————
(‘DEATH ‘ FROM ‘ THE PROPHET ‘ BY KAHLIL GIBRAN)
తెలుగు అనువాదం: డా. సి. బి. చంద్ర మోహన్
———————-
అప్పుడు ఆల్ మిత్రా మాట్లాడుతూ ఇలా చెప్పింది
“మనం ఇప్పుడు మరణం గురించి అడుగుదాం.”
ఆల్ ముస్తఫా ఇలా చెప్పసాగాడు :
మరణ రహస్యం మీకు తెలుస్తుంది
కాని, జీవన హృదయంలో వెతికితే తప్ప
దాన్ని ఎలా కనుగొంటారు?
పగళ్లు అంధురాలై ఉండి
రాత్రులు మాత్రమే చూసే
గుడ్లగూబ కళ్ళు
వెలుగు రహస్యాన్ని ఎలా ఆవిష్కరిస్తాయి?
నిజానికి,
మరణం ఆత్మను చూడాలంటే
మీ హృదయం తెరిచి, విశాలం చేసి
ప్రాణంతో ఉన్న మీ శరీరాన్ని చూడండి
ఎందుకంటే,
నది, సాగరాలు ఒకటే అయినట్లు
జీవన , మరణాలు ఒకటే!
మీ ఆశలు, కాంక్షల లోతుల్లో
జీవన — మరణాల ‘ ఆవల ‘
నిశ్శబ్ద జ్ఞానం దాగి ఉంటుంది!
హిమపాతం క్రింద
విత్తనాలు స్వప్నించినట్లుగా
మీ హృదయం వసంతాన్ని స్వప్నిస్తుంది
స్వప్నాలను విశ్వసించండి
శాశ్వతత్వానికి ద్వారం
స్వప్నాల్లోనే దాగి ఉంది!
గౌరవంగా రాజు గొర్రెల కాపరి పై చేయి వేస్తే,
అతడు ( కాపరి) వణికిపోయినట్లుగా —
మీ మరణ భయం కూడా మిమ్మల్ని వణికిస్తుంది!
రాజు జ్ఞాపికలు ధరిస్తాననే ఆనందం
ఆ పశుల కాపరి వణుకు వెనక
దాగి ఉంటుంది కదా!
అయినా ,
తన వణుకు గురించి ఆ కాపరి
ఎక్కువ ఆలోచిస్తాడు కదా!
గాలిలో నగ్నంగా నిలబడటం
సూర్యరశ్మిలో కరిగిపోవటం — మినహా
మరణం అంటే వేరే ఏముంటుంది?
అవిశ్రాంతమైన అలల నుండి
శ్వాసకు స్వేచ్ఛ నివ్వడమే — మరణం
ఆ శ్వాస పైకి పోయి , విశాలమై
దైవాన్ని కనుగొనటమే కదా మరణం అంటే !
మౌన నది నుండి జలాలు గ్రోలి తేనే
నిజంగా గానం చేయగలరు
పర్వత శిఖరానికి చేరితేనే
మీరు ఆరోహణ ఆరంభిస్తారు!
మీ చేతులు కాళ్లపై
నేలతల్లికి హక్కు వస్తేనే
మీరు నిజంగా నాట్యం చేయగలరు!
Also read: ఇద్దరు వేటగాళ్ళు
Also read: నది
Also read: ఆనందం
Also read: దేవుణ్ణి కనుగొనటం
Also read: డెభ్భై ఏళ్ళు