Sunday, December 22, 2024

సంతోషం

సంతోషంగా ఉండు

ఉత్సాహంగా ఉండు

చురుగ్గా ఉండు

అందరూ చెప్తారిదే.

ఏం చూసి సంతోషం?

స్వార్ధం నిండిన మనుషులను చూశా

ఈర్ష్య నిండిన మనసులను చూశా

క్రౌర్యం, మోసం నిండిన జీవితాలు చూశా

డబ్బు, పాడిత్యంతో పెరిగిన అహంకారం చూశా

ప్రయోజనం ఆశించే బంధాలు చూశా

ఏం చూసి సంతోష పడాలి.

మంచి మాట చెబితే

సోక్రటీసు నెత్తిన నీళ్లకుండ పగిలింది

క్రీస్తుకు శిలువ పడింది

కొత్త ఆలోచన చేస్తే జీవితమే ఒక శిక్ష

సమాజాన్ని దాటి ముందుకు చూస్తే కక్ష

చచ్చింతరువాతే పురస్కారం.

సంతోషంగా ఉత్సాహంగా ఉన్నట్లు

నటించడం ఎవరికోసం

ఎవరిని మోసం చేస్తున్నావ్ 

నీ కళ్లు నువ్వే మూసుకొని

నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావ్

నిజాన్ని చూడలేని వాడివి

దాన్ని జీవితంలోకి ఎలా తెచ్చుకుంటావ్

అసత్యాంధకారంలో ఎందాక జీవిస్తావ్?

రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్. చదివింది ఆంగ్ల సాహిత్యం అయినా తెలుగులో కవిత్వం రాస్తారు. ఇతనికి స్వామి చిన్మయానంద, సాయినాధుని శరత్ బాబుజీల కొన్ని రచనల్ని తెలుగులోకి అనువదించే అవకాశం లభించింది. కొన్ని సాహిత్య విమర్శనాత్మక వ్యాసాలు రాశారు త్రివేణి, మిసిమి లాంటివాటిలో. చెప్పదలచుకున్నది కొద్ది మాటల్లోనే వ్యక్త పరచడం ఇతని కవిత్వ లక్షణం. భావుకత, లోతైన ఆలోచన, ఆధునికత, వేదంత విషయాలపై మక్కువ,భాషపై పట్టు ఇతని కవితలలో కనిపిస్తాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles