వల్ల మానసిక సంఘర్షణలు పోయి పరస్పరం దూషించుకునే స్థాయి అప్పుడు కూడా తల్లి దండ్రుల జోక్యం!! కూతురు ‘నేను పెద్ద తప్పు చేశాను” అనే వాటికి అతి ప్రేమతో దగ్గరకి తీయడం వల్ల ఆ దాంపత్యంలో మూడో వ్యక్తుల ప్రమేయం.. ఇక అంతే…కోర్టు మెట్లు, విడాకుల పత్రాలు! న్యూ జెనరేషన్ లో “ఏడు తరాల” ఆత్మీయతలు బోధించే తల్లి దండ్రులు ‘మీ నాన్న లాగా అమ్మ లాగా” అంటూ ఉదాహరణలు ఇస్తూ వారికి తెలియకుండానే చిచ్చు పెడుతున్నారు…ఒకటా రెండా మోడు వారి పోయిన జంటలు వందల సంఖ్యలో ఒంటరి జీవితం గడుపుతున్నారు. ఇంట్లో కూతురు కొడుకు విరహ వేదనలు …మానసిక వేదనలు చూసి ఇంకో పెళ్లి వైపు ఆలోచిస్తున్నారు. తప్ప గాడి తప్పిన జంటలను ఒక దరికి చేర్చే ప్రయత్నం చేయక లేక పోతున్నారు…దానికి పెద్ద వాళ్ళు చెప్పే కారణం… “మనసు విరిగిన వారిని కలపడం నిష్ప్రయోజనం” నిజంగా పెద్దలు చేయవలసింది అది కాదు…ఆ గ్యాప్ కు కారణభూతమైన సమస్యను అధిగమించి ఒక మెట్టు దిగి పిల్లల భవిష్యత్ ను సరిదిద్దే ఆలోచన చేయాలి.
“మీకు ఏమి తెలియదు” అన్న పిల్లల మాటలు వీళ్ళ చొరవకు అడ్డు వస్తున్నాయి. సంసారం సాఫీగా ఉన్న కూడా అల్లున్ని అదుపులో పెట్టుకొమ్మని నూరి పొసే తల్లులు, కోడలు నీ జవ దాటవద్దు అని కొడుకు ను చేతులో పెట్టుకునే అత్తల వల్ల, కూడా సంసారాల్లో మంటలు చెలరేగుతున్నాయి. స్వయంకృత అపరాధాలు, నిలకడ లేని ఉద్యోగాలు, ఆర్థిక క్రమ శిక్షణ లేని కారణంగా సమస్య జటిలం చేసుకుని విడిపోతున్నారు! దీనికి పెద్ద మనసుతో కౌన్సిలింగ్ చేసే ఓపిక పెద్ద వాళ్లకు ఉండడం లేదు…యాభై ఏళ్ళ వయసులో ఈ నాటి తరం చేసే పొరపాట్ల ను చక్కదిద్దే రైట్ ను పెద్దలు తీసుకోకపోవడం వల్ల వాళ్లకు పుట్టిన బిడ్డలు అనాధలు అవుతున్నారు! పిల్లల వ్యవహారశైలి ని చక్కదిద్దడంలో కూడా పేరెంట్స్ మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి! పాత విషయాలను తవ్వు కోవడం…అప్పుడేదో బాగుంటే ఇప్పుడు ఈ లాంటి సమస్యలు ఉండక పోను అని తిరిగి గదులు వేరు…కాపురాలు వేరు! దీని వల్ల ఈ వయసులో కూడా సఖ్యత లేని కారణంగానే రోగాలు… నొప్పులు!!ఈ సమస్యలకు కారణం విషయ పరిజ్ఞానాన్ని సంపూర్ణ దశలో పిల్లలకు హిత బోధ చేయకపోవడమే. కూతురు దగ్గర చిన్న పిల్లల సంరక్షన్లకు కు నాలుగు రోజులు ఉండే తల్లి గత అనుభవాల సారాంశాన్ని కూతురు ముందు ప్రస్తావన తేకుండా, మానవ సంబంధాల మాధుర్యాన్ని పంచాలి…అప్పుడే సరికొత్త సంసారాలకు మార్గ దర్శకం అవుతారు!
Also Read:ఆడపడుచుల పుట్టింటి మమ ‘కారం’ !