భగవద్గీత – 54
ఒక జ్యువలరీ షాపులోకి వెళ్ళాము. కళ్ళు జిగేల్ మనిపించేలా రకరకాల ఆభరణాలు. ఒకదానిని మించిన పనితనం మరొకదానిలో. అన్నింటికన్నా బాగున్నది అని అనిపించినదానిని Select చేసుకున్నాము.
ఒక నగ అన్నింటికన్నా బాగున్నది అని ఎందుకనిపించింది ?
మనకు ప్రతిదానినీ విడివిడిగా చూడటం అలవాటు కాబట్టి, అలా విడివిడిగా కాకుండా అన్నింటినీ కలిపిచూస్తే?
Also read: మోహం తొలగించుకోవడం ఎలా?
అంటే? అన్నింటా ఉన్నది బంగారమేగా. ఇక బాగు ఓగుల ప్రశ్న ఎందుకు? ఏదైనా ఒకటే కదా బంగారమేగా. అన్ని నగలలోనూ వ్యాపించి ఉన్నది బంగారమేగా.
ఆ దృష్టి అన్నమాట. అలాగే సృష్టిని విడివిడిగా చూస్తే నువ్వు, నేను, అతడు, అది, ఆ జీవి…
కానీ సమగ్రంగా అన్నింటినీ కలిపి చూస్తే? సర్వభూతస్తమాత్మానమ్ అని ఆత్మగా ఉన్న పరమాత్మే దర్శనమిస్తాడు …
విశ్వం మొత్తాన్ని సమగ్రంగా ఒకే దృష్టితో చూడటమే ‘‘విశ్వ’’రూప సందర్శనము. అదే పరమాత్మ. అనేక బాహూదర నేత్ర వక్త్రమ్ అని చెపుతూ… అన్నీ నాలోనే ఉన్నాయి అని విశదపరచారు…
Also read: నోరు మంచిదవుతే ఊరు మంచిదవుతుంది