- సామాజిక సమతుల్యంపై జోరుగా చర్చలు
- అభివృద్ధి తూర్పు ఐతే సమస్యల హోరు పడమర
కూతవేటు దూరంలో కేసీఆర్ ఫామ్ హౌస్ ఉంది. ఐతే క్యాడర్ తో పాటు పార్టీ నేతలకు అందుబాటులో లేరన్న విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ఈ నెల 30న
పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది.
ముఖ్యమంత్రి హోదా వద్దు
తమకు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అక్కరలేదనీ, స్థానికంగా ఉంటూ, తమను కలుసుకుంటూ, తమ సమస్యలు అడిగి తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి ప్రయత్నించే ఎమ్మెల్యే కావాలన్న డిమాండుకు మద్దతు పెరుగుతున్నది.
ప్రాజెక్టు కట్టారు ఐతే…
ప్రాజెక్టు కట్టారు సరే కానీ ముంపు బాధితుల గోడు కేసీఆర్ వినిపించుకోలేదని ప్రజలు ఫిర్యాదు చేశారు. భూముల నష్టపరిహారం చెల్లింపుల్లో గోల్ మాల్ జరిగిందనీ, భూములకు పరిహారం చాలా తక్కువ ఇచ్చారనీ అంటున్న రైతులలో అసంతృప్తి కొట్టవచ్చినట్టు కనిపించింది. అభివృద్ధి అంటే రోడ్లు, భవనాలు, గ్రీన్ కో అంటే కుదరదని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. లోకల్ మంత్రి హరీష్ రావు గజ్వేల్ ఇంచార్జి ఉన్నప్పటికీ ప్రజలకు అందుబాటులో లేరన్న విమర్శలు బలంగా వున్నాయి. మల్లన్న సాగర్, కొండ పోచమ్మ ప్రాజెక్టులను అధికార పార్టీ నేతలు బంగారు బాతు గుడ్డులా వినియోగించుకున్నారు. కేసీఆర్ అందుబాటులో లేకపోవడంతో స్థానిక నేతలు ఆడిందే ఆటగా మారిందని అన్నారు.
ముత్యంరెడ్డిపై విమర్శల వెల్లువ
గజ్వేల్ నియోజకవర్గం అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. గజ్వేల్ అభివృద్ధిపై పర్యవేక్షించేందుకు మాజీ ఎం ఆర్ ఓ ముత్యంరెడ్డిని కేసీఆర్ నియమించారు. జరుగుతున్న అభివృద్ధి పనులపై ముత్యంరెడ్డి కమీషన్లకు కక్కుర్తి పడుతున్నారని తీవ్ర విమర్శలు వున్నాయి. ఐఏఎస్ లు సైతం ముత్యంరెడ్డి పై ఫిర్యాదు చేసారు. ముత్యంరెడ్డిపై ఎన్ని విమర్శలు వచ్చిన కేసీఆర్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పార్టీ నేతల్లో అసంతృప్తి పెరిగింది.
భూములను చౌకగా కొన్ని లాభాలకు అమ్మటం
గజ్వేల్ చుట్టుపక్కల పరిశ్రమలు ఏర్పాటుకు భూముల సేకరణ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఐతే భూముల సేకరణలో ప్రభుత్వం తక్కువ ధరకు కొనుగోలు చేసింది. సేకరించిన భూములను అధిక ధరకు పరిశ్రమల పెద్దలకు ప్రభుత్వం అమ్ముకుందని భూములు కోల్పోయిన భాధితులు వాపోతున్నారు.
గజ్వేల్ నుంచి ముచ్చటగా మూడవ సారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలాగా వున్నారు. తాను చేసిన అభివృద్ధికి గజ్వేల్ ఓటర్లు పట్టం కడతాటని కేసీఆర్ బలంగా నమ్ముతున్నారు. ప్రత్యర్థులు తనకు పోటీలో ఉండరని కేసీఆర్ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు.