భగవద్గీత – 61
వాళ్ళిద్దరినీ చూస్తే ముచ్చటేస్తుంది. స్నేహితులంటే వాళ్ళే. ఒకటే మాట, ఒకటే బాట. అసలు ఇద్దరూ ఒకళ్ళనొకరు ఎంతగౌరవించుకుంటారో…
ఆ ఇద్దరినీ విడివిడిగా కలిసి ఒకరి ప్రస్తావన మరొకరి దగ్గర తెచ్చామనుకోండి, `వాడి మొహం వాడొక పనికిమాలిన వాడు` అని ఒకరినొకరు అంటే విస్తుపోతాం కదా! Shock!
చాలావరకు మానవ సంబంధాలు మనకు కనపడేవి పైపై కౌగిలింతలు మాత్రమే. దాదాపుగా ఇవే ప్రతిచోటా కనపడుతుంటాయి. … hypocrisy. పైకి ఒకటి. లోపల మరొకటి. లోపల మరోమనిషి ఉంటాడు.
Also read: సరి అయిన మాట భవిష్యత్తుకు పెట్టని కోట
ఉహూ, ఇలా ఉండకూడదు అని చెపుతారు పరమాత్మ. లోపల ఒకటి, బయటకు మరొకటి లేకుండా ఉంటమే ‘‘సరళత్వం’’ అని చెపుతారు పరమాత్మ. నీవు చేసిన పని ఏదైనా సరే, నీ మనస్సులోని ఆలోచన ఏదైనా సరే, నీకు ఎక్కడైనా, ఎప్పుడైనా చెప్పగలిగే ధైర్యమున్నదా? ఉంటే నీవు Straight Forward మనిషివన్నమాట! అంటే ‘‘ఋజుత్వము లేదా ఆర్జవము’’ అనే లక్షణమున్నదన్నమాట!
నీవు నీకు తెలిసి ఏ జీవినీ శారీరికంగా గానీ మానసికంగా కానీ బాధించకుండా ఉంటున్నావా? అలా ఉంటే నీవు ‘‘అహింసా’’ వ్రతం ఆచరిస్తున్నావన్నమాట. ఇక ఎల్లప్పుడూ నీ మనస్సు బ్రహ్మమునందే స్థిరముగా నిలిపి ఉన్నావా? అయితే నీవు ‘‘బ్రహ్మచారి’’వన్నమాట. స్త్రీ సాంగత్యము లేకుండానో సంసారము చేయకుండా ఉండటమో కాదు బ్రహ్మచర్యమంటే.
Also read: ఆహారము, గుణము
నీవు దేవతలను, గురువులను, ద్విజులను, తత్త్వవేత్తలను, పెద్దవారినీ గౌరవిస్తున్నావా?
శుచిగా అంటే శుభ్రంగా ఉంటున్నావా? శుభ్రత అనేది బయటకనపడే శరీరము వరకే కాదు, లోపలి అంతఃకరణశుద్ధి కూడా కావాలి. అప్పుడే నీవు ‘‘శౌచము’’ పాటిస్తున్నావన్నమాట.
పైన తెలిపిన వన్నీ ఎవరికి వారు తమను తాము ప్రశ్నించుకోవలసినదే. Introspection is to be done. దీనినే పరమాత్మ శారీరిక తపస్సు అని అన్నారు.
దేవద్విజగురుప్రాజ్ఞపూజనం శౌచమార్జవమ్
బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే (17-14)
Also read: నిజమైన వ్యక్తిత్వ వికాసం అంటే ఏమిటి?