జాన్ సన్ చోరగుడి
‘గులాబీని ఏ పేరుతో పిలిస్తేనేం, అది వెదజల్లే సుగంధం ముఖ్యంగానీ…’ అంటాడు విలియం షేక్స్పియర్. ఆయనలా అనేసరికి,ఆయనమాట- ‘పట్టింపు’తో మన తెలుగువాళ్ళు కూడా పేరులో ‘నేముంది’? అనిఅప్పట్లోనే- ‘ఫన్నే’సారు! నిజానికిఇవన్నీపాతకబుర్లు. అయితే, మళ్ళీ ఇప్పుడు అవి ఎందుకు? అంటే, విభజన తర్వాత జరుగుతున్న నామకరణాల జాబితాలో బెజవాడలోని ఆరోగ్యయూనివర్సిటీకూడా చేరింది. నిన్నఅసెంబ్లీలో ప్రభుత్వం ఈ పేరు మార్పు నిర్ణయం ప్రకటించింది.
Also read: దక్షిణాదిన ఏ. పి. ‘పోస్ట్-మండల్’ రాష్ట్రం కానుందా?
మొదటి నుంచి మనకు తెలిసిందిఒక్కటే ‘బడి’ (‘స్కూల్’) కనుక, అదే ధోరణిలో దీనిపై చర్చలు, భిన్నఅభిప్రాయాలు వెలుబుచ్చడం, జరుగుతూఉంది. ‘అన్నిరోడ్లు రోమ్ నగరం చేరతాయి…’ అనే పాత నానుడి మాదిరిగానే, ఇది- రాజకీయంగాఎవరికెంత ప్రయోజనం? అనే దృష్టినుంచే- ప్రధాన, సమాంతర మీడియాల్లో ఇప్పుడు దీనిపై చర్చ జరుగుతూ ఉంది. చిత్రంగా- ఈప్రభుత్వాన్ని, ఈ సి.ఎం.ను సమర్ధించే వారు కూడా ఈ నిర్ణయాన్నిఅంగీకరించలేక పోతున్నారు. అందుకు వారి కారణాలువారు చెబుతున్నారు.
Also read: ‘అభివృద్ధి’ పట్ల తెలుగు సమాజం వైఖరి ఎటువంటిది?
ఇప్పుడునడుస్తున్న- ‘ట్రెండ్’లోఇదొక వారంరోజుల విషయం, తర్వాత పూర్తిగా ఇది ఆఫీషియల్ అవుతుంది, ప్రభుత్వం జి.ఓ. విడుదల చేసాక,యూనివర్సిటీ గవర్నింగ్ బాడీ సమావేశంలో దీన్ని ఆమోదించి, ఇక ముందు ఈ పేరు మార్పును అమలు చేయవలసి ఉంటుంది. యూనివర్సిటీ స్టేషనరీ విభాగం కొత్త- ‘లెటర్ హెడ్స్’ ప్రింట్ చేయడంతో,పరిపాలన ఎప్పటిలా షరామామూలు అవుతుంది.
పైన ‘బడి’ (‘స్కూల్’) అన్నందుకు,ఇప్పుడు మనకు తెలియని- ‘బడి’ ఏమిటి? అనేది కూడా చూద్దాం. ప్రపంచీకరణ తర్వాత, ఐక్యరాజ్యసమితి పక్షంగా- ‘యు.ఎన్.డి.పి’ (యునైటెడ్ నేషన్స్ డెవలప్ మెంట్ ప్రొంగ్రాం) ద్వారా పేదరిక నిర్మూలన, నిరంతర ఆర్ధిక వృద్ధి లక్ష్యంగా 170 దేశాల్లో- ‘సస్టెయిన్డ్ డెవలప్ మెంట్ గోల్స్’ (ఎస్.డి.జి.) సాధనపై ఇప్పుడు పనిచేస్తూ ఉంది. అందులోమనదేశము ఉంది. అదిచ్చిన 17 అంశాల్లో- 1. పేదరిక, 2. ఆకలి, 3. ఆరోగ్యం (గుడ్ హుల్త్ అండ్ లీవింగ్). ఈ అంశాల్లో రాష్ట్రాల పని తీరును మన దేశంలో ‘నీతిఆయోగ్’ మదింపుచేస్తున్నది.
ప్రభుత్వాల పనితీరు అంచనాకు ఇప్పుడు ఇదొక కొత్త ‘బడి’ లేదా- ‘స్కూల్’ అయిందని, అదే ప్రామాణికంగా మారిందనే సంగతి మన రాజకీయులకు పోనీ అజలోకి రాకపోయినా, మన విశ్లేషకులు కూడా ఇది బొత్తిగా తెలియని జాగా అయింది! దాంతో పైన చెప్పిన ప్రధాన, సమాంతర మీడియాల్లో కూడా వీళ్ళు తమకు తెలిసిన పాత ‘కొలమానాలు’తోనే ప్రతిదీ అంచనా వేస్తున్నారు, దాన్నే కెమెరాల ముందుకు వచ్చి ఆపార్టీ ఈపార్టీ అంటూ వారు చెబుతున్నారు.
ఇక్కడ క్షేత్రస్థాయివాస్తవం ఏమంటే, U.N.D.P. నుంచి వస్తున్న మార్గదర్శకాల సమాచారం ఇప్పుడు ఈ 170 దేశాల్లోని రాష్ట్రాలకు, అది ఆయా స్థానిక భాషల్లోకి మారి, అంచెలంచెలుగా అవి పంచాయతీ స్థాయిలోని ప్రాధమిక ఆరోగ్యకేంద్రం వరకు చేరుతున్నాయి. ఇన్నిదశలు దాటవలసిన ఇటువంటి- ‘కమ్యూనికేషన్ చైన్’ అవసరం ఉన్నప్పుడు, ఎక్కడైనా ఆసంస్థ- ‘లోగో’ (గుర్తు) ఇక్కడ కీలకం అవుతుంది. అటువంటిది ఒకటి ఉన్నప్పుడు, క్రింది స్థాయి వరకు సమాచారం చేరే క్రమంలో, ప్రాధమిక అక్షరజ్ఞానం లేని వారికి కూడా, కాలక్రమంలో- ‘లోగో’ ద్వారా వారు ఆప్రోగ్రాంకు- ‘కనెక్ట్’ కావడం తేలిక అవుతుంది. ఇదంతా- ‘విజువల్ కమ్యూనికేషన్’కు సంబంధించిన సాంకేతిక అంశం.
Also read: మోడీ-జగన్ లను దాటి మరీ చూడగలిగితే…
మనవద్ద ఇప్పుడు ఈ నామకరణం ఉదంతంలోను పైనచెప్పిన సూత్రమే వర్తిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత మూడేళ్ళుగా సరికొత్త దృష్టితో-‘విలేజ్ క్లినిక్స్ ‘ ‘ఫ్యామిలీడాక్టర్’ వంటి వైద్య సేవలు సూక్ష్మ స్థాయిలో నిరుపేదవరకు తీసుకు వెళ్ళాలి అనే లక్ష్యంతోఉంది. అలాఉన్నప్పుడు, రాష్ట్రంమొత్తానికి ఒక్కటే ఉన్న- హెల్త్ యూనివర్సిటీ నుంచి- మెడికల్ కాలేజీలు, ఫార్మసీకాలేజీలు, నర్సింగ్ కాలేజీలు వరకు; అలాగే, క్షేత్రస్థాయిలో క్రిందనున్న ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు నుంచి పైనున్న బోధనఆసుపత్రులు వరకు నిరంతరం- ‘టు-వే కమ్యూనికేషన్’ అవసరమవుతుంది. అందువల్ల దీన్ని ప్రత్యేకమైన- ‘స్పెషలైజ్డ్ జోన్స్’గా పరిగణించ వలసి ఉంది.
అటువంటప్పుడు- యూనివర్సిటీ పరిధిలో క్రింది స్థాయిలో రాష్ట్రమంతా విస్తరించి వున్న ఉన్నఅన్నివిభాగాలకు ఇప్పటి ప్రభుత్వం పెట్టిన- ‘వై.ఎస్.ఆర్.’ అని, వాటన్నిటికీ పైన ఉన్నయూనివర్సిటీకి మూడు దశాబ్దాలు క్రితం పెట్టిన ‘ఎన్ఠీఆర్’ అని మరొక పేరు అవుతున్నది.అది- ఇక్కడ-‘టువే – కమ్యూనికేషన్ చైన్’కుఆటంకం కలిగించే సాంకేతిక పరమైన అవరోధం అవుతుంది. అయితే, ప్రభుత్వం పేరు మార్పు విషయంలో తీసుకున్నఈ నిర్ణయంలో ‘విజువల్ కమ్యూనికేషన్’కు సంబంధించిన ఇటువంటి సాంకేతిక సమీక్ష జరిగిందా లేదా, అనేది ఒక అంశం అయితే; రాష్ట్రంలో ఇప్పుడు నెలకొనివున్న పరిస్థితుల్లో ఇటువంటి వివరణ జనసామాన్యానికి అంగీకారం అయ్యేట్టుగా ఇవ్వడం కూడా ఏ స్థాయిలోను సాధ్యమయ్యే పనికాదు.
Also read: జగన్ దావోస్ తనతో తీసుకెళ్ళింది ఏమిటి?
ఎందుకంటే-తెలుగుపౌరసమాజాన్నిఏదోఒకరోజు ఒక- ‘ఎలివేటెడ్’ స్థాయిలో చూడాలి, అని మన- ‘ఒపీనియన్ మేకర్స్’ కూడా అనుకోవడంలేదు!
Also read: ‘దావోస్’లో ఈ రోజు మనం ఎందుకున్నామంటే…
(రచయిత అభివృద్ధి-సామాజిక అంశాల వ్యాఖ్యాత)
It is improper to change of NTR Health University as YSR health University
Hence it is good for all As NTR&YSR Health University
generic function is same to by changing name , commitment of CEO/CM may feel some difference.But it appears to be a brownring test for opposition/CBN’s loyalty &expose the episode of viceroy incident and the treatment meted at the old age of Great sri NTR;
Here every thing is in the Name!
Name lone (anthaa) unnadi😊