మనవన్నీ జొమాటో లో
టమాటా లాంటి కబుర్లే!
ఒకరి కళ్ళ లోకి
ఇంకొకరు చూసుకున్నా
‘నాకేం ఉపయోగం‘ ఆలోచనలు
సమాంతరంగా ప్రవహిస్తుంటాయి!
ఫిర్ మిలేంగే కబురు
మిలన్ కాకుండా పోతుంది!
ఎన్ని ఆరిందా కబుర్లు చెప్పినా
గురువింద కింద భాగం లా
కులం వేలాడుతూఉంటుంది!
చరిత్ర లో ఎంత ప్రేమ ఉన్నా
ప్రేమ కి నిలబడిన చరిత్ర లేదు!
ప్రేమ అని అరిగిపోయిన పదం
వాడుతూ
ప్యాకేజీలుగా మనసు చీలిపోతుంది!
బంధం పునాదిగా ఉండాల్సిన ప్రేమ
స్వార్ధం సమాధిగా తేలిపోతుంది !
విపణిలో వ్యాపించిన సాంకేతికత
పబ్ లలో హార్మోన్ల దాడికి తెరచాప లెత్తుతుంది !
మోహానికి ప్రేమ పూత
పూసుకుని
డిజే మోత గా
మిగిలిపోవడం
నేటి నాగరికత !
-వీరేశ్వర రావు మూల
Also read: ప్రస్థానం
Also read; భ్రమరావతి
Also read: అవ “మానాలై”