వోలేటి దివాకర్
ఉత్తమ పర్యావరణ ప్రమాణాలతో నిర్వహిస్తున్నందుకు గాను బెజవాడ (విజయవాడ) రైల్వే జంక్షన్ కు (ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్) ప్లాటినం గ్రీన్ రైల్వే స్టేషన్ రేటింగ్ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్ తరువాత ఈ ఘనతను విజయవాడ సొంతం చేసుకుంది. ఈ రేటింగ్ 3 సంవత్సరాలు చెల్లుబాటు అవుతుంది. పర్యావరణ ప్రమాణాలను మెరుగుపరిచి, విజయవాడ స్టేషన్‌లో ప్రయాణీకులకు నాణ్యమైన, పర్యావరణ అనుకూల సేవలను అందిస్తున్నందుకు గాను ఐ జీ బి సి ప్లాటినం రేటింగ్ దక్కింది. తన హయాంలో విజయవాడ స్టేషన్ ప్లాటినమ్ ఐజిబిసి రేటింగ్ సాధించడం పట్ల విజయవాడ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర ఎ. పాటిల్ సంతోషం వ్యక్తం చేశారు. విజయవాడ డివిజన్‌కు ఇది చాలా గర్వకారణం అని వ్యాఖ్యానించారు. ప్లాటినం ఐజిబిసి రేటింగ్‌ను సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఎన్‌హెచ్‌ఎం, ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ విభాగం కృషిని డిఆర్‌ఎం అభినందించారు.
బంగారం నుంచి ప్లాటినంకు…
రైల్వేలకు గ్రీన్ రేటింగ్ సర్టిఫికేషన్ 2017 సంవత్సరంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ధ్రువీకరణ తప్పనిసరి చేయబడింది. 2019 సంవత్సరం చివరిలో అప్పటి అనుకూలమైన సౌకర్యాలు, నిబంధనలతో విజయవాడ గోల్డ్ ర్యాంక్‌ను సాధించింది. ఈ సంవత్సరం రీసర్టిఫికేషన్ ప్రక్రియలో, విజయవాడ స్టేషన్ 2019 గోల్డ్ స్టాండర్డ్ రేటింగ్‌తో పోలిస్తే దాదాపు అన్ని అంశాలలో మెరుగైన పనితీరును కనబరిచి, ఐజిబిసి ప్లాటినం రేటింగ్ ను కైవసం చేసుకోవడం విశేషం.
ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (IGBC) పర్యావరణ డైరెక్టరేట్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ మద్దతుతో గ్రీన్ రైల్వే స్టేషన్‌ల రేటింగ్ సిస్టమ్‌ను అమల్లోకి తెచ్చింది. ఆరు పర్యావరణ అంశాలపై రేటింగ్ ఆధారపడి ఉంటుంది – స్టేషన్ లో స్వయం స్వావలంబన సౌకర్యం, ఆరోగ్యం, పరిశుభ్రత, పారిశుధ్యం, శక్తి సామర్థ్యం, నీటి సామర్థ్యం, స్మార్ట్, గ్రీన్ ఇనిషియేటివ్స్,నూతన ఆవిష్కరణలు, అభివృద్ధి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. విజయవాడ గోల్డ్ ర్యాంక్ ప్లాటినం ర్యాంక్‌కి ఎదగడానికి దోహదపడిన 11 అంశాలు ఇలా ఉన్నాయి.
* విజయవాడ స్టేషన్ 130 kwp సోలార్ పవర్‌తో అమర్చబడిన మొట్టమొదటి స్టేషన్. మరింత సౌర విద్యుత్ ను ఉపయోగించేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నారు. అదనంగా విద్యుత్ సామర్థ్యాన్ని సాధించడానికి ఎల్ ఈ డి లైట్ల వాడకం, స్టార్ రేటెడ్ ఎలక్ట్రికల్ ఉపకరణాలను ఉపయోగించడం.
* వ్యర్థ జలాల రీసైక్లింగ్ కోసం, స్టేషన్ పరిసరాల్లో ఏర్పాటు చేసిన 750 KLD సామర్థ్యం గల మురుగునీటి శుద్ధి ప్లాంట్.
*వివిధ పరికరాల నుండి వెలువడే పొగ, శబ్దం నియంత్రణకు చర్యలు.
* స్టేషన్‌లో చుట్టుపక్కల పచ్చదనం పెంపు నకు మెరుగైన చర్యలు. మెరుగుదల. దృఢమైన, స్థిరమైన సీటింగ్ సౌకర్యం, సీటింగ్ , లైటింగ్‌తో బుకింగ్ కార్యాలయం, వెయిటింగ్ హాల్స్, రిటైరింగ్ రూమ్‌లు, క్లోక్ రూమ్, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్‌లు, స్నాక్ కియోస్క్‌లు, డ్రింకింగ్ వాటర్ పాయింట్‌ల వంటి ప్రయాణీకుల సౌకర్యాలను సమర్థవంతంగా అమలు చేయడం. విజయవాడ స్టేషన్‌లో మరియు స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఉన్నత ప్రమాణాలతో అత్యవసర వైద్య సదుపాయాలు. ఉన్నత ప్రమాణాలు.
*బస్సు రవాణాకు సౌకర్యాలు
*వ్యర్థాల విభజన, సరైన వ్యర్థాల నిర్వహణతో సమగ్ర యాంత్రిక శుభ్రపరిచే కార్యాచరణను అందించడం. ప్రత్యామ్నాయ పనిముట్లతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నివారించడంలో ప్రభావవంతమైన చర్యలు.
వైఫై సౌకర్యం, స్మార్ట్ కార్డ్ టికెటింగ్, టూరిస్ట్ సమాచారం, బుకింగ్ సెంటర్, ఆటోమేటిక్ టిక్కెట్ వెండింగ్ మెషిన్, ఫుడ్ కోర్ట్, ఫార్మసీ, సీసీ కెమెరాలనిఘా, టచ్ స్క్రీన్ ఇన్ఫర్మేషన్ కియోస్క్ వంటి అత్యాధునిక సేవలు. ఆధునిక కోచ్ వాటరింగ్, లిఫ్ట్‌లు & ఎస్కలేటర్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లు, లగేజ్ అసిస్టెంట్ల కోసం ట్రాలీ ఆధారిత వ్యవస్థ, వాహనాల కోసం పికప్, డ్రాప్ పాయింట్లు, స్నాక్ కియోస్క్‌లు & డ్రింకింగ్ వాటర్ పాయింట్లు వంటి అధిక రేటింగ్ ఉన్న ప్రయాణీకుల సౌకర్యాలు వంటి వినూత్న చర్యలు ప్లాట్‌ఫారమ్‌లు, చైల్డ్ హెల్ప్ డెస్క్, వైద్య సదుపాయాలు వంటి విధానాలు విజయవాడ రైల్వే స్టేషన్‌కు ప్లాటినం ర్యాంక్‌ను పొందడంలో దోహద పడ్డాయి.