Saturday, December 21, 2024

అంకుల్ ని చూస్తే భయమేస్తుంది!

జర్నీ -4

బాబా, ఆంటి మమ్మి స్నేహితురాలు, ఆంటి భర్త ఆంటి స్నేహితురాలి కూతురుతో చెడ్డగా ప్రవర్తించాడు అంటే ఆంటి నమ్ముతుందా, అమ్మ  రియాక్షన్ఎలా ఉంటుందో ఏంటోనని…  

గుడ్ అనాలిసిస్ నీది, ఇంత కామన్ సెన్స్ ఉంది, నీ బుర్రలో తెలివి ఉంది, మరి ఎందుకు రా అంతగా ఏడ్చావు, ఎన్ని కన్నీళ్లు వృథా అయ్యాయి, పోయిన కన్నీళ్లు తిరిగి రాలేవు. 

అదే బాబా, ఇప్పుడు ఆలోచిస్తే నాకూ ఆశ్చర్యం వేస్తుంది, ఎందుకు ఏడ్చాను అని. అంకుల్ ను చూస్తూనే భయం వేస్తోంది. కళ్ళు మూసినా,తెరచినా  అంకుల్ చేష్టలు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. నిన్ను చూస్తూనే దైర్యం తో పాటు ఏడుపు వచ్చింది,మరో వైపు  బాధ,  ఎలా చెప్పాలా అని ఏడుస్తున్నాను. 

Also read: డర్టీ అంకుల్!

కూతురు తలపై చెయ్యి పెట్టి తలను నిమురుతూ, తల వెంట్రుకలను సరి చేస్తూ, ఇప్పుడు బాధ తగ్గిందా, నేను వాడి సంగతి చూస్తాను, నిశ్చింతగా ఉండు బేటా, నీవు వాడిని చూసి భయపడటం నాకు నచ్చలేదు, వురికించి ఉరికించి ఉరివేయలి, సమాజానికి, ఆడ పిల్లల జీవితాలకు ఇలాంటి నీచుల వల్లే హాని, సమిష్టిగా కలిసి బ్రతికే పద్ధతిని  ఈ నీచులు చెడగొడతారు, వీళ్ళు దేనికీ పనికి రారు, సమాజాన్ని భ్రష్టు పట్టిస్తారు, 

ఆ తరువాత ఏమయ్యిందో అది చెప్పు బెనర్జీ

 బెనర్జీ సౌమ్య వైపు చూసి, నీవు నా ప్లేస్ లో ఉంటే ఏం చేసే దానివో ముందు అది చెప్పు, ఏం జరిగిందో అంత తొందరగా చెపుతే, మీలోని యాన్గ్సైటీని నేను మిస్ అవుతానుకాబట్టి, మెల్లగా మెల్లగా చెపుతాను, మీరు అయితే ఏం చేసేవారు?

సౌమ్య, ఇలాంటి నీచులను చూస్తే నాకు భయం అని ఏడ్చేసింది. 

అయ్యో సౌమ్య ఏంటది అంటూ రామన్, నేను అయితే  రచన కు చెప్పేవాడిని, ఆ తరువాత స్నేహితురాలికి చెప్పేవాడిని, చివరికి రెండు తగిలించేవాడిని, దీనికి ఏడుపా,   

అది విన్న బెనర్జీ ఏమని రచనకు చెప్పేవాడివి అని సర్కాస్టిక్ గా అడిగాడు.

 స్నేహితురాలి భర్త ప్రవర్తన రుచికతో ఎలా ఉన్నదో వివరించి,  ఇంట్లో ఆడపిల్లల పట్ల ఎలా ఉంటాడో తెలుసుకొని రెండు వాడికి తగిలించి పోలీసులకు అప్పగించేవాడిని,  ఇలాంటీ వాళ్లు క్రూర జంతువుల కన్నా ప్రమాదకారులు. మన మధ్యే తిరుగుతూ ఆడపిల్లల విషయంలో చొంగలు కారుస్తూ వల్గర్ చేష్టలతో, అమ్మాయిలకు మానసికంగా ఇబ్బంది కలిగించి అదో సైకో ఆనందం అనుభవిస్తారు, ఇది మారాలిరా బెనర్జీ, ఆడపిల్లల విషయంలో చాలా మారాలి, మొత్తం పౌర సమాజం ప్రక్షాళన కావాలి.    

సౌమ్య ఏడవటం తగ్గించి,  రామన్ చెప్పేది   వింటూ,  గత  కొంత  కాలం  నుండి  కొందరు కౌమార దశకు చేరే అబ్బాయిలతో కూడా చాలా వల్గర్        గా  ప్రవర్తిస్తున్నారు. ఆ అబ్బాయిలు మొదట్లో వారి ప్రవర్తన అర్థం కాకఅయోమయానికి గురౌతున్నారు. అర్ధం చేసుకున్నాక పెద్దలకు చెప్పినా అబ్బాయిలతో అబ్బాయిల చేష్టలు ఆలా ఎందుకు ఉంటాయని ఎదురు ప్రశ్నిస్తున్నారు. మరియు  అబ్బాయిలను ఎక్కడంటే అక్కడ కొందరు మగవాళ్లు చేతులతో తడుముతూ ఉంటారు అంటే కూడా నమ్మటం చాలా కష్టం అవుతుంది, ఇది ఎలా అంతం అవుతుంది. 

సౌమ్య చెప్పింది రచన వింటూ అవును, చాలా  ఇబ్బంది  పడుతున్నారు  బెనర్జీ ,  హాస్టల్స్ ల్లో ఇది దిన దినం బాగా పెరుగుతోంది, కొన్ని జైళ్లల్లో పరిస్థితి చేతులు దాటిపోతున్నట్లు కూడా అప్పుడప్పుడు వార్తల్లో చదవటమూ, వినటమూ జరుగుతోంది. ఆ మధ్య ఈ గంభీరమైన సమస్య పై ఏదో సినిమా వచ్చింది. కరెక్టుగా గుర్తులేదు. ఇదొక మానసిక సమస్యగా సమాజంలో, ఇళ్లల్లో వ్యాపిస్తుంది.

కరెక్ట్డ్ రచన నీవు చెప్పేది, అయితే చిన్న పిల్లల పట్ల అంటే ఆడపిల్లల పట్ల, మగపిల్లల పట్ల ఎవ్వరి పట్ల లైంగిక ఆకర్షణను పెద్దవాళ్ళు అనుభవిస్తారో వారు  పెడోఫిలియా (Pedophilia) అనే మానసిక వ్యాధితో ఉన్నట్లు భావించాలి అని వైజ్ఞానం, వైద్య విజ్ఞానం చెపుతుంది.

Also read: జిప్సీ కారు, నాలుగో తరం!

అది సరే బెనర్జీ,  పెడోఫిలియా గురించి ఇంకాస్తా వివరంగా వివరిస్తావా అని రామన్,

ఓ యస్, ఓపిక ఉంది అంటే భేషుగ్గా వివరిస్తాను, మిగతా ఇద్దరు శ్రోతల అభిప్రాయం ఏంటో మరి, సౌమ్య నీవు ఆల్రైట్ కదా, నీవు గ్రీన్ సిగ్నల్ ఇస్తే నేను కొనసాగిస్తాను.

నాకు ఓకె, రచన నీవు?

నాకూ ఓకె, కాని, మధ్యలో మయూర్, సాకేత్, మంజు మోహన్, భార్గవి వాఘ్దేవి లు కలుస్తున్నారు కదా, బెనర్జీ అప్పటి వరకు ముగిస్తే…

మధ్యలోనే రామన్ కలిగించుకొని, ముగించక పోయినా ఫర్వాలేదు, వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలను కూడా షేర్ చేస్తే  ఇంకా బాగుంటుంది.

రామన్ వైపు సౌమ్య చూసి, అలానే కానివ్వు బెనర్జీ, రామన్ అంటున్నాడు అంటే రామం చెప్పినట్లే…

సర్దార్జీ ఢాబా వచ్చేస్తున్నది, చాయ్ లు ఫలహారాలు అల్పాహారం తీసుకున్నాక మన ముచ్చట్లు మొదలు. 

రామన్ రోడ్డుపై ఉన్న గుంపు వైపు చూపిస్తూ, ఒరేయ్ బెనర్జీ మంజు మోహన్, సాకేత్ లు రా అవి ఏవో బ్యానర్లు పట్టుకోని మనవైపే వస్తున్నారు,

మాటల్లో పడి గమనించలేదు, అవును మన సహచరులే, ఇంకా వారితో మరికొందరు ఉన్నారు,

జిప్సీ జీపులో నుండే అందరికి చేతులతో వందనాలు తెలుపుతూ సర్దార్జీ దాబా దగ్గెర జిప్సీ ని ఆపేసారు,

అందరి కన్నా ముందు చెంగున సౌమ్య దుమికినంత పనిచేసి దిగి చర చరా మని సహచరులను సమీపించింది, ఒక్కోరిని కౌగిలించుకుంటూ సంతోషాన్ని వెలిబుచ్చింది,

ఆ వెనకనే మిగతా ముగ్గురూ రచన , బెనర్జీ , రామన్ లు సమీపించి కరచాలం చేసారు. వచ్చిన వారి చేతుల్లో కొన్ని హ్యాండ్ హోర్డింగ్సుల్లో స్వాగతం సాహస వీరులు, వెల్కమ్ అని రాసి ఉన్నాయి, మరికొన్ని హోర్డింగ్స్ ల్లో చిన్న పిల్లలపై లైంగిక దాడులు ఆగాలి, Stop Sexual Abuse on Children, Justice for Reshma(4) అని రాసినవి పట్టుకున్నారు,

వావ్, ఒకవైపు నిరసన, మరో వైపు స్వాగతం భలేగా వుంది,

ఎస్ బెనర్జీ, నీ ట్రైనింగ్, మన వాహనానికి ఈ బ్యానర్లను కట్టుకోని టూర్ ప్రయాణం చేద్దాము,

మంచి ఆలోచన మయూర్, మనది సరదా టూర్ మాత్రం కాదు, బెనర్జీ ముందే ప్రకటించాడు,

ఏమని రామన్,

పూర్తిగా చెప్పనివ్వండి సాకేత్, మీకందరికీ అప్పుడే బీపీ , షుగర్ లు వచ్చాయా ఏంటి, భార్గవి తప్పా అందరూ చిన్నవాళ్ళే అనుకుంటాను.

ఒరేయ్ రామన్, నీ కొంటె వేషాలు నా దగ్గెరనా, నీ చిలిపి చేష్టలు ఆపలేదా, బెనర్జీ వీడు మారడా?

మారేవాడినే భార్గవి వాఘ్దేవి గారు. మీ ప్రేమ నాకు దొరకలేదు, ఒంటరిగా ఉండిపోయాను. మీ ప్రేమనేమో మరొకరిపైనా…

అయ్యో, మా నాయననే, నాపై ప్రేమతో, బెంగతో ఒంటరిగా ఉండిపోయావు. ప్చ్ , పాపం సుప్రియ, వైశ్య ఛాందసత్వానికి భయపడి దేశం వదిలి పారిపోయింది. సుప్రియా ఎక్కడున్నా వెంటనే వచ్చెయ్యి అని కేక వేసింది,

భార్గవి కేకకు సర్దార్జీ తో సహా ధాబాలో ఉన్న చాయ్ ప్రియులందరు ఆశ్చర్యంగా నోరెళ్ళ బెట్టి చూసారు,

వీరు కూర్చున్న ఆపోజిట్ వైపు నుండి కొన్ని రాళ్ళూ వచ్చి వీళ్లపై పడ్డాయి, అవి రాళ్ళ వర్షమా, లేక వేరెవ్వరైనా వేస్తున్నారా?

… అజీబ

9440430263

Also read: జర్నీ -1

(ఇంకా ఉంది)

Jaya Vindhyala
Jaya Vindhyala
రచయిత్రి తెలంగాణ హైకోర్టులో న్యాయవాది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లో సభ్యురాలు. హైకోర్టు బార్ అసోసియేషన్ ప్యాట్రన్. మెహబూబ్ కా మెహందీ, బాండెడ్ లేబర్ వంటి అంశాలపైన కేసులు వాదిస్తారు. పోలీసుల వేధింపులకూ, పోలీసు కస్టడీలో మరణాలకు వ్యతిరేకంగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు వేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ అధ్యక్షురాలిగా పని చేశారు. ప్రస్తుతం అదే సంస్థ తెలంగాణ విభాగానికి ప్రధానకార్యదర్శి. నక్సలైట్లకీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికీ మధ్య 2004లో జరిగిన చర్చలలో చురుకైన పాత్ర పోషించారు. అసంఘటిత కార్మికుల సమస్యలపై విదేశాలలో జరిగిన సమావేశాలకు హాజరైనారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ ఎల్ఎల్ బీ చదివారు. న్యాయవాదన వృత్తి అయితే కథలు రాయడం ఆమె ప్రవృత్తి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles