ఉమ్మడి పౌరస్మృతి- 3
ముందు హిందూ మతాల మధ్య ఉండే వ్యత్యాసాలన్నీ తొలగించే విధంగా ఒకే యూసిసి చేయడం సాధ్యమా? రాజ్యాంగం ప్రాథమిక హక్కులకు కుటుంబ చట్టాలకు మధ్య సంఘర్షణ తొలగించడానికి ఉమ్మడి పౌర స్మృతి చట్టం సాదించడం ఈ దశలో సాధ్యం కాదు. వాంఛనీయం కాదు. హక్కులకు కుటుంబ చట్టాలకు మధ్య సంఘర్షణ రాబోయే కాలాల్లో వివక్షనూ, అసమానతలనూ తగ్గించడానికి క్రమంగా ప్రజాస్వామ్య పటిష్ఠం చేసే దశలో సాధ్యమవుతుందని 2018 లా కమిషన్ వివరించింది. అందుకు ఎన్నో చట్టాలలో పార్లమెంట్ ద్వారా సవరణలను చేయడం అవసరం. కుటుంబ శాసనాలలో మతాలకు సంబంధించిన నియమాలలో అయోమాయాలూ, అనుమానాలూ చాలా ఉంటాయి. వాటికి స్పష్టత సాధించడం ద్వారా చట్లాలను మార్చుకోవచ్చు.
బలవంతంగా కాపురానికి?
మరో తీవ్రమైన పనికిరాని నియమానికి కావలసిన సవరణ ఇది. Restitution of Conjugal Rights అనే ఒక హక్కు ఉంది. కాపురానికి వచ్చిన లేదా మగవారిని స్త్రీని విచారణ తరువాత కోర్టు వారు మహిళను పంపండి అని డిక్రీ ఇవ్వవచ్చు. లేదా మగవాడికి కూడా భార్యను ఏలుకోవాలని డిక్రీ ఇవ్వడానికి కోర్టుకు అధికారం ఉంది (గత రోజుల్లో తెలుగువారు ఏలుకోవాలని కోర్టువారు ఆదేశించేవారు. కాని మహిళలతో ఆదేశించే మాట పురుషాధిక్యంగా వాడుకునేందుకు సరైన పదం కాదు). ఒకవేళ భార్య వద్దనుకున్నారనుకుంటే కోర్టువారు మగవాడు ఏం చేయాలి? ఒకో కేసు పెట్టి విడాకులు ఇవ్వండి అని కోరడం తప్ప పోలీసు ద్వారా ఆడ, మగవారిని బంధించి బలవంతంగా శోభనానికి మంచం ఎక్కిస్తారా? మగవారకైనా, ఆడవారికైనా ఇది సాధ్యమా? ఇటువంటి పనికి రాని చట్టం ఎందుకు? ఒక్క నిమిషంలో ఈ చట్టాన్ని పార్లమెంట్ లో తీసిపారేయ దానికి యూసిసి ఎందుకు, దానికి ప్రభుత్వం ఎందుకు? 1983-4 మధ్య ఎపి హైకోర్టు జడ్జి స్వర్గీయ పిఎ చౌదరిగారికి సినిమా హీరోయిన్ సరిత కేసులో అద్భుతమైన తీర్పు ఇచ్చారు. 40 సంవత్సరాల తరువాత ఈ తీర్పు నిజమని అర్థమవుతున్నది. కాలానికి ముందే వచ్చిన తీర్పు అది. ఈ తీర్పు మంచిదని సుప్రీంకోర్టు వారు కొట్టేసి దశాబ్దాలు గడిచిపోయాయి. హిందూ వివాహ చట్టం లో కాపురం చేయని భార్యను, భర్తను ఏం చేయగలరు? ఈ బ్రిటిష్ కాలపు చట్టాలను ఎన్నాళ్లని భరిద్దాం? కనుక ఈ పనికి డిక్రీని ఇంకా చట్టాల్లో కోర్టుల్లో వాడుకుంటున్నారు, ఇదొక దారుణం. మహిళల హక్కులకు గ్రహణం వంటిది హిందూ వివాహ చట్టం. దాన్ని బుట్టదాఖలు చేయని కేంద్ర ప్రభుత్వం ముందు యూసిసి గురించి మాట్లాడకూడదా?
Also read: ఒక చట్టం ఒక మతం సాధ్యమా?
మైనర్లకు పోషకులు (గార్డియన్షిప్) అంశాలను కొన్ని మతాలతో ముడిపడి ఉన్నాయి. బాలికలకు ఒక రకం నియమాలు, బాలురులకు మరో రకం నియమాలు ఉంటాయి. మహిళలకు, పోషకులు, మైనర్ పిల్లల కస్టడీ, సంక్షేమ సూత్రాల వివక్షలు తొలగించే విషయాలపై 1989లో 133వ లా కమిషన్ నివేదికలో, ఇండియాలో పోషకులు, కస్టడీ చట్టాలలో తల్లిదండ్రుల పోషణలో భార్యా భర్తలకు సమానమైన భాద్యతలు ఇవ్వాలని 257వ నివేదిక 2015లో వివరించారు.
వారసత్వ సమస్యలు
కీర్తి శేషులైన పురుషుల, మహిళల వారసత్వానికి సంబంధించిన వారికి హిందూ వారసత్వ చట్టంలో వివక్షలను సవాల్ చేస్తూ కోర్ణులో అనేకానేక పిటిషన్లు వేశారు. వారసత్వంలో అమరుడైన వ్యక్తి యొక్క భార్య, ఆయన కుటుంబ సభ్యులు ప్రాథమిక వారసులవుతారు. భార్యయొక్క తల్లిదండ్రులు లేదా సంతానం కలిగిన వారు రెండో తరగతి వారసులు అవుతారు. 2008లో ఇచ్చిన 204వ, 207వ నివేదికలలో హిందువులలో స్వార్జిత ఆస్తులలో మహిళలకు ఆస్తి సంక్రమించే వారసత్వం నియమాలలో లా కమిషన్ సంస్కరణలను కొన్ని పేర్కొన్నది.
ఇండియన్ వారసత్వ చట్టం 1985 పార్శీలలో ఆస్తి సంక్రమించే వారసుల నియమాలలో నిర్వచనంలో సంస్కరణలను 110వ నివేదికలో కూడా లా కమిషన్ సూచించింది. కాని ఈ చట్టంలో ఇతర మతాల నియమాలలో చేసిన ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకించారు. కనుక ఆ చట్టంలో సవరణలపట్ల తీవ్రమైన వ్యతిరేకత వల్ల చట్టాలను ఆమోదించడానికి సాధ్యం కాలేదు.
మేఘాలయలో కొన్ని తెగల వారిలో స్త్రీ వారసత్వ ఆస్తి సంక్రమణ సంప్రదాయాలను పాటిస్తారు. అందులో చిన్నకూతురికి వారసత్వంతో వరస వస్తుంది. గార్స్ తెగలలో తల్లిదండ్రులకు భర్త అల్లుడితో కలిసి నివసించాల్సి ఉంటుంది. వారసత్వం కూడా ఆ విధంగా సంక్రమిస్తుంది.
నాగా తెగలలో మహిళ వారి తరాల వారు ఆ తెగకు చెందని వారికి ఆస్తి సంక్రమణ చెందడానికి వీల్లేదు. ఇప్పుడు యూసిసి అమలుచేయడానికి నాగా వారిని ఏ విధంగా పరిగణిస్తారు?
లా కమిషన్ల నివేదికలు
లా కమిషన్ వారు 1984లో ఒక 98వ నివేదిక ఇచ్చారు. విడాకుల తరువాత మహిళలకు జీవన భృతి maintenance ఇవ్వాలని లా కమిషన్ సిఫార్సు చేసింది. క్రైస్తవ మహిళలకు విడాకుల కారణాలలో మార్పులను 1983లో లా కమిషన్ ప్రతిపాదించింది.
1960లో లా కమిషన్ మరొక నివేదిక సమర్పించింది. క్రైస్తవ వివాహపు విడాకుల చట్టాలలో 1960న సంస్కరణలను చేపట్టాలనుకున్నారు. కాని క్రైస్తవ సంఘాల వారు వద్దంటే వద్దన్నారు.
1961లో 18వ నివేదికను లా కమిషన్ ప్రతిపాదించింది. ఆ సమస్య ఏమిటంటే మతం మార్చిన సమయంలో భార్యభర్తాల మతమార్పిడికి విడాకుల గురించిన సమస్య. యూసిసిపై ఇప్పుడు ఏం చేయగలం? అనేక రాష్ట్రాలలో హిందూ సమాజాన్ని రక్షించడానికి మతం మార్చేద్దాం అని బోలెడు చట్టాలను తెచ్చుకున్నారు. 227వ లా కమిషన్ 2009న క్రిమినల్ లా పైన మతమార్పిడి ప్రభావం బహుభార్యత్వంపైన ముఖ్యంగా ఒకే భార్యత్వం ఉండే మతాలలో (అంటే హిందూ క్రైస్తవ మతాలవారిలో), బహుభారత్వం ఉండే (ఇస్లాం) మత నియమాలలో చాలా సమస్యలు తెస్తాయి.
రకరకాల విడాకులతో మరో రకం విడాకులు ఇవి. 71న లా కమిషన్ కింద 1978లో నివేదిక ఇచ్చింది. మా తప్పేంలేదు అయినా “no fault divorce” విడాకులు తప్పని కేసులు ఇవి. దాన్ని ఏవిధంగా కూడా వైవాహికం విరిగిపోయే “irretrievable breakdown of marriage” అటువంటి కేసులు గురించి సిఫార్సు చేసింది. మరే రకాలు లేని కారణాలలో ఈ విడాకుల కేసులు కావాలి.
హిందూ చట్టంలో పిల్లలను దత్తత తీసుకోవడం సాధారణం. పత్రం రాసుకుంటారు. లేదా ఒక హోమం అనే సంప్రదాయం ఉందని రుజువైతే పత్రం లేకపోయినా ఫరవాలేదు. చట్టం కాక, హిందూ మతంలో కాల ధర్మం చేరినవారికి తల కొరివి పెట్టడానికి, పిండ ప్రదానం చేయడానికి కొడుకు ఉండాలనే లక్ష్యంతో దత్తత ఇస్తారు. దత్తత హోమం ఉండాలి. పార్సీలో దత్తత తీసుకున్న మహిళలకు హక్కులను ఒప్పుకోరు. కాని దత్త కొడుకు తన తండ్రికి అంతక్రియాలను నిర్వహించవచ్చు. జోరోస్ట్రియన్ నియమాలలో వారికి వారసత్వ హక్కులు, భృతి హక్కులు ఇవ్వడానికి ఒప్పుకోరు. కనుక ఈ మతాల వాళ్లు దత్తత నియమాలు ఒప్పుకోరు.
ఇక ఇస్లాంలో దత్తతకు అటువంటి గుర్తింపు లేదు. అయితే మతంతో సంబంధం లేకుండా ఎవరినైనా దత్తత తీసుకునే అవకాశాన్ని భారత చట్టాలు కల్పిస్తున్నాయి. అందరి కీ ఉపయోగం. తమకు మతం లేదంటే, ఇష్టంలేకపోతే ఏమీ చేయలేం. ఇప్పుడు చట్టం ద్వారా నిర్బంధించడానికి ఏం చేయాలి?
ఉమ్మడి పౌర స్మృతి విధానం ద్వారా హిందువులు, ముస్లింలు, క్రైస్తవులకు సమానంగా వర్తించేలా దత్తత నిబంధనలు ఎలా మారుస్తారంటూ సెంటర్ ఫర్ లీగల్ పాలసీ వారు అడుగుతున్నారు.
హిందూమతంలో కొన్ని సంప్రదాయాలవారు రకరకాల వివాహాలు జరిపిస్తారు. హిందూ చట్టం ద్వారా కూడా రిజిస్ట్రేషన్ సాధ్యం. ఇండియా స్పెషల్ వివాహం చట్టం 1954 కింద ఏ మతం వారికైనా పెళ్లి రిజిస్టర్ చేయవచ్చు. Section 5 of our Indian Special Marriage law (1954). అందరి మతాల, కులాల వారికి వివాహం చట్టంలోని ఈ సెక్షన్ ఉపయోగించవచ్చు.
‘పెళ్లికి, విడాకులకు దేన్ని ప్రాతిపదికగా తీసుకుంటారు? దత్తత ప్రక్రియ ఎలా ఉంటుంది? విడాకులు తీసుకున్నప్పుడు ఆస్తుల పంపకాన్ని ఎలా చేపడతారు? వారసత్వంగా వచ్చే ఆస్తిని పొందేందుకు ఎలాంటి నిబంధనలు తీసుకొస్తారు? ఇటువంటి ప్రాథమిక ప్రశ్నలకు యూనిఫాం సివిల్ కోడ్ ప్రతిపాదకులు సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ వివరాలు ఎవరిస్తారు? కేంద్రప్రభుత్వం ఎప్పుడు ఏ రకంగా అందరికీ వర్తించే చట్టం అంటే ముస్లిం, క్రైస్తవ, ఫార్సీ, వగైరా చట్టాలన్నిటికీ యూసిసి అంటుందా? లేదా స్పెషల్ మ్యారేజ్ చట్టం 1954 మొత్తం దేశానికి ఒకే పెళ్లి చట్టాన్ని అమలు చేస్తారా? ఆపనే చేస్తే కొత్త చట్టం ఇంకోటి చేస్తారా? ఇదేమీ చెప్పకుండా యూసీసీ చేద్దాం అంటూ ఉపన్యాసాలు చేసే మహానుభావులు ఎందరో ఉన్నారు.
కల్తీ ‘ప్రేమ’లా?
యువతీయువకుల తప్పుల ఫలితం పిల్లలకు కష్టాలా? ఉదాహరణకు అక్రమ సంతానాలు అని ముద్ర పొందిన వివక్షకు గురయిన పిల్లలకు చట్టాలు ఏ విధంగా చేస్తారు? భార్యాభర్తల మధ్య కల్తీ ప్రేమలు రావడం వల్ల, అందుకు క్రిమినల్ కేసులు కోర్టుకు రావడం వల్ల, ముస్లింలు చాలామందికి పెళ్లి చేసుకోవడం వల్ల రకరకాల సమస్యలు, క్రిమినల్ ఘర్షణలు వస్తూ ఉన్నాయి. పార్సీ లో విడాకుల సంఘర్షణలు మరికొన్ని. మరికొన్ని సుప్రీంకోర్టులో వివాదాలు పెండింగ్ ఉండడం వల్ల అనేక సమస్యలు ఉన్నాయి. ఇటువంటివే అనేక సమస్యలు ఉన్నాయి. వాటికి పక్కన బెట్టి యూసిసిని నెత్తిన పెట్టుకుంటున్నారు. మణిపూర్ లో మారణ హోమం చేస్తూ ఆడా మగా తేడా లేకుండా మతం పేరుతో దారుణాన్ని సాగిస్తున్నారు. ప్రతిదానికీ ఏవిధంగా గెలవడం అనే ఆలోచనేనా?
Also read: అన్ని మతాలకు ఒకేలా ఒక ‘లా’ ఎలా?