వోలేటి దివాకర్
నన్ను ఇరిటేట్ చేస్తే టీవీయే కాదు.. పేపర్ పెడతా..రియల్ ఎస్టేట్‌లోకి ఎంటర్ అవుతానని వైసీపీ ఎంపి విజయ సాయిరెడ్డి ప్రకటించారు. ఇటీవల ఈనాడు మీడియాలో తనకు వ్యతిరేకంగా వస్తున్న కథనాలపై ఆయన తీవ్రంగా స్పందించారు. రామోజీకి పత్రిక, టీవీ ఉందనే కదా ఇదంతా చేస్తున్నాడు.. మీడియా రంగంలోకి నేను ఎంటర్ కాబోతున్నాను.. చూసుకుందామా రామోజీ..నేనే సొంతంగా నా డబ్బులతో మీడియా పెడతా..చూసుకుందాం అని సవాల్ విసిరారు.
ఈసందర్భంగా ఈనాడు అధినేత రామోజీ రావుపై విరుచుకుపడ్డారు. ఉత్తరాంధ్రకు ద్రోహం చేసే కుట్రలు సాగుతున్నాయి కొన్ని పత్రికలు కులాన్ని ఇంకుగా మార్చుకుని, కుల పిచ్చితో నీచపు, తప్పుడు రాతలు రాస్తున్నాయని ధ్వజమెత్తారు.
ఆయానేమన్నారంటే…
టీడీపీ కరపత్రం కన్నా హీనంగా ఈనాడు దిగజారింది. రామోజీని రామోజీ అనొద్దు రాము అనండీ..! రామోజీ లో జీ అనే గౌరవ ప్రదమైన పదం ఉంది.. అందుకని ఆయనను రాము అందాం. రామోజీ తన జీవితాన్ని గుమస్తాతో ప్రారంభించాడు జీజే రెడ్డిని మోసం చేసి ఆయన కంపెనీలు, ఆస్తులు కొట్టేశాడు రాము. నాకు విశాఖలో ప్లాట్ మాత్రమే ఉంది
రామోజీకి నైతిక విలువలు లేవు.. రామోజీ పుట్టుకే అనైతికం. రామోజీ అన్నం తింటున్నాడా..? ఇంకేమైనా తింటున్నాడా..?కుల పత్రికలపై ఉమ్ము వేసే పరిస్థితి వచ్చింది. నా కుమార్తె కుటుంబం 40 ఏళ్లుగా వ్యాపారాల్లో ఉంది. ఫార్మా, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్ సహా అనేక రంగాల్లో ఉన్నారు. మా అమ్మాయి కుటుంబం నిజాయితీగా వ్యాపారం చేస్తున్నారు..
రామోజీలా పక్కదారిలో చేయట్లేదు. మా అమ్మాయి కుటుంబానికి 100 దేశాల్లో వ్యాపారాలు ఉన్నాయి. దేశంలోనే టాప్ 5వ కంపెనీ. భారత్ బయోటిక్ రామోజీ కంపెనీ అవుతుందా..?. రామోజీ అనే వ్యక్తి సమాజంలో బతకడం అనవసరం. రామోజీ కోడలు శైలజ ఆస్తులు కొనుగోలు చేస్తే.. ఉప్పలపాటి సుందర రావు ఆస్తులు అవుతాయా..?
దమ్మున్నోడి సవాల్ . నా ఆస్తులపై సీబీఐ, ఈడీ, ఎఫ్‌బీఐ విచారణకు నేను సిద్దం…చంద్రబాబు, రామోజీ సిద్దమా..? ప్రజలను దోచుకుని రామోజీ సంపాదించాడు. పచ్చళ్లు అమ్ముకుని సంపాదించలేదు. బాలాజీ హేచరీస్ ఆస్తులు రామోజీవి అవుతాయా. చంద్రబాబు సామాజిక వర్గం ఆస్తులు విశాఖలో ఉండాలి.. అమరావతిలో ఆస్తులు ఉండాలి.. ఇదే రామోజీ, చంద్రబాబు ధ్యేయం. ఒక్క రామోజీ ఫిలిం సిటీలోనే .. 2,500 ఎకరాలు ఆక్రమించుకున్నారు. బ్రాహ్మణి సంపాదిస్తే బాలకృష్ణది అవుతుందా..? పచ్చళ్లు అమ్ముకునే రామోజీ లక్షల కోట్లు ఎలా సంపాదించాడు.అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగింది.