ధర్మం అంటే విధి నిర్వహణ కాదు
ధర్మం అంటే దానం చేయడం కాదు
ధర్మం అంటే సహాయం చేయడం
అందుకే ధర్మరాజులు, ధర్మకర్తలు అనే పేర్లు.
ధర్మం అంటే మతం కాదు
ధర్మం అంటే బాధ్యత కాదు
ధర్మం అంటే అందరికి క్షేమం కలిగించడం
ధర్మం అంటే కొంత వదులు కోవడం.
ధర్మం అంటే మరొకరిని హింసించడం కాదు
ధర్మం అంటే ఇతరులను చంపడం కాదు
ధర్మం అంటే గుళ్ళు, మసీదులు, చర్చిలు కాదు
ధర్మం అంటే పూజలు, ప్రార్ధనలు కాదు
నలుగురూ మంచిగా, ఆనందంగా బ్రతికే మార్గం.
బిచ్చగాడు ధర్మం చేయమంటాడు
బాధితుడు ధర్మం చేయమంటాడు
దేవాలయ అధికారని ధర్మకర్త అంటారు
యముడిని యమధర్మరాజు అంటారు.
చెడుపై యుద్ధం నీ ధర్మం అన్నాడు కృష్ణుడు
స్నేహధర్మంతో అధర్మం వైపు యుద్ధం చేశాడు కర్ణుడు
ధర్మానికి ఎన్ని అర్థాలున్నా, ఎన్ని రూపాలున్నా
అధర్మం నశించి చివరకు మిగిలేది ధర్మమే.
Also read: “పురోగతి”
Also read: “మిడిల్ క్లాస్”
Also read: “మానవ హక్కులు”
Also read: “ప్రేమ టూ వే”
Also read: రాజ్యాంగం