- పొన్నాలకు ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు
- విజిల్ వేస్తూ పాట పాడటంలో దిట్ట
రామకృష్ణాపూర్ పట్టణానికి చెందిన కళాకారుడు పొన్నాల సాగర్ కు ఓ ప్రత్యేకత ఉంది. ఎలాంటి సంగీత వాయిద్య పరికరాలు లేకుండా విజిల్ తోనే మనస్సు దోచుకునే వివిధ సందేశాత్మక పాటలు పాడతారు. కేవలం 60 నిముషాల్లో 60 పాటలు పాడి ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వెలుగు ఫౌండేషన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వండర్ రికార్డును సంస్థ ప్రతినిధి సాగర్ ప్రతిభను తిలకించి ఆయన ప్రదర్శన ఎంపిక చేసిన వీడియోను అంతర్జాతీయ సభ్యులకు పంపారు.
సాగర్ చిన్న తనం నుంచే తల్లి రోజ్ మేరీ ప్రోత్సాహంతో తో సాధన చేస్తూ అందరిలా కాకుండా కేవలం నోటి తో ఫ్లూట్ కంటే గొప్పగా పాడాలనుకున్నారు. ఎన్నో సంవత్సరాలు కఠిన శ్రమ తో అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకున్నారు పొన్నాల సాగర్. తనలో ఉన్న గొప్ప తనాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలనుకుంది ఇంటర్నేషనల్ వండర్ బుక్ అధికారులు. దీంతో 60 నిముషాల్లో 60 పాటలు పాడి సాగర్ తన సత్తా చాటాడు.
వండర్ బుక్ అవార్డ్ సొంతం
ఈ కారక్రమం లో ముఖ్య అతిథి గా పాల్గొన్న మంచిర్యాల ఏసీపీ జి.నరేందర్ మాట్లాడుతూ సాగర్ ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించడం జిల్లా కే గర్వకారణమన్నారు. పేద వారికి తన వంతు సహాయం చేయాలనే తపనతో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ స్థాపించి ఎంతో మంది అనాథలను ఆదుకున్నాడని ఏసీపీ అన్నారు. ఇలాంటి గొప్ప వ్యక్తి భవిష్యత్తులో ఎన్నో అవార్డులు గెలుచుకొని మరింత మంది కి సేవ చేయాలని ఆకాంక్షిస్తూ సాగర్ ని సన్మానించారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ స్టేట్ కోఆర్డినేటర్ డా.జ్యోతి రంగ, వెలుగు ఫౌండేషన్ వ్యవస్థాపకులు మడుపు రామ్ ప్రకాష్, రాష్ట్రపతి అవార్డు గ్రహీత గుండేటి యోగేశ్వర, కళాకారులు చుంచు గురువయ్య. వెంకటేష్ లు హాజరయ్యారు. అవార్డ్ అందుకున్నందుకు పొన్నాల సాగర్ సంతోషం వ్యక్తం చేశారు. తనను ప్రోత్సహించిన తల్లి దండ్రులకు, మిత్రులు శ్రేయభిలాషులకు ధన్యవాదాలు తెలిపారు
ఇదీ చదవండి:స్వామి భక్తిలో తరిస్తున్న టీఆర్ఎస్ నేతలు