Thursday, December 26, 2024

World Wonderful Husbands (ప్రపంచ అద్భుత భర్తలు) -1

 ఒక అన్న ఉన్నారు. ఉద్యోగరీత్యా తను పుట్టి పెరిగిన ఊరికి దూరంగా ఉంటారు. మంచి సోషలిస్టు. మతాంతర వివాహం చేసుకున్నారు. 15 రోజులకు ఓ సారి శని, ఆదివారాల్లో తప్పకుండా ఊరికి Village / గ్రామానికి వెళ్తారు. ఆ వూరు బస్ రోడ్డుకు 15 కిలోమీటర్లు దూరం. ఆ ఊరికి ఒకప్పుడు బసులే ఉండేవి కావు, రోడ్డు కూడా ఉండేది కాదు. మొత్తం అడవి. కాలి నడకన వెళ్లే వారు. సైకిల్ బజార్ లోకి వచ్చాక సైకిల్ ప్రయాణం. నేడు రోడ్డు అయ్యింది, అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.

నడిచి వెళ్ళే కాలంలో ఊరి పిల్లకాయలకు, ఊరికి కావలసిన పదార్థాలు, వస్తువులు కొనుకోని నెత్తి మీద పెట్టుకొని వెళ్ళే వారు. ఆ ఊరి ప్రజలు ఈ అన్న రాక కోసం, 15 రోజులు ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తూ వుండే వారు. ఆ ఊరి ప్రజలకు వారాలను గుర్తుపెట్టుకోవడం, రోజులను లెక్క చేయటం బొత్తిగా తెలియదు. అందుకు వాళ్ళు చేసుకున్న ఉపాయం రెండు గురుగులు (ఆ కాలంలో ఇపుడున్నట్లు స్టీల్ పాత్రలు, గ్లాసులు, చెంబులు ఉండేవి కావు. మట్టితో చేసిన పాత్రలు మాత్రమే ఉండేవి. ఆ మట్టితో చేసిన పాత్రతో నీళ్ళు తాగే వాళ్ళు. దాన్ని గురివి అంటారు.) పెట్టుకొని, ఒక గురిగిలో 15 చింతపిక్కలు ఏసి పెట్టుకొనే వారు. అన్న వచ్చి పోయిన రోజు ను వదిలి పేట్టి మరుసటి రోజు నుండి ఒక్కో చింతపిక్క గురిగి నుండి తీసి రెండవ గురీగి లో వేసి  15 రోజుల లెక్క చూసుకొనే వారు. ఆ ఊరి జనాభ 500 మంది. ఇప్పుడు పెరిగింది.

ఆ ఊరిలోని ఒక కుటుంబం ఆడ పిల్ల పెళ్లి చేయాలని నిర్ణయం జరిగింది. పెళ్లి కొడుకు ఆ ఊరి పిలగాడే. అయితే ఆ పెళ్లి కి వచ్చిన అతిథులకు వరి బువ్వ (అన్నం) వడ్డించాలి. ఇదే పెళ్లి ఖర్చు, కట్నం అన్ని ఆచారాలకు, కట్టుబాట్లకు  “వరి అన్నం” జవాబు. మరి వరి అన్నం ఎలా? అన్నను సహాయం చేయమని అడగాలని అనుకున్నారు. అన్న వచ్చిన రోజు అడిగారు. మళ్లీ వచ్చే ఆదివారం లగ్గం నిర్ణయం  అయ్యింది . అంటే అన్న 15 రోజుల కు బదులు వారం ముందే వస్తారు. శనివారం బియ్యం ఇప్పిస్తే, ఆదివారం పెళ్లి.

ఏదో కారణం చేత వస్తాను అని చెప్పిన దినం (శనివారం) అన్న రాలేదు. ఊరి ప్రజలు ఎదురు చూసారు. చూస్తూనే ఉన్నారు. శని, ఆది, సోమ వారాలు గడిచి పోయాయి. అన్న మంగళ వారం చేతికి, ఓ కాలుకు కట్టుతో వచ్చాడు. ఊరి ప్రజలు చుట్టూ మూగారు. వరి బువ్వ కోసం పెళ్లి ఆగి పోయింది అని అన్నారు. వెంటనే ఏద్దుల బండి తీసుకోని పోయి 100 కిలోల బియ్యం బస్తా తెచ్చారు. మరుసటి దినం పెళ్లి అయిపోయింది. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఇంకా బువ్వ కావాలి అని ఏడుపు. అప్పుడు వాళ్ళ వయసు 7, 5 ఏళ్లు.

*అన్న పెద్ద నాయకుడే, కానీ పెళ్లి ఆపలేకపోయాడు. ఆనాటి కట్టుబాట్లను ఎదిరించే పరిస్థితులు అనుకూలంగా ఉండేవి కావు.

……  అజీబ

Jaya Vindhyala
Jaya Vindhyala
రచయిత్రి తెలంగాణ హైకోర్టులో న్యాయవాది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లో సభ్యురాలు. హైకోర్టు బార్ అసోసియేషన్ ప్యాట్రన్. మెహబూబ్ కా మెహందీ, బాండెడ్ లేబర్ వంటి అంశాలపైన కేసులు వాదిస్తారు. పోలీసుల వేధింపులకూ, పోలీసు కస్టడీలో మరణాలకు వ్యతిరేకంగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు వేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ అధ్యక్షురాలిగా పని చేశారు. ప్రస్తుతం అదే సంస్థ తెలంగాణ విభాగానికి ప్రధానకార్యదర్శి. నక్సలైట్లకీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికీ మధ్య 2004లో జరిగిన చర్చలలో చురుకైన పాత్ర పోషించారు. అసంఘటిత కార్మికుల సమస్యలపై విదేశాలలో జరిగిన సమావేశాలకు హాజరైనారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ ఎల్ఎల్ బీ చదివారు. న్యాయవాదన వృత్తి అయితే కథలు రాయడం ఆమె ప్రవృత్తి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles