Thursday, December 26, 2024

వివాహ వేడుకలో అపశ్రుతులు

భగవద్గీత – 48

(Stop, Think… Proceed)

మన జీవన గమనంలో ప్రతి సందర్భాన్ని ఒక యజ్ఞంగా భావించి శ్రద్ధగా ఆచరించమన్నారు మన పెద్దలు. అందుకు కొన్ని విధివిధానాలు కూడా రూపొందించారు.

ప్రతి పని అర్ధవంతంగా ఉండాలని వారి ఉద్దేశం. ఆంతేకానీ అర్ధవంతంగా, అదే! ధనప్రదర్శనకు (డబ్బు) వేదికగా ఉండాలని కాదు, ఆడంబరాలు అసలు పనికి రావు. జీవితాన్ని ఒక చక్కటి భావనతో గడపాలి అనేది మాత్రమే వారి నిర్దేశం.

Also read: మన ప్రవృత్తి ఏమిటి?

వివాహం

గృహస్థాశ్రమ స్వీకార ఉత్సవమది. యజ్ఞమది. ధర్మబద్ధమైన కామానికి ఒక ప్రాతిపదిక. విచ్చలవిడితనంలేని సాంఘిక జీవనానికి తొలిమెట్టు. అలాంటి వివాహ క్రతువును మనం ఎలా నిర్వహిస్తున్నాం? ఒక తంతుగా మార్చేశాం. మన ఐశ్వర్య ప్రదర్శనకు వేదికగా మార్చేశాం.

అసలు దాని ఉద్దేశం ఏమిటి?

ధర్మబద్ధమైన సాంఘిక జీవనం కోసం ఒక జంటను కలుపుతున్నాం. అది ఒక యజ్ఞంగా భావించి చెయ్యాలి. పెళ్ళిచూపుల దగ్గరనుండి తాళి కట్టే దాకా అంతా ఎగతాళే. వికృత, విశృంఖల మనోప్రవృత్తుల స్వైరవిహారం గావిస్తాం.

ఆసురీ ప్రవృత్తుల ఆనందతాండవ హేల! నేటి పెళ్ళిళ్ళ గోల!

ముహూర్తం పెట్టుకోవడం దగ్గరనుండీ!

Also read: మనం ఎటు పోతున్నాం?

అసలు ముహూర్తం ఎందుకు?

చక్కటి గ్రహబలం కోసం. అది ఏ సమయంలో కుదిరితే ఆ సమయం నిర్ణయించాలి. నా దగ్గరకు ఒకాయన వచ్చి ముహూర్తం చూడమన్నారు. మనం చెప్పిన సమయం ఆయనకు నచ్చలేదు. సాయంత్రం 7-8 మధ్య కావాలి. అప్పుడయితే మంటపం డెకరేషన్‌ అందరికీ బాగా కనపడుతుందట.

ఇంకొక ఆయనకు రాత్రి 10 దాటిన తరువాత అయితే ముందు Reception పెట్టుకోవచ్చట. అసలు ఈ Reception concept ఏమిటి? ముహూర్తంలో జీలకర్రబెల్లంపెట్టి తాళికట్టకముందే అందరూ అక్షతలు వేయడము ఏమిటో బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్ధం కాదు.

ఇట్లాంటివి చాలా ఉన్నాయి.

ఇక పెళ్ళికి వచ్చిన వారికిచ్చే ఆతిధ్యం గురించి ఒక్కసారి ఆలోచించండి. ఎవరి ప్లేటు వారు పట్టుకుని బిచ్చగాడు వీధివీధి తిరిగినట్లు కౌంటర్లు తిరగాలి. తిరిగితే అక్కడ వడ్డించే వాడు, క్షమించాలి, విదిలించేవాడు కాస్త విదిలిస్తాడు.

Also read: కృష్ణబిలం అనంతం, అనూహ్యం

అలా కాదు Table meals అనుకుందాం. ఒక బ్యాచ్‌ భోజనం చేస్తుండగానే ఇంకొక బ్యాచ్‌ వాళ్ళ వెనుక నిలబడుతారు. వీళ్ళు లేచీలేవకముందే, ఎంగిలి విస్తళ్ళు తీసీతీయకముందే సీటు పోతుందేమోనని ఎవడికి వాడు అన్నం తినేవాడిని స్థిమితంగా తిన నీయకుండా, వాడి వెనుక నిలుచోవడం, ఆ తరువాత ఎంగిలి విస్తరి ముందే కూర్చోవటం. ఏం ఖర్మరా బాబూ అని అనుకోకుండా ఉండగలమా?

ఇక భోజనాల దగ్గర జరిగే దుబారా వర్ణించడం వేయితలల ఆదిశేషువుకు కూడా సాధ్యంకాదు. కౌంటర్లు పెట్టి అనవసర దుబారా. అది prestige issue.

సరే పెళ్ళితంతుకొద్దాం.

ఉదాహరణకు జీలకర్రబెల్లం ఎందుకు పెడతారు? ఒక positive energy ఉంటుంది అని చెపుతారు!

Also read: త్రిగుణాలకు అతీతంగా ఎదగాలి

ఏమిటది?

జీలకర్ర వృద్ధాప్యాన్ని దగ్గరకు రానీయద. బెల్లం తీయని వస్తువు, దానికి ‘‘చద్ది’’లేదు always fresh. ఒకళ్ళనొకరు చూసుకునేది అప్పుడే. అప్పుడే వధూవరులు తొలిచూపులతో తమ ప్రేమమందిరాలకు తోరణాలు కట్టుకునేది. వృద్ధాప్యం లేకుండా ఎప్పుడూ నిత్యనూతనంగా (fresh) జీవితం గడపండి అని దాని అర్ధం. అది సుముహూర్తం.

దానిని ఎంత అర్ధరహితం చేస్తున్నామో గదా! ఒకరినొకరు చూసుకోవటానికి బదులు ఫోటోగ్రాఫర్లకు ఫోజులు, ఆశీర్వాదం పేరిట అక్షతలు ’’వెదజల్లే‘‘ పెద్దలతో కిటకిటలాడే మంటపాలు. ఇదంతా దేనికి చిహ్నం? బలిసిన ఆసురీ ప్రవృత్తికి కాదా?

యజ్ఞంలాగా చేయవలసినదానిని ఎవరికి వారు తమకు తామే గొప్పవారమనుకొనుచూ, గర్వంతో మిడిసిపడుతూ, ధనదురహంకారంతో కన్నుమిన్నుగానకుండా శాస్త్ర విరుద్దంగా ఆడంబరమే ప్రధానంగా యజ్ఞములనాచరింతురు.

ఆత్మసంభావితాః స్తబ్దా ధనమానమదాన్వితాః

యజంతే నామయజ్ఞేస్తే దంభేనావిధిపూర్వకమ్‌!

Also read: శ్రీవారి పాదకమల సేవాభాగ్యమే పరమావధి

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles