- పోరాటాలను ఉధృతం చేయనున్న ఉద్యోగులు
- అప్రమత్తమైన ఉన్నతాధికారులు
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు వ్యూహరచన చేస్తోంది. రిలే నిరాహార దీక్షలు వివిధ రూపాలలో నిరసన తెలుపుతున్న కార్మిక, ప్రజా సంఘాల మద్దతుతో ఆందోళనను ఉధృతం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న విశాఖ పరిరక్షణ పోరాట కమిటీ సమ్మె నోటీసు ఇచ్చింది. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
Also Read: విశాఖ ఉక్కుతో మీకేం సంబంధం?
25 నుంచి ఏ క్షణమైనా నిరవధిక సమ్మె:
ప్రైవేటీకరణ నిర్ణయం ఉపసంహరించుకోవాలని సీతమ్మధార భూముల విక్రయ ఒప్పందం, పోస్కోతో జరిగిన ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖ ఉక్కు సీఎండీకి ఈ రోజు (మార్చి 11) సమ్మె నోటీసును అందజేశారు. ఆర్ కార్డు ఉన్న నిర్వాసితులకు శాశ్వత ఉపాధి కల్పించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మార్చి 25 తరువాత ఎప్పుడైనా మెరుపు సమ్మెకు దిగుతామని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సమ్మె నోటీసులో స్పష్టం చేసింది. శాశ్వత కార్మికులు, కాంట్రాక్టు కార్మికులు సమ్మెలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉండాలని ఉక్కు పరిరక్షణ కమిటీ పిలుపునిచ్చింది.
మంత్రి వ్యాఖ్యలతో ఉధృతంగా నిరసనలు :
ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ గత కొన్ని రోజులుగా విశాఖలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటనతో నిరసనలు మరింత ఉధృతమయ్యాయి. ఉక్కు పరిరక్షణ కమిటీ పిలుపు మేరకు మంగళవారం స్టీలు ప్లాంటు పరిపాలనా భవనాన్ని ఉద్యోగులు ముట్టడించారు. ఉద్యమానికి మద్దతుగా ప్రజాప్రతినిధులంతా రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Also Read: తీవ్ర ఉద్రిక్తంగా విశాఖ ఉక్కు ఆందోళన