కవి అంటే ‘metrical composer’ మాత్రమే కాదు. కవి సత్యదర్శి, సమాజానికి మార్గదర్శి, సౌందర్య పిపాసి, రసాస్వాది, స్వాప్నికుడు, మనీషి, “Poets are unacknowledged legislators of the world.” చందస్సు వాడకపోయినా, పూర్తిగా వచనం రాసినా అందులో కవిత్వముంటే అతను కవి. ‘నానృషి కురుతే కావ్యం’ అన్నట్లుగానే ‘రసాత్మకం కావ్యం’ అన్నారు. మనసులోని భావావేశాన్ని రసస్ఫోరకంగా విషయానికి తగిన భాషా పటిమతో చదువరి మనసుకు చేర్చేది కవిత్వం (Poetry). అది విశిష్ట స్థాయిలో ఉంటే దాన్ని కావ్యం (Classic) అన్నారు. దేశ కాలాలను అధిగమించి మానవ కల్యాణానికి ఉపయోగపడేది ఇతిహాసం (Epic).
Also read: కొంతమంది సమకాలీన భారతీయ ఆంగ్లకవుల కవితల పర్యావలోకనం
Greek, Latin కావ్యాల ప్రభావం నుండి Shakespeare (16వ శతాబ్దం) నాటికే ఆంగ్ల సాహిత్యం బయట పడింది. కాని సంస్కృత ప్రభావం నుండి తెలుగు ఈనాటికీ పూర్తిగా బయట పడలేదు. గిడుగు చెప్పేంత వరకు జనానికి అర్థమయ్యే భాష లేదు. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, RS సుదర్శనం దాకా సాహిత్య విమర్శ లేదు. ఆధునికుల మెరుపులకు జడిసి కళ్లు మూసుకుంటున్నాం కాని మెరుపులు మెరిపించగల వారి శక్తిని గుర్తించడం లేదు. అన్ని రకాల కవిత్వాలు, ప్రక్రియలు గౌరవార్హమే. దేని విలువ దానిదే. ప్రాచీనంపై మోహంతో నవ్యతను నిరసించడం తగదు.
Also read: “ఆర్ధిక ప్రగతి – విద్య”
Also read: “చరిత్ర వక్రీకరణ”
Also read: “మన శౌరి”
Also read: ‘‘అభయం’’