- బ్లాక్ లిస్టులో మరో 9 చైనా కంపెనీలు
- చైనా కంపెనీలే లక్ష్యంగా ఆంక్షలు
- బైడెన్ ను ఇరుకును పెట్టనున్న ట్రంప్ నిర్ణయాలు
అమెరికాను తలదన్ని అగ్రరాజ్యంగా ఎదిగేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న చైనాను కట్టడి చేసేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా మరో నాలుగు రోజుల్లో దిగిపోనున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలకమైన విధాన నిర్ణయాలలో ఎక్కడా తగ్గటంలేదు. చివరి రోజు కూడా చైనాను ఏదో ఒక పేరు చెప్పి చైనాను ఆంక్షల చట్రంలో ఇరికించి వెళ్లనున్నారు. ఎన్నికల్లో తన ఓటమికి చైనా కూడా కారణమని భావిస్తున్న ట్రంప్ పదవినుంచి వైదొలగేందుకు కొద్ది సమయమే మిగిలి ఉండటంతో ట్రంప్ తన ఆలోచనలకు పదును పెడుతున్నారు. చైనా లక్ష్యంగా చేసుకుని పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. సరిహద్దుల దురాక్రమణ, దక్షిణ చైనా సముద్రంలో ఆధిపత్యం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న చైనాకు చుక్కలు చూపిస్తున్నారు. తాజాగా 9 చైనా కంపెనీలపై అమెరికా పెట్టుబడులపై ట్రంప్ నిషేధం విధించారు. ఇందులో భాగంగా పలు కీలక వ్యక్తులపై కూడా ఆంక్షలు విధించారు. దీంతో చైనా కంపెనీలకు ప్రధానమైన సాంకేతిక పరిజ్ఞానం అందడం ముందు ముందు దుర్లభం కానుంది. అయితే ట్రంప్ ఆంక్షలపై కాబోయే అధ్యక్షుడు బైడెన్ ఇంకా స్పందించలేదు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకుందని ఆరోపిస్తూ ఒబామా కూడా ఆంక్షలను విధించారు.
ఇది చదవండి: ట్రంప్ అభిశంసనకు ఆమోదం తెలిపిన ప్రతినిధుల సభ
బ్లాక్ లిస్ట్ లో చైనా కంపెనీలు:
చైనాకు చెందిన నేషనల్ ఆఫ్ షోర్ ఆయిల్ కార్పొరేషన్ అనే ప్రభుత్వ రంగ సంస్థ దక్షిణ చైనా సమద్ర జలాల్లో చమురు అన్వేషిస్తూ సరిహద్దు దేశాలను వేధింపులకు గురిచేస్తోందని అమెరికా భావిస్తోంది. ముఖ్యంగా చైనా భాధితదేశాలలో వియత్నాం ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. చైనా సైన్యం తరపున సముద్ర జలాలలో ప్రత్యర్థి దేశాలను కట్టడి చేస్తుంటుంది. చైనా నిర్మిస్తున్న కృత్రిమ ద్వీపాల నిర్మాణంలో ఈ కంపెనీ కీలక పాత్ర పోషిస్తున్నట్లు అమెరికా సమాచారాన్ని సేకరించింది. దీంతో అమెరికా వాణిజ్య శాఖ బ్లాక్ లిస్ట్ లో చేర్చింది. తాజా ఆంక్షలతో అమెరికా సంస్థల నుంచి ఎటువంటి యంత్ర సామాగ్రి, సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందేలేవు.
ఇది చదవండి: పుట్టింటిలోనే ప్రజాస్వామ్య అపహాస్యం
ఇది జరిగిన గంటల వ్యవధిలోనే చైనా సైన్యంతో సంబంధాలున్న షావోమి కంపెనీని నిషేధిత కంపెనీల జాబితాలో చేర్చింది. ట్రంప్ తాజా నిర్ణయంతో అమెరికా పెట్టుబడి దారులు షావోమి షేర్లను కొనేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు అనుమతి లేదు. షావోమీ గత సంవత్సరం మూడో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ల తయారీగా కంపెనీగా నిలిచింది. స్కైరిజోన్ ను మిలటరీ ఎండ్ యూజర్ లిస్ట్ లో చేర్చింది. మైక్రోఫాబ్రికేషన్ ఎక్విప్ మెంట్ ఐఎన్ సీ, లూకుంగ్ టెక్సాలజీస్ కార్ప్, బీజింగ్ ఝాన్ గ్వాంకన్ డెవలప్ మెంట్ ఇన్వెస్ట్ మెంట్ సెంటర్, గోవిన్ సెమీ కండక్టర్స్ , గ్రాండ్ చైనా ఎయిర్ కో లిమిటెడ్, గ్లోబల్ టోన్ కమ్యునికేషన్ టెక్నాలజీ, చైనా నేషనల్ ఏవియేషన్ హోల్డింగ్స్ పై కూడా అమెరికా ప్రభుత్వం ఆంక్షలు విధించింది.
బైడెన్ కు ఇబ్బందికరంగా తాజా ఆంక్షలు:
అధికారం నుంచి దిగిపోయే ముందు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు బైడెన్ కు ఇబ్బందులు సృష్టించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నట్లు అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చైనాతో సంబంధాల పునరుద్ధరణకు బైడెన్ సిద్ధంగా ఉన్న నేపథ్యంలో తాజా ఆంక్షల నేపథ్యంలో ఆయన ఇరుకున పడనున్నారు. దీంతో అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక చైనాపై బైడెన్ వైఖరి ఎలా ఉండబోతోందోనని పలు దేశాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.
ఇది చదవండి: అమెరికాలో ఎమర్జెన్సీ