‘యుద్ధం వద్దు – శాంతి ముద్దు‘ అంటారు.
పిచ్చివాళ్ళు.
యుద్ధం మన జీవితంలో భాగం
అవశ్యం, అనివార్యం.
ఆది మానవుడు రోజూ యుద్ధం చేశాడు
ఆహారం కోసం
జంతువును చంపి తినడమో
దానికి ఆహారమై పోవడమో.
అతనికి తప్పలేదు యుద్ధం.
దేవ దానవ యుద్ధం
అమృతం కోసం, అమరత్వం కోసం.
అవతారాలన్నీ యుద్ధం కోసమే.
దశరా దీపావళి పండగలు
యుద్ధం గెలిచిన సంబరాలే.
రామాయణ భారతాలు యుద్ధమే
దానవ ప్రవృత్తిపై దైవ ప్రవృత్తి పోరాటం.
దేవ దానవులు ఎక్కడో లేరు
మన లోనే ఉన్నారు.
మనం యుద్ధం చెయ్యాల్సింది
పొరుగువాడితో కాదు
లోపలి శత్రువుతో.
పోరుగువాణ్ణి ప్రేమించు
నిన్ను నువ్వు కావులించుకో
కాని ఎదుటివాడిలొ, నీలో కొలువై ఉన్న
చెడుపై అనవరతం యుద్ధం చెయ్యి.
యుద్ధం వల్ల క్షేమం
యుద్ధం ఆపితే సర్వ నాశనం
మంచికి చెడుకి జరిగే యుద్ధం
శాంతికి, విశ్వ కల్యాణానికి మార్గం
ఇది కాదనలేని జీవిత సత్యం.
Also read: సహచరిత
Also read: చందమామ
Also read: అందం
Also read: పాత్రధారి
Also read: కొత్త సంవత్సరం
Definitely, what a great site and revealing posts, I will bookmark your site.All the Best!