- కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో కఠిన చర్యలు
- ఆదేశాలు ఉల్లంఘిస్తే విపత్తు నిర్వహణ చట్టం కింద శిక్షలు తప్పవు: సీపీ సత్యనారాయణ
మంచిర్యాల: కరోనా కేసుల సంఖ్య మరింత పెరుగుతున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మాస్కులు ధరించనివారిపై చర్యలు తప్పవని రామగుండం పోలీస్ కమీషనర్ వి. సత్యనారాయణ హెచ్చరించారు.
కరోనా సెకండ్ వేవ్ క్రమంలో కొద్ధి రోజులుగా రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నాయనీ, ఈ నేపథ్యంలో మాస్క్ ధరించకుండా ఎవరైనా రోడ్లపై తిరిగితే విపత్తు నిర్వహణ చట్టం కింద చర్యలు తీసుకుంటామని చెప్పారు. జరిమానాలు విధించడంతో పాటు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా చర్యలుంటాయన్నారు. కరోనా ప్రభావాన్ని తగ్గించడం లక్ష్యంగా తీసుకుంటున్న చర్యలకు ప్రజలంతా సహకరించాలని సూచించారు. రామగుండం కమిషనరేట్ లో కరోనా కేసులపై అప్రమత్తంగా ఉంటూ అందుకు అనుగుణంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అని తెలిపారు. అనుమతులు లేకుండా ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించరాదని, గుంపులుగా ఉండడం నిషేధమని చెప్పారు. అన్ని రకాల పండుగలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలపైనా ఈ ఆంక్షలు వర్తిస్తాయని సీపీ స్పష్టం చేశారు.
Also Read: సీపీని కలిసిన కొత్త డిఎస్పీలు
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కోవిడ్-19 నిబంధనల ప్రకారం ఇంటి నుండి బయటకు వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, బహిరంగ ప్రదేశాలు, షాపింగ్ మాల్స్ లో, కూరగాయల మార్కెట్ వద్ద గుంపులు గుంపులుగా ఉండవద్దని ప్రతి ఒక్కరూ విధిగా భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్ వెంట ఉంచుకోవాలని సూచించారు. కరోనా బారిన పడకుండా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు.
మాస్కులు లేకుండా కొవిడ్-19 నిబంధనలు పాటించని వారిపై విపత్తు నిర్వహణా చట్టంలోని 51 నుంచి 60 సెక్షన్లు 188 ఐపీసి చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏప్రిల్ 30 వరకు ఆదేశాలు అమలులో ఉంటాయని సీపీ తెలిపారు.
Also Read: ఎస్ బీఐ బ్యాంకులో భారీ చోరీ