* ఇంగ్లండ్ తో సిరీస్ లో రికార్డులే రికార్డులు
* కేన్ విలియమ్స్ సన్, ఫించ్ లను అధిగమించిన కొహ్లీ
ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో భారత కెప్టెన్ గా విరాట్ కొహ్లీ మరో రెండు సరికొ్త్త రికార్డులు నమోదు చేశాడు. అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్ తో ముగిసిన పాంచ్ పటాకా సిరీస్ ఆఖరిపోరులో 80 పరుగుల నాటౌట్ స్కోరు సాధించడం ద్వారా విరాట్ రెండు రికార్డులు సొంతం చేసుకొన్నాడు.
వైస్ కెప్టెన్ రోహిత్ శర్మతో కలసి ఓపెనర్ గా బరిలోకి దిగిన విరాట్ కొహ్లీ..మొత్తం 20 ఓవర్లపాటు క్రీజులో నిలవటమే కాదు…తనజట్టు 224 పరుగుల రికార్డు స్కోరు సాధించడంలో ప్రధానపాత్ర వహించాడు.
Also Read : ఆఖరాటలో రోహిత్, కొహ్లీ వీరవిహారం
తన కెరియర్ లో ఇప్పటికే 3వేలకు పైగా టీ-20 పరుగులు సాధించిన తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పిన విరాట్…కెప్టెన్ గా కూడా అత్యధిక అర్థశతకాలు, పరుగులు సాధించిన మొనగాడిగా నిలిచాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్స్ సన్ పేరుతో ఉన్న రికార్డులను అధిగమించాడు.
28 వ హాఫ్ సెంచరీ
తన కెరియర్ లో కెప్టెన్ గా 45 టీ-20 మ్యాచ్ లు ఆడిన విరాట్ 28వ అర్థశతకం సాధించాడు. కెప్టెన్ గా విరాట్ కు ఇది 12వ హాఫ్ సెంచరీ. కేన్ విలియమ్స్ సన్ పేరుతో ఉన్న 11 హాఫ్ సెంచరీల రికార్డును విరాట్ తెరమరుగు చేశాడు. అంతేకాదు…కెప్టెన్ గా అత్యధిక పరుగులు సాధించిన కంగారూ సారథి ఆరోన్ ఫించ్ రికార్డును సైతం కొహ్లీ అధిగమించాడు.
Also Read : సమఉజ్జీల సమరంలో ఆఖరాట
3వేల పరుగుల తొలి క్రికెటర్
టీ-20 ఫార్మాట్లో వ్యక్తిగతంగా అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడి రికార్డు ను ప్రస్తుత ఐదుమ్యాచ్ ల సిరీస్ ద్వారా విరాట్ కొహ్లీ సొంతం చేసుకొన్నాడు. మొత్తం ఐదు ఇన్నింగ్స్ లో మూడు సూపర్ హాఫ్ సెంచరీలతో 3వేల పరుగులు సాధించిన తొలిక్రికెటర్ గా విరాట్ చరిత్ర సృష్టించాడు.
ప్రస్తుత సిరీస్ వరకూ కొహ్లీ మొత్తం 89 మ్యాచ్ లు ఆడి 81 ఇన్నింగ్స్ల్ లో 3వేల 159 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. రోహిత్ శర్మ 111 మ్యాచ్ ల్లో 2 వేల 864 పరుగులతో రెండోస్థానంలో నిలిచాడు. రోహిత్ ఖాతాలో నాలుగు శతకాలు, 22 అర్థశతకాలు ఉన్నాయి.
Also Read : భారత వన్డేజట్టులో సూర్య, నటరాజన్
కివీ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ 2 వేల 839 పరుగులు, కంగారూ కెప్టెన్ ఆరోన్ ఫించ్ 2వేల 346 పరుగులు, షోయబ్ మాలిక్ 2 వేల 335 పరుగులతో ఆ తర్వాతి స్థానాలలో ఉన్నారు.
కెప్టెన్ గా 12వేల అంతర్జాతీయ పరుగుల రికార్డు
అంతర్జాతీయ క్రికెట్లో 12వేల పరుగులు సాధించిన మూడో కెప్టెన్ గా విరాట్ కొహ్లీ ప్రస్తుత సిరీస్ ద్వారా నిలిచాడు. ఇప్పటి వరకూ ఆఘనత సాధించిన ఆటగాళ్లలో సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రీమ్ స్మిత్, ఆస్ట్ర్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్ మాత్రమే ఉన్నారు.
క్రికెట్ మూడుఫార్మాట్లలోనూ కలిపి రికీ పాంటింగ్ మొత్తం 15వేల 440 పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు. గ్రీమ్ స్మిత్ 14వేల 878 పరుగులతో రెండోస్థానంలో ఉన్నాడు. భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ ప్రస్తుత సిరీస్ రెండో టీ-20లో స్ట్ర్రోక్ ఫుల్ హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా 12వేల పరుగుల మైలురాయిని చేరగలిగాడు.
Also Read : నాలుగో టీ-20లో సూర్యప్రతాపం
తీన్మార్ రికార్డు సైతం
క్రికెట్ మూడుఫార్మాట్లలోనూ 3వేల పరుగులు చొప్పున సాధించిన ఆటగాడిగా కూడా కొహ్లీ మరో రికార్డు సాధించాడు. ఇప్పటికే టెస్టు, వన్డే ఫార్మాట్లలో 3వేల పరుగులకు పైగా చొప్పున సాధించిన కొహ్లీ టీ-20ల్లో 3వేల 159 పరుగులతో త్రీ-ఇన్- వన్ రికార్డును సైతం పూర్తి చేయగలిగాడు.