అమరులకు గుర్తింపు ఉంటుందని సీఎం ప్రజలనూ, ఎమ్మెల్యేలనూ నమ్మించారనీ, అమరుల కుటుంబ సభ్యులకు ఉద్యోగం, ఆర్ధిక సాయం, భూమి ఇస్తానని చెప్పారనీ, అమరవీరుల స్థూపం ప్రపంచం అచ్చర్యపోయెల నిర్మిస్తాం అన్నారనీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆక్షేపించారు. అమరుల స్థూపం నిర్మాణాన్ని పిీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రతినిధి దాసోజు శ్రవణ్, తదితర కాంగ్రెస్ నేతలు శనివారంనాడు సందర్శించారు.
Also read: నూతన సచివాలయ భవన ప్రాంగణలో కేసీఆర్ తనిఖీ
అధికారంలోకి వచ్చి ఏడేళ్ళు గడిచిపోయినాయనీ, మూడేళ్లు అసలు పట్టించుకొలేదనీ, 2017 లో అమర వీరుల స్తూపం నిర్మాణంకి 80 కోట్లు కేటాయించారనీ, ఏడాది వరకూ అసలు స్థూపం గురించి పట్టించుకోలేదనీ ఎద్దేవా చేశారు.
డిజైన్ అయ్యాక 63 కోట్ల 75 లక్షల తో 2018లో టెండర్ పిలిచారనీ, ఏడాదిలో పూర్తి చేస్తాం అని కెసిఆర్ చెప్పారనీ, టెండర్లను రెండు సార్లు వాయిదా వేశారనీ అన్నారు. చివరికి టెండర్ కేపీసీ ప్రాజెక్టుకు ఇచ్చారని అన్నారు. అది కామిశెట్టి పుల్లయ్య కంపెనీ అనీ, ఆయన పొద్దుటూరుకు చెందిన వ్యక్తి అనీ, కంపెనీకి ఇటువంటి నిర్మాణాలలో ఎటువంటి అనుభవం లేకపోయినా, దొంగ సర్టిఫికెట్ ఆధారంగా కాంట్రాక్ట్ అప్పగించారనీ ఆరోపించారు. ఇనుముతో, రేకులతో నిర్మించిన కట్టడానికి వ్యయం రూ. 177 కోట్లకు పెంచారని విమర్శించారు. అసలు రూ. 127 కోట్లు అంచనా కాగా ముఖ్యమంత్రిని మెప్పించి వ్యయాన్ని రూ. 177 కోట్లకు పెంచారని చెప్పారు. అయినప్పటికీ పని పూర్తి కాలేదనీ, సంవత్సరంలో పూర్తి కావలసిన పనులు నాలుగున్నర సంవత్సరాలైనా ఇంకా మొండి గోడలే కనిపిస్తున్నాయని రేవంత్ రెడ్డి దుయ్యపట్టారు.
Also read: రైతు బాగుపడాలంటే బీజేపీ ప్రభుత్వం పోవాలి: కేసీఆర్ ధ్వజం
సచివాలయం సరే, అమరుల స్థూపం సంగతేమిటి?
‘‘సీఎం పక్కనే ఉన్న సచివాలయం సందర్శన చేసి దసరా లోపు పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు, కానీ అమర వీరుల స్తూపం సంగతి ఎంటి, స్థూపం నిర్మాణం పొద్దు టురు వారికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, తెలంగాణ లో ఎవరు అర్హులు లేరా, పిడికెడు ఆంధ్ర కాంట్రాక్టర్ లు తెలంగాణ నీ దోచుకుంటున్నారు అని చెప్పింది నువ్వే, కెసిఆర్ కో డిఎన్ఎ టెస్ట్ చేయాలి, అసలు తెలంగాణ వాడే నా అని తేలాలి,’’ అంటూ విమర్శించారు.
Also read: కిషన్ రెడ్డిపైన హరీష్ ధ్వజం
టీ హబ్ నిర్మాణం లో కోట్ల రూపాయలు కొల్లగొట్టింది అని కాగ్ చెప్పిన సంస్థకే అమర వీరుల స్తూపం నిర్మాణం పనులు ఇచ్చింది. 300 శాతం బడ్జెట్ పెంచారు. అవినీతికి కేటీఆర్, అతని ఫ్రెండ్ తెలుకుంట శ్రీధర్ రే కారణం. ఈ కుంభకోణం బయట పడాలంటే.. విచారణ కమిటీ వేయాలి. ఆలస్యానికి కారణం ఏంటో బయట పడాలి. ఆంధ్ర కాంట్రాక్టర్ కు ఇవ్వడనికి కారణం ఏంటీ. కెసిఆర్ కుటుంబాన్ని వెలివేయలి. సాంఘీక బహిష్కరణ చేయాలి,’’ అంటూ తీవ్ర పదజాలం ప్రయోగించారు.
Also read: గట్టిగ మాట్లాడితే దేశద్రోహి అంటరా? బీజేపీకి కేసీఆర్ సూటి ప్రశ్న
బలిపశువులైన ఉద్యమకారులు: దాసోజు శ్రవణ్
‘‘ఫామ్ హౌజ్ లు, భవనాలు కట్టుకోడానికి డబ్బులున్నాయి. కానీ అమరవీరుల స్తూపానికి డబ్బులు లేవా.. అసలు చనిపోయిన వాళ్లు ఎంత మంది. 1200 మంది చనిపోయారు అన్నారు.. కానీ సర్కార్.. 500 మందే అని అంటోంది. అమర కుటుంబాలకు… ఉద్యోగాలు లేవు, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు లేవు, ఆర్ధిక సాయం లేదు. అమర కుటుంబాలు భిక్షగాల్లుగా మార్చేసింది సర్కార్.ఈ అమరవీరుల స్తూపం.. 1200 మందిదా.. లేక కెసిఆర్ గుర్తించిన 500 మందిదా. కెసిఆర్ క్షుద్ర రాజకీయంలో.. ఉద్యమకారులు బలి పశువులయ్యారు,’’ కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ వ్యాఖ్యానించారు.