- పోలీసులకు ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉక్కు నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో విశాఖ కలెక్టరేట్ ను ముట్టడించారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ అధ్యక్షతన నగరంలోని సరస్వతీ పార్క్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శనగా వచ్చిన నిర్వాసితు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని నినాదాలు చేశారు. ఆందోళనకారుల ముట్టడితో కలెక్టరేట్ కు వెళ్లే అన్ని మార్గాలలో వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కలెక్టరేట్ లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో పోలీసులకు ఆందోళన కారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
Also Read: వైజాగ్ స్టీల్ ను కాపాడుకోండి
ఆందోళన ఉద్ధృతం చేస్తామన్న లక్ష్మీ నారాయణ:
ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశామని లక్ష్మీ నారాయణ తెలిపారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరును ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఆందోళనలో పలు రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలకు చెందిన నాయకులు కూడా పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇప్పటికే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
Also Read: అగ్రనేతలకు విశాఖ ఉక్కు పట్టదా?