సద్గురు సాయిబాబా
అల్లా మాలిక్ అన్నాడు
శాస్త్రాలు చెప్పిన శరణాగతి అదే
ఎవరికీ ఏమీ బోధించలేదు
రెండు మాటలే చెప్పాడు
శ్రద్ధ, సబూరి(ఓపిక) అని
అదే మనకు మార్గదర్శనం.
శ్రద్ధ చదువుతో అలవాటైతే
గురువు సాన్నిధ్యంలో స్థిరపడితే
తరువాత ప్రతిపనిలో కనుపిస్తుంది.
విద్యావనంలో నలుగురితో కలిస్తే
స్వార్ధం తరిగి ఓపిక పెరుగుతుంది.
సద్గురు చెప్పిన మాటల సారం
నీ గురువు దగ్గర నేర్చుకుంటే
బతుకు నల్లేరు మీద బండి
గురువును కించపరచే సమాజంలో
ఎన్ని డిగ్రీలు తెచ్చుకున్నా
ఎంత డబ్బు సంపాదించినా
జీవితం పల్లేరు మీద నడకే
ఆనందం అందని పండే.
Also read: నిందాకృష్ణ
Also read: అంధాంద్ర
Also read: స్వామి
Also read: దేవుడు
Also read: స్సందన