అడవిలో ఎవడో ఒకడు ఒక చెట్టును కొడుతుంటే
పక్క చెట్లు ఏం చేస్తాయి?
ఒక్కొక్క గొడ్డలి వేటుకూ ఉలిక్కిపడుతాయి,
ఆకుల కన్నీళ్లు రాల్చుతాయి,
శివమెత్తినట్లు
గాలిలేకుండానే కొమ్మలు, కాండాలు ఊగిపోతాయి.
అంతవరకే!! అయినా నయం!
కాలు, చేయి, నోరు ఉన్న మనుషులు వేరే!
పక్కవాడి వెన్ను విరుగుతుంటే,
కళ్ళవెంబడి రక్తం కారుతుంటే,
కాళ్ళు తడబడుతుంటే…
కొందరు చూసి చూడనట్లు తలలు తిప్పేలేస్తారు
కొందరు గట్టిగా కళ్ళు ముసుకొంటారు.
చలనం లేక, చైతన్యం చచ్చి, కొందరు
పాడె పైని శవాలలా అటుఇటు చూడక సాగిపోతారు.
ఇది క్షాత్రమ్ చచ్చిన మానవజాతి!
ఇంకో కృష్ణుడు పుట్టినా వినే అర్జనులు నాస్తి!!
Also read: అనాథ
Also read: రూపం
Also read: గాయం
Also read: పగిలిన గాజు పెంకు
Also read: జగన్నాథ రథచక్రాలు