రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
ప్రియురాలి పిలుపులోని మాధుర్యాన్ని నింపుకొని
కూస్తూంది కోయిల వసంతం వచ్చిందంటూ
ఒళ్ళు విరుచుకుంటూ నిద్ర లేచిన యువకుడిలా
చలిరోజుల బద్ధకాన్ని వదిలించుకొని చిగురులేస్తుంది ప్రకృతి
లే ఎండల మార్దవం తగ్గుతుంటే
తీక్షణత మెల్లిగా పెంచుతున్నాడు కిరణతేజుడు
చరాచర ప్రకృతి అంతా పులకిస్తుంది
చెట్లు లేత పచ్చదనం పులుముకుంటున్నాయి
ఋతువు మారిన సంకేతంగా పూలు, పళ్ళు మారాయి
ఎండ, వాన, చలి మితంగా ఉండే వసంత ఋతువు
అందరికీ ఆహ్లాదం పంచుతుంది.
నవ సంవత్సరానికి నాంది ఉగాది
జనం జవ జీవాలు నింపుకునే కాలం
కొత్త ఊహలు, ఆశలు, ఆశయాలు మొలకలేసే రోజు
అందరం బాగుండాలని కోరుకునే రోజు.
అసత్య ఆరోపణలు, ఆక్రమణలు, కక్షలు, దౌర్జన్యాలు లేని,
కల్లా కపటం లేని కారుణ్య సమాజంలో
న్యాయాన్ని న్యాయమని నిరూపించే వ్యవస్థలో
రక్షక భటులు సామాన్యుడికి కూడా రక్షణ కల్పించే సంఘంలో
జనం ధైర్యంగా మాట్లాడ గలిగిన పరిస్థితిలో
అర్థంలేని కుల రాజకీయాల బెడద లేకుండా
విద్వేషం లేకుండా, మత సహనంతో మెలిగేలా
సత్య ధర్మాలతో మా చెలిమి చెడకుండా
అందరూ సంతోషంగా బ్రతకాలని ఆశీర్వదించు ప్రభూ.