దేవుడొక్కడే – నిర్గుణ బ్రహ్మ
సవాలక్ష సగుణ బ్రహ్మలు
సృష్టి స్థితి లయ కారకులుగా
డ్యూటీలు పంచుకున్న త్రిమూర్తులు
లోక పాలనకు ఇంద్రుడు
దిక్పాలకులు నలుగురు
గతులు నిర్ణయించే గ్రహాలు తొమ్మిది
ఒక్కొక్క కోరికకు ఒక్కొక్క దేవుడు
బయటే కాక లోపల మరొకడు
లోపలినుండి హెచ్చరించే ఆత్మ
ఆ పైనేమో లెక్కలు చూసే ధర్మరాజు.
ముక్కోటి దేవతలు కాపు కాస్తున్నా
మనం మాత్రం మారలేదన్నా
పాప పుణ్యాలు, స్వర్గ నరకాలు అన్నా
మనమేనాడూ పట్టించుకోలేదన్నా
కాకపోతే ఇన్ని ఈర్ష్యా ద్వేషాలు
రక్తపాతాలు, మానభంగాలు
అన్యాయాలు, అక్రమాలు
మరెన్నో కపట నాటకాలు
ఎలా ఉంటాయ్.
సుఖం కోసం దేవుళ్లకు లంచాలిస్తాం
ప్రార్ధిస్తాం ఏడుస్తాం బులిపిస్తాం
ఎక్కువ మాట్లాడితే అంతరాత్మనైనా కప్పెట్టేస్తాం
అవసరమైతే దేవుడినైనా అంతు చూస్తాం
ఖబడ్దార్ మేమే దేవాంతకులం.
Also read: పెంపకం
Also read: చూపు
Also read: భావదాస్యం
Also read: స్వేచ్చాజీవి
Also read: నేనెవరు?