Monday, December 23, 2024

రాష్ట్ర విభజనపై ఉండవల్లి కేసు ఏమైంది?

వోలేటి దివాకర్

రాష్ట్ర విభజన అంశం పై సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్ తుది తీర్పు పై పిటిషనర్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తో సహా ఏపీ, తెలంగాణ రాజకీయ నాయకులు, దేశవ్యాప్తంగా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈతీర్పు  భవిష్యత్ రాష్ర్టాల విభజన ప్రక్రియకు మార్గదర్శకంగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర విభజనపై ఉండవల్లి  సుప్రీంకోర్టులో  దాఖలు చేసిన పిటిషన్   బుధవారం విచారణకు వచ్చింది. అయితే  రాజ్యాంగ ధర్మాసనాలు కొన్ని ప్రత్యేక కేసులపై విచారణ చేపట్టిన నేపథ్యంలో సుప్రీం ఈ కేసును ఏప్రిల్ 11కి వాయిదా వేసింది. గతంలో విచారణకు వచ్చినప్పుడు ఈరోజు విచారిస్తామని త్రిసభ్య ధర్మాసనం చెప్పిన విషయం తెలిసిందే.

 రాష్ట్ర విభజన సహేతుకంగా జరగలేదని దీనివల్ల రెండు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలు తలెత్తుతున్నాయని ఉండవల్లి సహా పలువురు వ్యక్తులు పిటిషన్‌లో పేర్కొన్నారు. భవిష్యత్తులో రాష్ట్ర విభజన జరగాలంటే కొన్ని ప్రత్యేక పరిస్థితులు నియమ నిబంధనలు అవసరమని ఆ మేరకు కేంద్రానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. న్యాయవాది అల్లంకి రమేష్ విజ్ఞప్తితో పిటిషన్లపై విచారణను జస్టిస్ కెఎం జోసెఫ్, జస్టిస్ నాగరత్న, జస్టిస్ పార్దేవాలతో కూడిన  ధర్మాసనం ఏప్రిల్ 11కి వాయిదా వేసింది.

  అయితే   బుధ, గురువారాల్లో కేవలం నోటీసులు ఇచ్చిన పిటిషన్లపై, తుది విచారణలో ఉన్న పిటిషన్లపై మాత్రమే వాదనలకు తీసుకోవాలని సుప్రీంకోర్టు  ఇటీవల ప్రత్యేక నిబంధన తీసుకురావడంతో రాజ్యాంగ ధర్మాసనాల కారణంగా ఈరోజు విచారణకు రావాల్సిన రాష్ట్ర విభజనపై దాఖలైన పిటిషన్లు వాయిదా పడ్డాయి.

సుప్రీంకోర్టు తాజా సర్కులర్, రాజ్యాంగ ధర్మాసనం కేసు విచారణ నేపథ్యంలో రాష్ట్ర విభజన కేసుపై తేదీ నిర్ణయించాలని ఉండవల్లి తరపు న్యాయవాది అల్లంకి రమేష్  ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాష్ట్ర విభజన సహేతుకంగా జరగలేదని దీనివల్ల రెండు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలు తలెత్తుతున్నాయని ఉండవల్లి సహా పలువురు  పిటిషన్‌లో పేర్కొన్నారు. భవిష్యత్తులో రాష్ట్ర విభజన జరగాలంటే కొన్ని ప్రత్యేక పరిస్థితులు నియమ నిబంధనలు అవసరమని ఆ మేరకు కేంద్రానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. ఉండవల్లి తరపు  న్యాయవాది అల్లంకి రమేష్ విజ్ఞప్తితో పిటిషన్లపై విచారణను జస్టిస్ కెఎం జోసెఫ్, జస్టిస్ నాగరత్న, జస్టిస్ పార్దేవాలతో కూడిన  ధర్మాసనం ఏప్రిల్ 11కి వాయిదా వేసింది. దీనితో విభజన కేసు తీర్పుపై మరికొన్ని రోజులు వేచిచూడక తప్పేట్టు లేదు.

Voleti Diwakar
Voleti Diwakar
వోలేటి దివాకర్ ఆంధ్రభూమి దినపత్రికలో రాజమహేంద్రవరం కేంద్రంలో రెండు దశాబ్దాలకు పైగా పని చేశారు. అంతకు ముందు స్థానిక దినపత్రికలో పని చేశారు. గోదావరి పుష్కరాలు సహా అనేక రాజకీయ, సాంస్కృతిక, సామాజిక ఘట్టాలపై వార్తారచన చేశారు. ప్రస్తుతం ఆన్ లైన్ పత్రికలకు వార్తలూ, వ్యాఖ్యలూ రాస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles