యుద్దమంటే
తల్లికి బిడ్డ దూరమయిపోవడం
యుద్దమంటే
భార్య కి భర్త దూరమయిపోవడం
యుద్దమంటే
నేస్తానికి నేస్తం దూరమయిపోవడం
యుద్దమంటే
భయం పడగ నీడలో జాతులు
వణికీ పోవడం
యుద్దమంటే
చరిత్ర
పుడమి గర్భం లోకీ
వెళ్ళి పోవడం
యుద్దమంటే
అహంకారానికి కంకాళాల
హారం వెయ్యడమే !
యుద్లమంటే మనిషే
పంచ భూతాలకూ
“భూతం” గా
మారిపోవడం !
విశ్వ శాంతి అంటే
యుద్దానికి యుద్దానికి మధ్య
విశ్రాంతి గా
మారిపోవడం !
Also read: దూరం
Also read: కాలం ఆగిపోయింది
Also read: అంతర్వాహిని
Also read: విలువలు
Also read: సెన్సేషన్ నాగా