Monday, January 27, 2025

కెప్టెన్ గా విరాట్ 11వ టీ-20 హాఫ్ సెంచరీ

  • కేన్ విలియమ్స్ సన్ సరసన విరాట్
  • 3వేల 78 పరుగులతో విరాట్ టాప్

భారత కెప్టెన్ గా అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటికే పలు రికార్డులు నెలకొల్పిన విరాట్ కొహ్లీ టీ-20ల్లో సైతం మరో ఘనతను సొంతం చేసుకొన్నాడు. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ముగిసిన మూడో టీ-20లో విరాట్ ఫైటింగ్ హాఫ్ సెంచరీతో అజేయంగా నిలవడం ద్వారా న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్స్ సన్ సరసన నిలిచాడు.

టీ-20 ఫార్మాట్లో 3వేల పరుగుల మైలురాయిని చేరిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించిన కొహ్లీ ప్రస్తుతం ఇంగ్లండ్ తో జరుగుతున్న సిరీస్ లోని రెండు, మూడు మ్యాచ్ ల్లో అర్థశతకాలు నమోదు చేశాడు.కెప్టెన్ గా విరాట్ కొహ్లీ కి టీ-20ల్లో ఇది 11వ హాఫ్ సెంచరీ. కేవలం 46 బాల్స్ ఎదుర్కొని 8 బౌండ్రీలు, 4 సిక్సర్లతో కొహ్లీ 77 పరుగుల నాటౌట్ స్కోరు సాధించాడు.ఈ క్రమంలో న్యూజిలాండ్ కెప్టెన్ గా టీ-20 ల్లో 11 హాఫ్ సెంచరీలు సాధించిన కేన్ విలియమ్స్ సన్ సరసన విరాట్ నిలిచాడు. టీ-20 క్రికెట్లో విరాట్ కు ఇది 27వ అర్థశతకం కూడా కావడం విశేషం.

Also Read: క్రికెట్ చరిత్రలో అరుదైన రోజు

కొహ్లీ 138.96 స్ట్రయిక్ రేటుతో3వేల 78 పరుగులు సాధించడం ద్వారా 52.17 సగటు నమోదు చేశాడు.ఆస్ట్ర్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్,ఇంగ్లండ్ సారథి వోయిన్ మోర్గాన్ చెరో 9 హాఫ్ సెంచరీలతో కొహ్లీ,కేన్ విలియమ్స్ సన్ ల తర్వాతి స్థానంలో నిలిచారు.సౌతాఫ్రికా కెప్టెన్ గా ఫాఫ్ డు ప్లెసిస్ ఓ శతకంతో పాటు 7 హాఫ్ సెంచరీలు సైతం సాధించి మూడోస్థానంలో కొనసాగుతున్నాడు.

Also Read: మూడో టీ-20లో ఇంగ్లండ్ జోరు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles