మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే అధికార నివాసమైన ‘వర్ష’ బంగ్లాకు ముఖ్యమంత్రి కేసీఆర్ తన బృందంతో ఆదివారం మధ్యాహ్నం చేరుకున్నారు. లంచ్ అనంతరం ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సినీ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా హాజరయ్యారు. భవిష్యత్ రాజకీయాలు, ప్రస్తుత రాజకీయాలతో పాటు కేంద్ర ప్రభుత్వ విధానాలపై చర్చిస్తున్నారు. ఈ సమావేవం ముగిసిన అనంతరం అనంతరం ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను కేసీఆర్ కలవనున్నారు. సాయంత్రం 7.20 గంటలకు సీఎం కేసీఆర్ ముంబై నుంచి హైదరాబాద్‌కు రానున్నారు.ముఖ్యమంత్రి వెంట ఎంపీలు సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్సీలు కవిత, పల్లా రాజేశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్ రెడ్డి ఉన్నారు.