పితృస్వామ్యంలో గార్గి, మైత్రేయి లాంటి వాళ్లు
స్త్రీల ఔన్నత్య శోభకు ఉదాహరణలు మాత్రమే
సీత, సావిత్రులు భర్తల సేవల్లో తరించిన వాళ్లే.
నేటి ధనస్వామ్యంలో ఉద్యోగులు, వ్యాపారులుగా
నిరంతరం శ్రమిస్తూ సమర్ధులుగా నిలిచారు స్త్రీలు.
రంభను బలాత్కారం చేసిన
రావణాసురుడినుండి మొన్నటి దాకా
మానహానేగాని ప్రాణహాని లేదు స్త్రీలకు.
నిన్న ప్రేమ పేరుతో వంచన
కాదంటే హింసించడం మొదలయ్యింది.
కొన్ని చోట్ల వయసు రాగానే ఎత్తుకెళ్లి
కొద్ది రోజులు బందీగా ఉంచి
బంధు మిత్రులతో అనుభవించి
భద్రంగా వదిలేయడం జరుగుతూంది.
‘దిశ‘ మారినప్పటినుండి
చిత్రహింస చేసి చంపడం
ఆధారాలు దొరకకుండా కాల్చేయడం.
నేడు మరో మెట్టు ఎదిగి
ముక్కలుగా నరికేయడం
అవి ఫ్రిజ్ లో భద్ర పరచి
అనువైన సమయాన
ముక్కలు విడివిడిగా పారేయడం.
అబ్బో, ఎంత ప్రగతి మగ జాతిది!
Also read: “మిడిల్ క్లాస్”
Also read: “మానవ హక్కులు”
Also read: “ప్రేమ టూ వే”
Also read: రాజ్యాంగం
Also read: భూత దయ