భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తండ్రి అయ్యారు. ఆయన భార్య బాలీవుడ్ నటి అనుష్క శర్మ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ మేరకు విరాట్ కోహ్లీ ట్విటర్ ద్వారా అభిమానులకు వెల్లడించారు. ముంబయి బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో తల్లీ, బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. తమ ఇద్దరి జీవితాల్లో ఇవాల్టి (జనవరి 11) నుంచి కొత్త అధ్యాయం ప్రారంభమైందని కోహ్లీ తెలిపారు.