ఎన్నికలు వచ్చేశాయి
సారా పాకెట్లు, నోట్లు లంచమిస్తారు నీకు
అయిదు సంవత్సరాలు నీ తలరాత రాయడానికి.
తీసుకుంటే నీ బతుకు బండలవుతుంది.
కులాలంటారు, మతాలంటారు, పెద్దల మాట వినాలంటారు
నాయకులు, పెద్దలు బాగు పడుతున్నారు, నిన్ను ముంచి.
ఎవ్వరి మాటా వినొద్దు, దేనికి ఆశ పడొద్దు.
నీ బతుకు, నీ బిడ్డల బతుకు బాగుండాలంటే
ఆలోచించు, అందర్నీ గమనించు.
మంచితనం, తెలివి, పద్ధతి కలవాడిని వెతుకు
నలుగురికి మంచి చేసేవాడిని పట్టు
తెలిసినవాడని మురిసి మోసపోకు
నీ పని చెయ్యడానికి పది మందిని ముంచేవాడు వద్దు
నీతో పాటు అందరు బాగుండాలని కోరుకో
అందుకే మనోడికి కాదు, మంచోడికి ఓటు వెయ్.
Also read: అంత్య ఘడియలు
Also read: భూతలస్వర్గం కశ్మీర్
Also read: భావదాస్యం
Also read: చట్టం
Also read: సామాజిక స్పృహ