చందమామ లాంటి మొహం
దొండపండులాంటి పెదవులు
చక్రాల్లాంటి పెద్ద కళ్ళు
తెల్లని ఒంటి రంగు
మరికొందరికి 36-24-36
బంగారు రంగు వెంట్రుకలు
ఇదేనా అందమంటే
మరి నల్లజాతివాళ్ళూ
ప్రపంచ సుందరులయ్యారుగా.
పొడుగ్గా నాజూగ్గా ఉంటుందా అందం
కాక పుష్టిగా కంటినిండా ఉంటుందా అది
కండలు తిరిగిన వాడి కోరమీసంలో ఉంటుందా
పొట్ట మీద ఆరు పలకలేనా అందమంటే
కాక అది అడ జాతికే స్వంతమా
సృష్టిలో మగజాతిదేగా అందం
నెమలి, కోడి, చిలక, సింహం దేన్నైనా చూడు
కాని పురుషజాతి అనేక వేషాలేసి
స్త్రీజాతిని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది
అందం లేకపోయినా అదేమి ఆకర్షణో
వారి చుట్టూ మగ జాతి భజన చేస్తుంది.
అసలు అందం అంటే రంగు రూపాలేనా
చిరునవ్వులో ఉండేది అందం కాదా
మనసుకు అద్దం పట్టే కళ్ళు
సిగ్గు పడ్డప్పుడు హావ భావాలు
ప్రశాంతత ప్రతిబింబించే మోము
కడిగిన ముత్యం లాంటి శుభ్రత
ప్రేమ, కారుణ్యం నిండిన పలుకు
ఉత్సాహం, ఉల్లాసంతొ మెరిసే కళ్ళు
ఎదుటివారిని అర్దం ఛేసుకుని మాట్లాడే మాట
అందరి బాగు కోరే తలపు
మంచి చెడుల్లో తోడు నిలిచే తెగువ
ఎట్టి పరిస్థితిలోనూ చెయ్యి విడవని పట్టు
అసలు అందమంటే ఇది కాదా?
Also read: పాత్రధారి
Also read: కొత్త సంవత్సరం
Also read: ఈశ్వరా
Also read: లాస్ట్ అండ్ ఫౌండ్
Also read: సశేషం