తెలుగు సంస్కృతం బిడ్డ కాదని
భాషా శాస్త్రఙులు చెబితే నమ్మం
తెలుగు మాధ్యమంలో చదువు
మంచిదని విద్యావేత్తలు అంటే
మోహం చిట్లిస్తాము.
ఎన్ని స్కాముల్లో భాగస్వాములైనా
బోలెడన్ని క్రిమినల్ కేసులున్నా
కోర్టులు దోషిగా నిర్ణయించినా
జైలుకు వెళ్లి తిరిగి వచ్చినా
వాళ్లనే ఎన్నుకుటాం నాయకులుగా.
కులాల పేరునో తాయిలాల కోసమో
నేరస్తులను, నికృష్టులను
అమ్మ, అన్న, అక్క అంటాం
వాళ్ళ జులుం సహిస్తాం
ఓట్ల కోసం ఒక వర్గానికి అన్ని సదుపాయాలు చేసి
మిగతావారిని కోస్తామన్నా
మనల్ని కాదులే అనుకుంటాం
గుండాల చేతికి అధికారం అప్పగించి
వాళ్లు చేసే రేపులను, హత్యలను
గుడ్లప్పగించి చూస్తుంటాం
ఏమైనా చేస్తాం ఆలోచన తప్ప
ఎందుకంటే
మన తెలివి తెల్లారిందిగా.
Also read: హీరో – జీరో
Also read: మోక్షం
Also read: మలుపు
Also read: నూలుపోగు
Also read: త్రిలింగ దేశంలో హత్య