Tuesday, January 21, 2025

మహాన్ భారత్ ఏమైపోతోంది?

నా మహాన్ భారత్ కు ఏమైంది? పాలకుల నిర్ణయాల ఫలితంగా ఎన్నో త్యాగాల, ఉద్యమాల కారణంగా సిద్దించిన స్వాతంత్ర లక్ష్యం ఏమైపోతోంది? పాలకుల నిర్లక్ష్యం విచ్చలవిడి నిర్ణయాల పలితంగా దేశం ఏమైపోతోంది. దేశం సంపదను అమ్ముకుంటున్నారు. ప్రభుత్వానికి డబ్బులు అవసరం పేరిట తీసుకుంటున్న చర్యలు, నిర్ణయాలు ఎవ్వరు ఎన్నడూ ఊహించలేదు.

లాక్ డౌన్ ప్రభుత్వానికి ఒక సాకు

కరోనా మహమ్మారి లాక్డౌన్ పాలకులకు ఒక సాకు గా మారింది. ప్రపంచంలో ఎక్కడా లేనంతగా హ్యూమన్ రిసోర్స్ ఉన్న భారత్ లో కష్టబడే వాడికి ఉపాధి ప్రైవేటీకరణ పలితంగా కార్పొరేట్ వాడి దయా దాక్షిణ్యం పై ఆధారపడే పరిస్థితి వచ్చేసింది. 2003 నుంచి 2020 నాటికి ప్రభుత్వ రంగాల్లో 17 లక్షల 55వేల ఉద్యోగాలు పోయాయి. 33 లక్షల 69వేలు ఉన్న వీరి సంఖ్య సుమారు 15 లక్షలకు పడిపోయింది. ప్రభుత్వ రంగంలో పెట్టుబడుల ఉపసంహరణల వల్ల ఇది జరిగింది. ప్రైవేటీకరణ వల్ల ఏడు లక్షల ఉద్యోగాలు వచ్చినా అందులో రిజర్వేషన్లు లేవు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులు లేవు. జీతాలూ తక్కువే. 23 పీఎస్యూల (ప్రభుత్వరంగ సంస్థల) ప్రైవటీకరణకు నిర్ణయించారు. ఇందులో 33,279 మంది పని చేస్తున్నారు.   ప్రైవేటీకరణ జరిగినపుడు 50శాతం మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. నో రిజర్వేషన్స్.. అంతా వారి ఇష్టమే.

Also Read : 16 నెలలుగా వేతనాలు లేని ఆర్పీ లు

ఉపాధిపై దెబ్బ

బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇండియన్  ఓవర్సిస్ లాంటి నాలుగు బ్యాంకులను ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఇందులో ఒక లక్షా 22వేల మంది పని చేస్తున్నారు. కష్టంగా 25 నుంచి 30 వేల మందికే ఉపాధి మిగిలే పరిస్థితి ఏర్పడింది. 55 వేల 901 కోట్లు మార్కెట్ క్యాపిటల్ ఉంటే రుణాలు వసూలు కానివి ఒక లక్షా 41వేల 749కోట్లు ఉన్నాయి. ఆర్బీఐ లెక్కల ప్రకారమే మొత్తం 100.46 లక్షల డాలర్ల పబ్లిక్ మనీ బ్యాంక్స్ లో ఉంది. రుణాలు రూ.18 లక్షల కోట్లు ఉంటే రైట్ ఆఫ్ చేసింది రూ. 18 లక్షల కోట్లు ఉంది. ఐడిబిఐ ని ఎల్ఐసి కి ఇచ్చారు. ఇప్పుడు అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలనూ అమ్మకానికి పెట్టారు. 100 పీఎస్యూ లు కాగా 13 పీఎస్యూ లను వెంటనే అమ్మకానికి పెట్టారు. డిఫెన్స్ లోను ఇదే పరిస్థితి ఏర్పడింది.

పైసలు పెట్టేవారిదే పైచేయి

వ్యవసాయ రంగంలో సేవా రంగంలో సంస్కరణల పేరిట పైసలు పెట్టే వాడిదే పైచేయి.  పైసలు ఉన్నవాడిదే భూమి అన్నట్టు మూడు చట్టాలు తెచ్చి చట్టాల రద్దు కోసం రైతులు రోడ్లమీదికి వచ్చే విధంగా చేసింది బీజేపీ ప్రభుత్వం. దేశంలోని ప్రభుత్వ టీచర్ల ఖాళీలు 10 లక్షలకు పైగా సూల్స్ లో ఉన్నాయి. బీహార్. యూపీ లాంటి స్టేట్స్ లోనే ఖాళీలు ఎక్కువ ఉన్నాయి. యూనివర్సిటీలలో టీచింగ్, నాన్ టీచింగ్ ఖాళీలు.. అటు సెంట్రల్ యూనివరిసిటీలోనూ ఇదే పరిస్థితి. ఆత్మనిర్బర్ ప్రైవేటీకరణతోనే సాధ్యం అనుకుంటున్న ప్రభుత్వం నిరుద్యోగుల విషయాన్ని ఆలోచించడమే మానేసింది.

Also Read : బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం పై నిషేధాజ్ఞలు కొనసాగింపు

మోదీ హయాంలో భారీ ప్రైవేటీకరణ

ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం 6లక్షల50వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ప్రభుత్వ రంగం నుంచి ఉపసంహరించు కోవడం జరిగింది.వాస్తవానికి సమాజాన్ని దృష్టిలో ఉంచుకుని దివంగత మాజీ ప్రధానులు నెహురూ.. ఇందిరాగాంధీ 1954, 1969 లలో తెచ్చిన ప్రభుత్వ రంగాల విధానం జాతీయకరణ విధానాలను పీవీ నరసింహారావు అమలు చేసిన నూతన ఆర్థిక, పారిశ్రామిక విధానాలతో వమ్ము చేశారు. మన్మోహన్ సింగ్ అదే కొనసాగించారు. ఇప్పుడు మోదీ అయితే దేశాన్నే ప్రైవేట్ వారి చేతుల్లో పెడుతున్నారు. వ్యవసాయ రంగంలో మోదీ తెచ్చిన చట్టాలను సకల జనులు వద్దు మహాప్రభో అంటున్నా ఆయన వినడం లేదు. దేశ ఆర్థిక పరిస్థితి విషమంగా అతలాకుతలం గా మారింది.. దీనికి మందు ప్రైవేటీకరణ మంత్రమే అనే విధంగా మోదీ ప్రభుత్వం ఉంది.

నిర్దిష్టమైన వ్యవసాయ విధానం లేదు

దేశంలో వ్యవసాయం విషయంలో ప్రభుత్వానికి ఒక నిర్దిష్ట విధానం లేదు. ఖచ్చితత్వం లేదు. రద్దు కు నో అంటూనే ఏడాదిన్నర చట్టం అమలును వాయిదా వేస్తామంటారు. ఎమ్మెస్పీ పై చట్టం గ్యారంటీ విషయంలో స్పష్టత లేదు. బెంగాల్ ఎన్నికలలో గెలవాలని ఒకే ఎజెండా తో ముందుకు పోతున్నారు. అంతా విచ్చలవిడి తనం పార్లమెంట్ లో బలం ఉంది కాబట్టి అదే జబర్దస్తీ బయట కూడా చేస్తామంటే ఎలా ఉంటుంది? ప్రజాస్వామ్య వ్యవస్థలో భారత  దేశంలో అది సాధ్యమైన పని కాదు.  దేశాన్ని అమ్మేస్తున్నారు. కష్టజీవుల కడుపుకొడుతున్నారు.  ప్రకృతి ఇచ్చిన సంపదను టోకు గా అమ్మేస్తున్నారు. ప్రైవేటు శక్తులకు ధారాదత్తం చేస్తున్నారు. ఎన్నికల్లో తాము అధికారంలో రావడానికి పీడిత, తాడిత శ్రామికులను వారి చెమట చుక్కలను.. ఈదేశానికి ప్రకృతి సహజంగా ఇచ్చిన సంపదను పీల్చి పిప్పి చేసిన సంపద నుంచి వేల కోట్లు రూపాయలు ఎన్నికల నిధులు ఇచ్చే ఆదాని.

Also Read : సింగరేణిలో ఎంఎల్సీ ఎన్నికల లొల్లి

గుత్తేదార్లకు సర్వాధికారాలు

అంబానీ లాంటి ఈ దేశం గుత్తేదార్లుకు సర్వ అధికారాలు ఇవ్వాలని భావిస్తున్నారు. పాలనా వ్యవహారాలు సైతం సమాంతరంగా ప్రస్తుతం అన్నిటిలో దుర్గంగా కనిపిస్తున్న కార్పొరేట్లకు అప్పచెబితే అయిపోతుందని కూడా విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు.  అంతా దేశంలో ప్రైవేటీకరణ అవుతున్నపుడు పాలన సంగతి ఏమిటి అనే ప్రశ్న సామాన్యుడిని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.. ఈ దేశంలో కుల మతాలకు అతీతంగా జీవించే మట్టి మనుషులను లెక్క చేయకుండా, రైతుయాత్రలను ఆందోళనలు పట్టించుకోని వారిని ఏమనాలి అంటూ సామాన్యులు సైతం ఆందోళన చెందుతున్నారు.. మోదీ జీ జర అన్నదాతలను పట్టించుకొండని కోరుతున్నారు. ఢిల్లీ బోర్డర్లలో రైతుల ఆందోళన జరగబట్టి మూడు నెలలు దాటినా వారి డిమాండ్ల వైపు వారు కోరుతున్న ఎమ్మెస్పీ వైపు దృష్టి కన్నా 5 రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసమే మోదీ ఎక్కువ దృష్టీ పెట్టారు. ఇదేనా దేశాన్ని పాలించే విధానం?

Also Read : బీజేపీపై టీఆర్ఎస్ దళిత శాసనసభ్యుల ధ్వజం

Muneer MD
Muneer MD
Special Correspondent from Mancherial

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles