గిరిధర్ గౌడ్
అది చాలా పెద్ద టేకు మద్దు.,.. WattsApp లో దాని image చూడగానే షాక్ అయ్యాను. అంత పొడవు, అంత లావు చూసి మరీ ఆశ్చర్యం కలిగింది. అది 1500 సంవత్సరాల నాటి టేకు మద్దు అని తెలిసీ… యింకా వింత అనుభూతిని పొందాను. దానికి Guinness book of record లో చోటు చేసుకునే అర్హత కలిగి ఉన్నదని విని సంతోషించాను.
ఇంతకీ జరిగినది ఏమిటంటే… మిత్రులు స్వర్గీయ కొడాలి సదాశివరావు RTD. D G P గారికి, ఒక చిత్రకారుడుగా వారికి నాపై గల నమ్మకం, ఈ బృహత్ కార్యాన్ని నేనే చేయగలననే ధృఢ విశ్వాసం కలిగించింది. ఈ గొప్ప ప్రణాళికను కొనసాగించడానికి చదలవాడ తిరపతిరావు గారి అబ్బాయిలు శరత్ బాబు గారు, కిరణ్ కుమార్ గారి దీక్ష, కృషి , పట్టుదల వలన, వారికి నా పైగల విశ్వాసంను గమనించి ఈ ప్రోజెక్ట్ take-up చేయడానికి సాహసించాను. అంటే నా పర్యవేక్షణ లో ఈ పెద్ద మద్దును పెద్ద శిల్పం గా మలచాలని శరత్ బాబు గారి కోరికగా గ్రహించి, పూర్తి మనసు పెట్టి ఈ శిల్పానికి నా నైపుణ్యం ద్వారా న్యాయం చేయాలని మాత్రమే నా సంకల్పం.
ముందుగా , లక్షల రూపాయల ఖరీదు చేసే ఈ వస్తువు పై నేను తగుదునమ్మా అని ప్రయోగం చేసి యజమానిని నష్ట పరచడానికి చాలా బాధపడ్డాను. కానీ ఆఖరుకు శరత్ గారు భరోసా ఇచ్చినందుకు, మరలా తిరిగి సమాధానపడి ఈ ప్రాజెక్ట్ continue చేశాను.
ముందుగా ఎన్నో సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసినా !.. ఫైనల్ గా మూడు drawings ప్రిపేర్ చేశాను. వాటిల్లో కొన్ని…
1 గజేంద్ర మోక్షము,
2 వనిత – భవిత,
3 అనంత శేష శయన మహా విష్ణుమూర్తి.
ఆఖరికి సెలెక్ట్ చేసిన log shape ను బట్టి అనంత శేష శయన శ్రీ మహా విష్ణు మూర్తిగా ఊహించి log shape ను అనుసరించి పెన్సిల్ స్క్కెచ్ చేశాను. కానీ కొంత సమయం తర్వాత ఆ స్కెచ్ లో దోషం గమనించాను. కారణం ఏమిటంటే ఆ మూర్తి తల కుడివైపున, కాళ్ళ భాగం ఎడమ వైపు కు గీయటం వాస్తు ప్రకారం దోషంగా నిర్ణయిస్తారు. కనుక ఆ drawing ను ప్రక్కన పెట్టి … మరలా తిరిగి drawing చేశాను. ఇదంతా జరిగి సుమారు సంవత్సరం దాటి ఉంటుంది. గత రెండు మూడు నెలల క్రితం ఈ పని వేగం పుంజుకుంది.
ఇక ఈ శిల్పానికి inspiration భగవత్ గీత 11 వ అధ్యాయం లోని 6 శ్లోకం,
పశ్యాధిత్యన్ వసూ రుద్రాన్ (Pasyaadhiityan vasoon rudraan(…….అని మొదలైన ఈ శ్లోకంలో భగవంతుడు అంటాడు…
“పన్నెండు మంది ఆదిత్యులు
పదకొండు మంది రుద్రులు
యెనిమిది మంది వసువులు
ఇద్దరు అశ్వినీ దేవతలు
నలుబది తొమ్మిది మంది మరుత్తులు నాలోనివారు’’ అని చెప్పుకున్నారు శ్రీ మహా విష్ణువు.
కనుక ఈ అందరు దేవతలతో సహా ఇతర ముఖ్య విష్ణు భక్తులు, అతి ముఖ్యమైన దేవతా మూర్తులను కూడా శ్రీ మహా విష్ణువు ను కలిసి సేవించు చున్నట్లు చిత్రించాను. ఇందులో భాగంగా శ్రీమహా విష్ణువును అనంత శయన మూర్తిగా తల యెడమ వైపునకు, పాదములు కుడివైపునకు ఉంచినట్లు చిత్రించాను. అనంత శేషుని దివ్య మంగళ పడగల క్రింద కిరీటము దివ్యాభరణములతో కూడి పట్టు పీతాంబర ధారియై ఒక కుడి చేతిని తల క్రింద వూతము గా ఆనించి, మరొక చేతితో పద్మమును పట్టుకొని, ఒక ఎడమ చేయిని లాలిత్యముగా యెడమ కాలు పై మోపి, మరొక ఎడమ చేతితో పాంచజన్యము అనే శంఖాన్ని పట్టుకొని ఉన్నాడు శ్రీ మహా విష్ణువు. ఆతని కుడి చేతులకు అందుబాటులో సుదర్శన చక్రం ఉపస్థితమై ఉన్నది. ఆతని కుడివైపున తొడకు దగ్గరగా కౌముది అనే గదాయుధము చిత్రించటమైనది.
హిందూ పురాణాల ప్రకారం పాల సముద్రంలో శ్రీ మహా విష్ణువు శయనించే శేష తల్పమే ఆది శేషుడు. సర్పాలకు ఆద్యుడు. నాగులకు రారాజు. కశ్యప ప్రజాపతి, కద్రువ లకు పుట్టిన పుత్రులలో జ్యేష్ఠుడు. పురాణముల ప్రకారము వేయి పడగలు కలిగి, అంటే వెయ్యి ముఖాలు అని అర్థము – వేయి నోళ్ళ శ్రీ మహా విష్ణువును అను నిత్యమూ కీర్తిస్తూ ఉండే వాడు. కానీ నేను ఇక్కడ ఐదు పడగలతో మాత్రం limited గా చూపించాను. అంత పెద్ద ఆకారము కలిగిన సర్పాన్ని చూస్తే pleasant గా అనిపించలేదు. కనుక తక్కువ పడగలతో ప్రసన్న వదనాలతో ఆది శేషుని చిత్రించారు. ఆ ప్రక్క శేషుని తమ్ముడు వాసుకి భగవంతునికి వినమ్రత తో నమస్కరిస్తూ ఉన్నాడు. శ్రీ మహా విష్ణువు తలగడ వద్ద వేదొచ్చారణ చేస్తూ వేద వ్యాసుడు, ఎదురుగా శుక మహర్షి, విష్ణుమూర్తి మోచేతికి క్రిందగా విప్పారిన రెక్కలతో పక్షిరాజు గరుత్మంతుడు, అతనికి ఎదురుగా నారద మహర్షి, తుంబురుడు, నంది వాహనము, కుమారులు గణపతి, కార్తికేయ సమేతంగా పరమేశ్వరుడు, తరువాత సప్త ఋషులు మరీచి, అత్రి, అంగీరసుడు, పులహుడు, పులస్యుడు, క్రతువు, వశిష్ఠుడు, వారి ప్రక్కన విష్ణు భక్తులైన సనక, సనాతన సనందన, సనత్కుమారులు ఉన్నారు.
సత్యాక్షుడు, దస్యుడు, అనే అశ్వినీ దేవతలు కూడా కౌముది గదాయుథానికి ఎదురుగా ఉన్నారు. సరిగ్గా విష్ణుమూర్తి పాదాల కు క్రిందుగా వీర నమస్కార ముద్రలో ఆంజనేయుడు, క్రింద క్షీర సాగరం పై అనంత శేషుని శరీరము చుట్టలు చుట్టలుగా పానుపు వలె శిల్పాన్ని మలచ వలెను.
ఇక పైభాగమున ఆకాశమును సూచిస్తూ మేఘముల వరుసలు వరుసలు గా మలచాలి. యక్ష గంధర్వ కిన్నెర కింపురుష విద్యాధర ఖేచరులతో సమావృతమైన ఆకాశం, విష్ణువు నాభి నుండి పుట్టిన కమల నాళమునకు ఇరు ప్రక్కల ఉన్న వారు మధు, కైటభులు అనే రాక్షసులని చిట్రించాను.
కమలము మధ్యలో బ్రహ్మ దేవుడు నాలుగు ముఖాలతోనాలుగు చేతులతో, ఒక కుడిచేతిలో లేఖిని ఒక ఎడమ చేతి లో భూర్జ పత్రమును ధరించి, మరొక కుడి చేతిలో అక్షమాల, మరొక ఎడమ చేతిలో కమండలం ధరించి ఉన్నాడు. ఆతని భార్య సరస్వతి అమ్మవారు హంస వాహనంపై ఒకవైపున ఉన్నారు. బ్రహ్మకు ఎడమవైపున వాహనములపై అష్టదిక్పాలకులు ఇంద్ర, అగ్ని, యమ, నిరుతి, వరుణ, వాయు, కుబేర, ఈశానుడు ఉపస్థితమై ఉన్నారు. ఇంకా
తొమ్మిది నవ గ్రహాలు
1. సూర్యుడు 2. చంద్రుడు 3. మంగళ 4. కుజుడు
5. బృహస్పతి 6. శుక్రుడు 7. శని 8. రాహువు 9. కేతువు
పండ్రెండు మంది ద్వాదశ ఆదిత్యులు – అదితి, కశ్యపుని పుత్రులు.( వీరి పేర్లు వేరు వేరు పురాణ కథలల్లో వేరు వేరుగా చెప్ప బడ్డాయి)
1.ధాత 2 .మిత్రుడు 3. ఆర్యముడు 4. శుక్రుడు
5. వరుణుడు 6. అంశుడు 7 ధవుడు 8. వివశ్వంతుడు
9. పూషుడు 10. సవితా 11. త్వష్ట 12. విష్ణువు .
ఏకాదశ రుద్రులు – శివుడు మనకు ఏకా దశ రూపాలలో దర్శనమిస్తాడు(వీరి పేర్లు వేరు వేరు పురాణ కథలల్లో వేరు వేరు గా చెప్ప బడ్డాయి)
1. అజుడు 2. ఏకపాదుడు 3. అహిరుబద్నుయుడు
4. హరుడు 5. శంభుడు 6. త్రయంబకుడు
7. అపరాజితుడు 8. ఈశానుడు 9. త్రిభువనుడు
10. త్వష్ట 11. రుద్రుడు
అష్ట వసువులు – వీరు దేవలోకంలో ఇంద్రునికి, విష్ణు మూర్తికి సహాయం చేసే శక్తివంతమైన దేవతలు. వీరు బ్రహ్మ ప్రజాపతి పుత్రులు, ప్రకృతి తత్వానికి ప్రతీక లు (వీరి పేర్లు వేరు వేరు పురాణ కథలల్లో వేరు వేరు గా చెప్ప బడ్డాయి)
1. అపుడు 2. దృవుడు 3. సోముడు 4. ధరుడు
5. అనిలుడు 6. ప్రత్యూషుదు 7. అనలుడు
8. ప్రభాసుడు
మరుత్తులు నలుబది తొమ్మిది
( వీరి పేర్లు వేరు వేరు పురాణ కథలల్లో వేరు వేరు గా చెప్ప బడ్డాయి )
1 . ఏకజ్యోతి 2. ద్విజ్యోతి 3. త్రి జ్యోతి 4. జ్యోతి
5. ఏ కశక్రుడు 6. ద్విశక్రుడు 7. త్రి శక్రుడు
8 . మహాబలుడు 9. ఇంద్రుడు 10. గత్యదృశ్యుడు
11. ప్రతిసక్రుత్పరుడు 12. మిత్రుడు 13. సమ్మితుడు
14. సుమితుడు 15. మహా బలుడు 16. ఋతజిత్తు
17. సత్యజిత్తు 18. సుషేణుడు 19. ఫేనజిత్తు
20. అంతిమిత్రుడు 21. అనమిత్రుడు 22. పురుమిత్రుడు
23. అపరాజితుడు 24. ఋతుడు 25. ఋతవాహుడు
26. ధర్త 27. ధారుణుడు 28. ధ్రువుడు.
29. విదారణుడు 30. దేవదేవుడు . 31. ఈద్రుక్షుడు
32. అద్రుక్షుడు. 33. ప్రతిసుడు. 34. ప్రసద్రుక్షుడు.
35. సభరుడు, 36 . మహా యశస్కుడు, 37. ధాత,
38. దుర్గోధితి, 39. భీముడు, 40. అభియుక్తుడు,
41. అపాత్తు, 42. సహుడు, 43. ఘతి, 44. ఘవువు, 45. అన్యాయ్యుడు, 46. వాసుడు, 47. కాముడు,
48. జయుడు, 49. విరాట్టు.
ఇలా శ్రీ మహా విష్ణువును సేవించుచు ఉన్న దేవతా మూర్తులతో ఈ శిల్పాన్ని ప్రణాళికా బద్ధంగా చిత్రించాను.
Covid ప్రభావం అధికంగా ఉన్న పరిస్థితుల్లో, నాకు పాస్పోర్ట్ లేనందు వల్ల కలిగే ఇబ్బందిని గమించి నేను బర్మా వెళ్ళలేక పోయాను. లేకపోతే కొన్నాళ్లపాటు బర్మా(మయన్మర్) స్థానిక శిల్పులతో కలసి ఈ దారు శిల్పాన్ని చేయించే వాడిని. అయినా సరే శరత్ బాబు గారు తీసుకున్న గట్టి నిర్ణయంపై WattsApp ద్వారా , viber ద్వారా, సీసీ కెమేరాల ద్వారా పరీక్షించి సలహాలు సూచనలు ఆధారంగా ఈ చిత్రాన్ని శిల్పాన్ని మలచడం జరిగింది.
అయితే గత రెండు నెలల క్రితం చాలా ఖర్చు, వ్యయ ప్రయాసలకోర్చి శరత్ గారు ఆ శిల్పాన్ని , మంచి structural iron packing తో strong container లో ఉంచి ship లో ఇండియా వచ్చి, తర్వాత Hyderabad clo Anuradha timber s international సంస్థ లో కొలువు తీరింది. పనుల వత్తిడి లో ఉన్న నేను కొంత లేట్ గానే చూడడానికి వెళ్ళాను. ఒక్కడినే చూడాలంటే ఏదో వ్యక్తం చేయలేని భావం….నా మిత్రులు, ఆత్మీయులతో కలసి సందర్శించాలని కోరిక బలీయంగా ఉండి. Caricature specialist శంకర్, moshy dayan, artist కుమార స్వామి, ఆర్టిస్ రమేష్, కలసి వెళ్ళాము. 21 అడుగుల పొడవు, క్రింద iron gudder structure తో కలసి 7to 8 feet శిల్పాన్ని చూసి నేను ఒక్క సారిగా నిశ్చేష్టుడయ్యాను. తెలియకుండా కళ్ళ వెంట నీరు పెట్టుకున్నాను! అలా.
(రచయిత ప్రఖ్యాత చిత్రకారుడు, అనంత శేష శయన శ్రీవిష్ణుమూర్తి మహాచిత్ర నిర్మాణ దర్శకుడు)