మనుషులుగా పుట్టించావు
మానవులుగా మనలేకున్నాం
ఆలోచననిచ్చావు
మంచిచెడు విచక్షణ మరిచాం
క్షమాగుణాన్నిచ్చావు
చంపడం నేర్చుకున్నాం
ఆనందాన్నిచ్చావు
బాధపడడం, బాధపెట్టడం చేస్తున్నాం
మమ్ము శుభ్రంగా పంపించావు
మేము స్వార్థమనే మురికిని అంటించుకున్నాము
ఉదారంగా ఉన్నతంగా ఉండమన్నావు
మేము నీచంగా, నికృష్టంగా తయారయ్యాము.
కిం కర్తవ్యం?
Also read: రాగ సాయుజ్యం
Also read: కలి
Also read: జనవరి 26
Also read: నా రాత
Also read: మేధావి