కోస్తాంధ్రకు మరో తుపాను ప్రమాదం పొంచి ఉంది. ఈనెల 29న (ఆదివారం) బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. కొన్నిరోజులుగా నివార్ తుపాను వణికిస్తుండగా వచ్చే నెల (డిసెంబర్)లో మరో రెండు తుపాన్లు వచ్చే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. 2వ తేదీన రాగల ‘బురేవి తుఫాన్’ ప్రభావం దక్షిణ ఆంధ్రా, రాయలసీమ, ఉత్తర తమిళనాడులో ఎక్కువ ఉండవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అలాగే 5వ తేదీన మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్ప పీడనంతో ‘టకేటి తుఫాన్’ ఏర్పడే అవకాశం ఉందని, 7 తేదీన ఆంధ్రప్రదేశ్, దక్షిణ తమిళనాడు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిం చింది.తీవ్ర వాయుగుండం కాస్తా తుపానుగా మారే అవకాశం ఉందని హెచ్చరిం చింది. డిసెంబర్ నెలలో మరో రెండు తుపాన్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపింది.