Sunday, December 22, 2024

వ్యాక్సినేషన్-వైరస్ లో మార్పులు

కరోనాకు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. ముందుగా అత్యవసర సేవలు అందించే ఫ్రంట్ లైన్ యోధులకు వ్యాక్సినేషన్ ప్రారంభించారు. మార్చి నుంచి మిగిలిన సాధారణ పౌరులకు కూడా వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లకు తోడు మరిన్ని కంపెనీల నుంచి మరిన్ని వ్యాక్సిన్లు వస్తూనే వుంటాయన్నది మార్కెట్,ప్రభుత్వ వర్గాల సమాచారం. ఇవన్నీ చాలా ఆశావహ పరిణామాలు, సంతోషాన్ని నింపే అంశాలు. వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయనే ఆలోచన ప్రజలందరికీ  ఎంతో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.

అదే సమయంలో, ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది. వైరస్ లో ఉత్పరివర్తనలు (మ్యుటేషన్స్) వేగంగా జరుగుతున్నాయి. వ్యాక్సినేషన్ ఆలస్యమైతే, కొత్త రకాలు విజృంభించే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లకు వైరస్ లో మార్పులను తట్టుకునే శక్తి ఉందని అంటున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే వ్యాక్సిన్లు రూపకల్పన చేశామని ఆయా సంస్థలు కూడా చెబుతున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియలన్నీ పూర్తయి, పూర్తి ఫలితాలు వస్తే కానీ వ్యాక్సిన్ల సమర్ధతపై (ఎఫికెసీ) విశ్వాసం కలుగదు. అప్పటి వరకూ ఏ మాత్రం అజాగ్రత్తగా ఉండకుండా కోవిడ్ నిబంధనలను, జాగ్రత్తలను కొనసాగించడం చాలా అవసరం.కొత్త  కేసులు కొన్ని చోట్ల పెరుగుతున్నాయి. ఈ కారణంగా వైరస్ లో  జన్యు వైవిధ్యం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, కొత్త రకాలను గుర్తించడంలో చర్యలను వేగవంతం చెయ్యాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ ఓ ) హెచ్చరిస్తోంది.

బ్రిటన్ లో పురుడు పోసుకున్న కొత్త రకం కరోనా మార్చి కల్లా అమెరికాలోని ఎక్కువ భాగాన్ని ఆక్రమించుకునే అవకాశం ఉందనే వార్తలు గుప్పుమంటున్నాయి.ఈ వైరస్ పెద్ద ప్రమాదకారి కాకపోయినప్పటికీ వ్యాప్తి వేగం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. బ్రెజిల్, దక్షిణాఫ్రికాలో రెండు కొత్త రకాలు బయటపడ్డాయి. బ్రిటన్ లో వెలుగు చూసిన కొత్త రకం ఇప్పటికే 30 దేశాలకు విస్తరించింది. మిగిలిన దేశాలకు వ్యాధి వ్యాప్తి చెందకుండా మరిన్ని చర్యలు చేపట్టాలి.వైరస్ లో జరిగే మ్యుటేషన్స్ ఇంతటితో ఆగుతాయని గ్యారంటీ లేదు. భవిష్యత్తులో వచ్చే మార్పులు మరింత ప్రమాదకరంగా ఉన్నా, ఆశ్చర్యపడక్కర్లేదు. వ్యాక్సిన్ వేసుకున్నా మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం చాలా ముఖ్యమని పదే పదే చెబుతున్నారు. వీటిని పెడచెవిన పెట్టకూడదు. ఇప్పటికే చాలామంది, ఈ విషయాల్లో అశ్రద్ధగా ప్రవర్తిస్తున్నారు.కొత్త మ్యుటేషన్స్ నేపథ్యంలో, పరీక్షా విధానంలోనూ, చికిత్సలు అందించడంలోనూ, టీకా నిర్మాణంలోనూ తగు చర్యలు చేపట్టాలి.వైరస్ లు తమ సంఖ్యను పెంచుకునే క్రమంలో జన్యువుల్లో మార్పులు రావడం కూడా సహజమే.ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ల సమర్ధత ఎలా ఉన్నా, వైరస్ లో జరిగే జన్యు మార్పులకు అనుగుణంగా ఫార్ములాను ఎప్పటికిప్పుడు మార్చుకోవాల్సి వస్తుంది. వ్యాక్సిన్ల రూపకల్పనలో ఇదొక పెద్ద సవాల్.

ప్రస్తుతం భారతదేశంలోని గణాంకాలను పరిశీలిస్తే, యాక్టివ్ గా ఉన్న కేసుల సంఖ్య 2లక్షలకు లోపే వుంది. ఇది చాలా శుభ పరిణామం. రికవరీల్లో వేగం బాగా పెరిగింది. రికవరీ రేటు 96.7శాతం ఉండడం చాలా ఆరోగ్యకరమైన అంశం.దేశంలో సాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియలో ప్రతికూల ఫలితాలు దాదాపు ఇంతవరకూ లేవని కేంద్రం చెబుతోంది. టీకాలు సురక్షితం, అని కేంద్ర ప్రభుత్వం పదే పదే ప్రకటిస్తోంది. మంచిదే.ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పరిణామాలను గమనిస్తే, కొన్ని ముఖ్యమైన అంశాలను గుర్తుపెట్టుకోవాలి. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా జరగాలి. వైరస్ లో జరిగే మార్పులకు అనుగుణంగా వ్యాక్సిన్ల నిర్మాణం చేపట్టాలి. మరిన్ని సమర్ధవంతమైన వ్యాక్సిన్లు అందుబాటులోకి రావాలి. వ్యాక్సిన్లు వేసుకోనివారు, వేసుకున్నవారు కూడా ఎప్పటిలాగే మాస్కులు వేసుకుంటూ, భౌతికదూరం పాటిస్తూ, శానిటైజేషన్ చేసుకుంటూ జాగ్రత్తలు కొనసాగించడం చాలా చాలా ముఖ్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యాక్సిన్లు రూపొందించే సంస్థలు, అనుమతులు ఇచ్చే ఆయా విభాగాలు, ప్రభుత్వాలు,పాలకులు చిత్తగా ఉండడం వీటన్నింటి కంటే ముఖ్యం.

ఇదీ చదవండి:పొరుగు దేశాలకు ప్రారంభమైన టీకాల ఎగుమతి

ఇదీ చదవండి:భారత్ లో ప్రారంభమైన టీకా పంపిణీ

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles