- టైటిల్ స్పాన్సర్ షిప్ కు రాం రాం
- బీసీసీఐ నెత్తిన 660 కోట్ల చైనా పిడుగు
నానాటికీ తీసికట్టుగా మారిపోతున్న ఇండో చైనా సంబంధాల ప్రభావం భారత క్రికెట్ నియంత్రణ మండలి పైన భారీస్థాయిలో పడింది. ఇప్పటి వరకూ ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ గా ఉన్న చైనా సంస్థ వీవో 2021, 2022 సంవత్సరాలకు తన స్పాన్సర్ షిప్ కాంట్రాక్టును ఉపసంహరించుకొంది. గల్ఫ్ దేశాలు వేదికగా ముగిసిన ఐపీఎల్ 13వ సీజన్ పోటీలకు సైతం టైటిల్ స్పాన్సర్ గా ఉండటానికి వీవో తిరస్కరించింది. దీంతో ఏడాదికి 220 కోట్ల చొప్పున 2020 సీజన్ నుంచి 2022 సీజన్ వరకూ ఐపీఎల్ కౌన్సిల్ 660 కోట్లరూపాయల మేర నష్టపోనుంది.
Also Read: అరుదైన రికార్డులకు చేరువగా భారత్, ఇంగ్లండ్ కెప్టెన్లు
షార్జా,దుబాయ్, అబుదాబి నగరాలు వేదికగా ముగిసిన ఐపీఎల్ 2020 సీజన్ పోటీలకు భారత సంస్థ డ్రీమ్ లెవెన్ 220 కోట్ల రూపాయల కాంట్రాక్టుతో టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరించింది. వచ్చే రెండు సీజన్లకు టైటిల్ స్పాన్సర్ లేకపోడంతో సరికొత్త స్పాన్సర్ వేటలో బీసీసీఐ పడింది. ఐపీఎల్ 14వ సీజన్ వేలం ప్రారంభానికి కొద్దిరోజుల ముందే టైటిల్ స్పాన్సర్ గా వీవో పూర్తిగా వైదొలగడంతో బీసీసీఐ ఆందోళన చెందుతోంది.
Also Read: ఒక్క ఓటమితో తిరగబడిన భారత అదృష్టం