* పరారీ లో ఒకరు
* 750 గ్రాములు బంగారం, 800 గ్రాముల వెండి స్వాధీనo
ఈ రోజు బెల్లంపల్లి కి దొంగలించిన సొత్తు ను అమ్మడానికి దొంగలు వస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు రామకృష్ణాపూర్ ఎస్ఐ కటిక రవి ప్రసాద్, సిబ్బంది తో కలిసి వాహనాలు తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానం గా ఇద్దరు బైక్ పై రావడం గమనించి వారిని ఆపి వారి వాహనం పత్రాలు, వారి వివరాలు అడగగా వారు సరైన సమాధానం చెప్పక పోవడం తో వారిని అదుపులోకి తీసుకోని వారి వద్ద ఒక బ్యాగ్ ని తనిఖీ చేయగా దొంగిలించిన బంగారు ఆభరణాలలో వారి వద్ద ఉంచుకున్న ఆభరణాలు ఇవి యేనని ఒక బ్యాగ్ లో నుండి తీసి బంగారు, వెండి ఆభరణాలను, samsung ట్యాబు కలదు. ఇవి ఎక్కడివి అని అడగగా సూరజ్ సత్యవతి, రాహుల్ శెట్టి లు దొంగలించిన బంగారు ఆభరణాలను మంచిర్యాలలో అమ్మడానికి ప్రయత్నం చేసినారు కానీ బంగారు షాపుల వారు బంగారు, వెండి ఆభరణాలను కొనకపోవడంతో అందులో కొన్ని ఆభరణాలను సూరజ్ అమ్మడానికని జగదల్పూర్ కి తీసుకొని వెళ్ళినాడు. రాహుల్ శెట్టి వద్ద వున్నా మరియు సత్యవతి వద్ద వున్నా ఆభరణాలను బెల్లంపల్లి లో అమ్మడానికి వెళ్తున్నాం అని చెప్పడం జరిగింది.
ఆభరణాలను తూకం వేసే వ్యక్తిని పిలిపించి సత్యవతి వద్ద వున్నా ఆభరణాలు తూకం వేయగా:
1-బంగారు పుస్తెలతాడు, 1- బంగారు నక్లెస్, 1- రెండు వరసల బంగారు చైను, 2-బంగారు చైన్లు, 3 జతల బంగారు చెవి కమ్మలు. 4-బంగారు ఉంగరాలు, జత బంగారు మాటి లు, 9 బంగారు ఉంగరాలు, ఒక జత చెవి కమ్మలు, ఒక జత వెండి పట్టిలు, 1-బంగారు పుస్తెలతాడు, 1-బంగారు చైను, 1-బంగారు నెక్లెస్, 1-బంగారు చంద్ర హారం,2-బంగారు చైన్లు, ముద్దా బంగారం,1- బంగారు నెక్లెస్, బంగారు లక్ష్మి దేవి బిళ్ళలు మరియు 3-బంగారు ఉంగరాలు, ఒక జత బంగారు మాటీలు, ఒక జత బంగారు చెవి కమ్మలు మరియు ఒక జత బంగారు బుట్టాలు మొత్తం 395 గ్రాముల బంగారు ఆభరణాలు మరియు 10 తులాల వెండి పట్టిలు కలదు.
Also Read : భగవంతుడుంటే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి – భగత్ సింగ్
రాహుల్ శెట్టి వద్ద వున్నా ఆభరణాలు తూకం వేయగా:
2-బంగారు పుస్తెలు, 2-ఉంగరాలు, ఒక జత బంగారు కమ్మల బుట్టాలు, ఒక జత బంగారు మాటీలు, ఒక జత వెండి పట్టిలు, వెండి గంధం డబ్బాలు, వెండి కుంకుమ భరణి, ఒక జత వెండి మాణిక్యాలు, ముద్ద బంగారం, 1-బంగారు హారం, మూడు జతల బంగారు కమ్మలు, 2-నల్ల పూసల గొలుసులు, 3-బంగారు గొలుసులు, ఒక జత బంగారు గాజులు, ఒక జత కమ్మల బుట్టాలు, రెండు బంగారు ఉంగరాలు, ఒక జత మటిలు మరియు పావు కిలో వెండి ముద్ద, 2-బంగారు ఉంగరాలు,2-బంగారు చైన్లు, 1-బంగారు నెక్లస్, జత బంగారు మాటీలు, 2-బంగారు ఉంగరాల, 1-బంగారు నల్ల పూసల గొలుసు, 1-బంగారు చైను, జత బంగారపు కమ్మల బుట్టాలు, 1-బంగారపు ఉంగరం, జత మాటీలు, ముద్ద బంగారం మొత్తం గ్రాముల బంగారు ఆభరణాలు మరియు 73 తులాల వెండి ఆభరణాలు వున్నవి. వీరు దొంగతనం చేసేటప్పుడు ఉపయోగించిన మోటార్ సైకిల్ ని పంచులమైనా మేము గమనించి చూడగా అది bajaj discovery కంపెనీ ది అయి వుండి, నెంబర్ లేదు మరియు ఇంజిన్, చాసిస్ నెంబర్లు గుర్తించకుండా స్క్రాచ్ చేయబడి వున్నవి. వెంటనే పొలిసు వారు పై బంగారు, వెండి ఆభరణాలకు, Samsung tab కి మరియు దొంగతనానికి ఉపయోగించిన bajaj discovery మోటార్ సైకిల్ స్వాధీనం పరచుకకోవడం జరిగింది.
రాహుల్ శెట్టి వద్ద సుమారు 340 గ్రాములు స్వాధీనం చేసుకోవడం జరిగింది.
అదేవిదంగా వారు దొంగిలించిన భారత్ గ్యాస్ సిలెండర్, గ్యాస్ స్టవ్ మరియు TCL టీవీ లను మేము కిరాయికి ఉంటున్న ఇల్లు శ్రీ శ్రీ నగర్ లో దాచి ఉంచినామని మాతో పాటు వస్తే చూపిస్తామని సత్యవతి మరియు రాహుల్ శెట్టి లు ఒప్పుకున్నారు.
Also Read : మావోయిస్టు అగ్రనేత వారణాసి సుబ్రహ్మణ్యం దంపతుల అరెస్ట్
నేర విధానం
ప్రజలకు ఎవరికీ అనుమానం రాకుండా సాధారణ జీవితం గడుపుతూ భర్త పగటిపూట ఆటో డ్రైవర్ గా పని చేస్తూ, భార్య గృహిణిగా ఉంటూ వారిపై ఎవరికి అనుమానం రాకుండా ఆటోలో తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇండ్లను గుర్తించి రెక్కీ నిర్వహించి దొంగతనాలకు పాల్పడ్డారు. భర్త సూరజ్ వారు టార్గెట్ చేసిన ఇంట్లో కెళ్ళి దొంగతనానికి పాల్పడుతున్న సమయంలో ఎవరికీ అనుమానం రాకుండా బయట పరిస్థితులను గమనిస్తూ భార్య సత్యవతి ఇంటి బయట కాపుల గా ఉంటుంది.
సూరజ్ శెట్టి, మరియు సత్యవతి సూరజ్ శెట్టి @ సత్యవతి w/o సూరజ్, వయస్సు: 25 సo,, లు,, కులం:కుమ్మరి(బంగి), వృత్తి: గృహిణి, r/o బలికుంట, జగదల్పూర్, చత్తీస్గఢ్ రాష్త్రం. లు ఆటో నడిపితే వచ్చే సంపాదన వారి కుటుంబ పోషణకి, భార్యాభర్తల జల్సాలకి సరిపోయేవి కాదు, అందుకు వీరు డబ్బులను సులువుగా సంపాదించాలనే దురుద్దేశం తో జగదల్పూర్ మరియు చుట్టూ ప్రక్కల ప్రాంతాల లోని ఇతరుల ఇండ్లలో దొంగతనాలు చేయాలని నిర్ణయించుకోగా అందుకు వీరు సరే అనుకోని . అప్పటి నుండి అనగా 2017 వ సంవత్సరం నుండి దొంగతనాలు చేస్తూ, దొంగిలించిన బంగారు, వెండి ఆభరణాలను అమ్మి వచ్చిన డబ్బులతో మేము జల్సాలు చేసేవాళ్లు.అంతేకాక బలికుంట లో ఒక ఇల్లు కూడా కట్టుకున్నారు . అలా దొంగతనాలు చేస్తుండగా, అక్కడి పొలిసు వారు సూరజ్ పై చాల కేసులు పెట్టినారు. వీరు ఇక అక్కడ దొంగతనాలు చేయడం కష్టమని ఆలోచించి భార్యభర్తలు , పిల్లలతో మంచిర్యాల కి వచ్చి కొన్ని రోజులు మంచిర్యాల లో, కొన్ని రోజులు గద్దేరాగడి లో వున్నారు . ఆ తర్వాత వీరు హమలివాడ లో కొన్ని రోజులు కిరాయి వున్నాము. ప్రస్తుతం మంచిర్యాల లోని శ్రీశ్రీ నగర్ లో కిరాయికి ఉంటున్నారు . వీరిపై ఇక్కడ ఎవరికీ అనుమానం రావద్దని సూరజ్ ఇక్కడ ఆటో నడిపేవాడు. వీరు ముందుగా మంచిర్యాల , రామకృష్ణాపూర్, మందమర్రి, కాసిపేట్ ప్రాంతాలలో లో తిరిగి ఇంటికి మరియు గేట్ల కి తాళం వేసి ఉన్న ఇల్లులను వెతికి చూసుకొని తర్వాత సాయంత్రం లేదా మధ్య రాత్రి సమయంలో కాని తెల్లవారు జామున కాని ఇనుప రాడ్డుతో గొల్లాలని కాని తాళాన్ని కాని పగుల గొట్టి దొంగతనం చేసి, సమయం చూసి దొంగిలించిన ఆభరణాలను, వస్తువులను అమ్ముదామని వాటిని మేము ఇంట్లోనే వుంచేవాళ్లు.
Also Read : న్యాయవాద దంపతుల హత్య కేసులో నిందితుడు వెల్ది వసంత రావు అరెస్ట్
భార్యభర్తలు సూరజ్, సత్యవతి ఇద్దరు కలిసి చేసిన దొంగతనల వివరాలు:
గత రెండు సంవత్సరాల క్రితం అనగా 2019 సంవత్సరం సెప్టెంబర్ నెల మొదటి వారంలో నేను, సూరజ్,సత్యవతి సూరజ్ శెట్టి @ సత్యవతి లు కలిసి రామకృష్ణాపూర్ లో తిరుగుతూ అక్కడ తిరిగి తాళం వేసి ఉన్న ఇండ్లను చూసుకుంటూ మధ్యాహ్నం సమయమున రాంనగర్ లో ఒక తాళం వేసి ఉన్న ఇంటిని గమనించి ఆ ఇంటి కిటికీ గ్రిల్స్ ని ఊడదీసి ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా కలదు అట్టి బీరువా తాళం ను పగుల గొట్టి లాకర్ లో 1-బంగారు పుస్తెలతాడు, 1- బంగారు నక్లెస్, 1- రెండు వరసల బంగారు చైను, 2-బంగారు చైన్లు, 3 జతల బంగారు చెవి కమ్మలు. 4-బంగారు ఉంగరాలు, జత బంగారు మాటి లు అభరణాలతో ఉన్న బాక్స్ ఉండగా దొంగలించుకొని బయటకు వచ్చి కు వెల్లిపోయినారు . వీరు దొంగిలించిన పై ఆభరణాలను వారి వద్దనే ఉంచుకున్నారు .
తర్వాత గత సంవత్సరం 2020 నవంబర్ నెలలో సూరజ్,సత్యవతి సూరజ్ శెట్టి @ సత్యవతి కలిసి మందమర్రి లోని ౩వ జోన్ లో మద్యాహ్నం సమయం లో తాళం వేసి వున్నా ఒక ఇంటిని గమనించి, ఒక ఇనుప రాడ్ తో ఇంటి తాళం పగల గొట్టి, ఇంటి లోకి వెళ్లి బీరువాలో వున్నా 9 బంగారు ఉంగరాలు, 1 బంగారు చైను, ఒక జత చెవి కమ్మలు, ఒక జత వెండి పట్టిలు మరియు నగదు 15,౦౦౦/- దొంగిలించుకొని వెల్లిపోయినారు . వీరు దొంగిలించిన పై ఆభరణాలలో 9 బంగారు ఉంగరాలు, ఒక జత చెవి కమ్మలు, ఒక జత వెండి పట్టిలు నా వద్దనే ఉంచుకున్నారు . మిగిలిన 1-బంగారు చైను మరియు నగదు 15,౦౦౦/- రూపాయలు సూరజ్ వద్ద ఉన్నవి.
తర్వాత గత సంవత్సరం 2020 డిసెంబర్ నెలలో వీరు రాత్రి సమయంలో బొక్కల గుట్టలో తాళం వేసి వున్నా ఇంటిని గమనించి, ఆ ఇంటి కిటికీ గ్రిల్స్ ని ఊడదీసి, ఆ ఇంటి లోపల వున్నాబీరువా తాళం ని పగలగొట్టి అందులో వున్నా 1-బంగారు పుస్తెలతాడు దొంగిలించుకొని అక్కడి నుండి వెల్లిపోయినారు . మేము దొంగిలించిన బంగారు పుస్తెల తాడు సత్యవతి వద్దనే ఉంచుకున్నాది.
Also Read : శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిథిలో ఆపరేషన్ చబుత్ర
ఆ తర్వాత అదే నెలలో సూరజ్ తన bajaj discovery మోటార్ సైకిల్ (నెంబర్ లేదు) క్యాతనపల్లి వైపు వెళ్ళుతుండగా అక్కడ రోడ్డు పై ఎవరో ఒక ఆడ మనిషి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళుతుండగా, ఆమెని గమనించి, ఆమె మెడలోని బంగారు చైను లాక్కొని నా భర్త ఇంటికి వచ్చి సత్యవతి కి ఇవ్వగా తన వద్దనే ఉంచుకున్నాది .
ఆ తర్వాత ఇదే సంవత్సరం జనవరి నెల లో సోమగుడెం లోని భరత్ కాలనీ లో ఉదయం తాళం వేసి వున్నా ఒక ఇంటిని గమనించి, ఆ ఇంటి మరో తలుపుకి లోపలి వైపు బేడం ఉన్నట్లుగా గమనించి ఆ తలుపు బేడాన్ని గట్టిగా నెట్టగా బేడం వుదిపోయింది దాంతో ఇంట్లోకి ప్రవేశించి, ఇంటి లోపల వున్నా బీరువా పగలగొట్టి అందులో వున్నా 1-బంగారు నెక్లెస్, 1-బంగారు చంద్ర హారం మరియు నగదు 2,౦౦౦/-రూపాయలను దొంగిలించుకొని వెల్లిపోయినారు . మేము దొంగిలించిన పై బంగారు ఆభరణాలను సత్యవతి వద్దనే ఉంచుకున్నాది . మిగిలిన నగదు 2,౦౦౦/- రూపాయలు సూరజ్ తీసుకున్నాడు.
ఆ తర్వాత ఇదే సంవత్సరం మొదటి నెల చివరి వారం లో రామకృష్ణాపూర్ లోని విద్యానగర్ లో ఉదయం తాళం వేసి వున్నా ఒక ఇంటిని గమనించి, ఆ ఇంటి కిటికీ గ్రిల్స్ ని ఊడదీసి ఇంట్లోకి వెళ్లి, ఇంటిలో వున్నా బీరువా తాళం పగల గొట్టి అందులో వున్నా 2-బంగారు చైన్లు, ముద్దా బంగారం మరియు నగదు 7,00, 000/-రూపాయలను దొంగిలించుకొని అక్కడి నుండి పారి పోయినారు . వాటిలోని బంగారు ఆభరణాలను సత్యవతి వద్దనే ఉంచుకున్నాది . మిగిలిన నగదు 7,00,000/- రూపాయలు సూరజ్ తీసుకున్నాడు.
Also Read : సీఎం చిత్రపటానికి క్షిరాభిషేకం
ఆ తర్వాత ఇదే సంవత్సరం ఫిబ్రవరి నెలలో రాత్రి పుట మందమర్రి లోని భాగ్య నగర్ కాలనీ లో ఒక ఇంటికి వేసి ఉన్న తాళం ని పగలగొట్టి ఇంట్లోకి వెళ్లి బీరువా తాళం పగల గొట్టి అందులో వున్నా 1- బంగారు నెక్లెస్, ముద్ద బంగారం, బంగారు లక్ష్మి దేవి బిళ్ళలు 3-బంగారు ఉంగరాలు మరియు మూడు జతల కమ్మల బుట్టాలను దొంగిలించుకొని అక్కడి నుండి పారి పోయినారు . వాటిలో 1- బంగారు నెక్లెస్, బంగారు లక్ష్మి దేవి బిళ్ళలు మరియు 3-బంగారు ఉంగరాలు సత్యవతి వద్దనే ఉంచుకున్నాది . మిగిలిన ముద్ద బంగారం సూరజ్ వద్ద వున్నది.
సూరజ్,సత్యవతి సూరజ్ శెట్టి @ సత్యవతి మరియు రాహుల్ శెట్టి కలిసి చేసిన దొంగతనల వివరాలు
సూరజ్ కి తమ్ముడైనా రాహుల్ శెట్టి జగదల్పూర్ నుండి వీరి వద్దకి వచ్చి తను మున్సిపాలిటి లో పని చేసి మనివేసినానని, ఆ తర్వాత కూలీ పనులు చేస్తే వచ్చే డబ్బులు తన అవసరాలకి, జల్సాలకి సరిపోవడం లేదని సులువుగా డబ్బులు సంపాదించాలని సూరజ్ కి చెప్పడంతో మంచిర్యాల జిల్లాకి వచ్చి చాల రోజులు అయ్యింది. ఇక్కడి వాతావరణం మాకు తెలిసిపోయింది నువ్వు మాతోనే వుండు, మనం ఈ చుట్టూ ప్రక్కల ఇండ్లల్లో ఎవరు లేనిది చూసి దొంగతనాలు చేస్తే మన అవసరాలు, జల్సాలు తీరుతాయి అని చెప్పడం తో అందుకు రాహుల్ శెట్టి కూడా సరేనని అన్నాడు.
తర్వాత ఇదే సంవత్సరం ఫిబ్రవరి నెలలో సూరజ్ సత్యవతి మరియు రాహుల్ శెట్టి లము కలిసి రాత్రి పూట రామక్రిష్ణ పూర్ లోని చైతన్య కాలనీ లో ఇంటికి తాళం వేసి ఉండగా , ఆ ఇంటి కిటికీ గ్రిల్స్ ని ఊడదీసి ఇంట్లోకి వెళ్లి ఇంట్లో వున్నా బీరువా తాళం పగలగొట్టి అందులో వున్నా 2-బంగారు పుస్తెలు, 2-ఉంగరాలు, ఒక జత బంగారు కమ్మల బుట్టాలు, ఒక జత బంగారు మాటీలు, ఒక జత వెండి పట్టిలు, వెండి గంధం డబ్బాలు, వెండి కుంకుమ భరణి, ఒక జత వెండి మాణిక్యాలు మరియు వాటితోపాటు గ్యాస్ స్టవ్ మరియు గ్యాస్ సిలిండర్ లను దొంగిలించుకొని వెళ్లి పోయినారు . వీరు దొంగిలించిన పై ఆభరణాలను రాహుల్ శెట్టి వద్ద వున్నవి మరియు గ్యాస్ స్టవ్, గ్యాస్ సిలిండర్ లను కిరాయికి వున్నా ఇల్లు శ్రీ శ్రీ నగర్ లో వుంచినారు.
Also Read : మానవ అక్రమ రవాణా నివారణకు కృషి : డీసీపీ పెద్దపల్లి పి. రవీందర్
ఆ తర్వాత అదే నెల లో సత్యవతి సూరజ్లు కలిసి రాత్రి ఫూట, మంచెర్యాల కాలేజీ రోడ్ లో తిరుగుతుండగా ఒక ఇంటికి తాళం వేసి వుండడం గమనించి. కొద్ది సేపటి తర్వాత మేము ఒక రాడ్ తో ఇంటి తాళం పగల గొట్టి, ఇంట్లోకి వెళ్లి బీరువా లో వున్నా 1-బంగారు చైను, 3-బంగారు ఉంగరాలు, రెండు జతల చెవి కమ్మలు, ఒక కిలో వెండి, ఒకటి TCL కంపెనీ TV మరియు నగదు 28,౦౦౦/- లను దొంగిలించుకొని వెళ్లి పోయినారు . దొంగిలించిన పై ఆభరణాలు, నగదు 28,౦౦౦/- రూపాయలు సూరజ్ వద్ద వున్నవి మరియు TCL కంపెనీ TV ని వీరు కిరాయికి వున్నా ఇల్లు శ్రీ నగర్ లో వుంచినారు .
తర్వాత అదే నెల లో మందమర్రి లోని మారుతీ నగర్ లో మధ్యాహ్నం తిరుగుతుండగా, ఒక తాళం వేసి వున్నా ఇంటి వద్దకి వెళ్లి ఎవరు లేనిది గమనించి, అట్టి ఇంటి తాళం ని పగలగొట్టి, ఇంటిలోనికి వెళ్లి ఇంట్లో వున్నా బీరువా తాళం పగలగొట్టి అందులోని ఒక జత బంగారు మాటీలు, ఒక జత బంగారు చెవి కమ్మలు మరియు ఒక జత బంగారు బుట్టాలను దొంగిలించుకొని వెళ్లి పోయినారు . దొంగిలించిన పై బంగారు ఆభరణాలు సత్యవతి వద్దనే వున్నవి.
అదే నెలలో నేను , నా భర్త మరియు రాహుల్ శెట్టి లము రాత్రి సమయంలో గద్దేరాగడి లో కలుసుకున్నారు . అక్కడి తాళం వేసి ఉన్న ఇండ్లకోరకు వెతుకుచుండగా ఒక తాళం వేసి ఉన్న ఇంటిని గమనించి ఆ ఇంటి కిటికీ గ్రిల్స్ ని ఊడదీసి ఇంటి లోనికి వెళ్ళి బీరువా తాళం పగులగొట్టి ముద్ద బంగారు మరియు నగదు 50,000/- లను దొంగలించుకొని అక్కడి నుండి బయటకు వచ్చి వెల్లిపోయినాము. ఇందులోని ముద్ద బంగారం రాహుల్ శెట్టి వద్ద వున్నది మరియు నగదు 50,000/- లు సూరజ్ వద్ద వున్నవి.
Also Read : హత్యకేసులలో నిందితునికి జీవితఖైదు
ఆ తర్వాత అదే నెలలో ముగ్గురు రాత్రి సమయంలో క్యాతన్పల్లి లోని శ్రీ సాయి నగర్ కి వెల్లినారు . అక్కడి తాళం వేసి ఉన్న ఇండ్లకోరకు వెతుకగా ఒక తాళం వేసి ఉన్న ఇంటిని గమనించి ఆ ఇంటి కిటికీ గ్రిల్స్ ని ఊడదీసి ఇంటి లోనికి వెళ్ళి బీరువా తాళం పగులగొట్టి 1-బంగారు హారం, మూడు జతల బంగారు కమ్మలు, 2-నల్ల పూసల గొలుసులు, 3-బంగారు గొలుసులు, ఒక జత బంగారు గాజులు, ఒక జత కమ్మల బుట్టాలు, రెండు బంగారు ఉంగరాలు, 2-బంగారు ప్రధాన ఉంగరాలు, ఒక జత మటిలు, పావు కిలో వెండి ముద్ద మరియు Samsung tab లను దొంగలించుకొని అక్కడి నుండి బయటకు వచ్చి వెల్లిపోయినారు. దొంగిలించిన వాటిలో 2-బంగారు ప్రధాన ఉంగరాలు నా భర్త వద్ద వుండగా మిగిలిన 1-బంగారు హారం, మూడు జతల బంగారు కమ్మలు, 2-నల్ల పూసల గొలుసులు, 3-బంగారు గొలుసులు, ఒక జత బంగారు గాజులు, ఒక జత కమ్మల బుట్టాలు, రెండు బంగారు ఉంగరాలు, ఒక జత మటిలు, పావు కిలో వెండి ముద్ద మరియు Samsung tab లు రాహుల్ శెట్టి వద్ద వున్నవి.
తర్వాత ఇదే సంవత్సరం మార్చి నెలలో పగలు మందమర్రి లోని గాంధీ నగర్ కి వెళ్లినారు అక్కడి తాళం వేసి ఉన్న ఇండ్లకోరకు వెతికినాము, ఒక తాళం వేసి ఉన్న ఇంటిని గమనించి, ఆ ఇంటి గోడ దుకి లోపల ఇంటి తాళం పగులగొట్టి ఇంటి లోనికి వెళ్ళి బీరువా తాళం పగులగొట్టి 2-బంగారు ఉంగరాలు,2-బంగారు చైన్లు మరియు నగదు 13,౦౦౦/- లను దొంగలించుకొని అక్కడి నుండి బయటకి వచ్చి. దొంగిలించిన నగదు 13,౦౦౦/- లను సూరజ్ తీసుకున్నాడు మరియు మిగిలిన పై బంగారు ఆభరణాలు రాహుల్ శెట్టి వద్దనే వున్నవి.
కొంత దూరం వెళ్ళాక అదే మందమర్రి గాంధీ నగర్ లో తాళం వేసిన మరో ఇల్లు కనిపించగానే వెంటనే మేము ఆ ఇంటి తాళం పగల గొట్టి, లోపటికి వెళ్లి, ఇంట్లోని బీరువా తాళం పగలగొట్టి అందులోని 1-బంగారు నెక్లస్, జత బంగారు మాటీలు, 2-బంగారు ఉంగరాలను దొంగలించుకొని అక్కడి నుండి పారిపోయినారు పై బంగారు ఆభరణాలు రాహుల్ శెట్టి వద్దనే వున్నవి.
Also Read : సింగరేణి కార్మికులు, కుటుంబ సభ్యులకు ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్
ఆ తర్వాత ఇదే సంవత్సరం మార్చి నెల లో సోమగుడెం లోని భరత్ కాలనీ కి ఉదయం వెల్లినారు . అక్కడ తాళం వేసి వున్నా ఒక ఇంటిని గమనించి, ఆ ఇంటి వెనకాల వున్నా తలుపు బేడాన్ని ఇనుప రాడ్ తో ఊడదీసి, ఇంటి లోపలికి వెల్లినాము.ఇంటి లోపల వున్నా బీరువా పగలగొట్టి అందులో వున్న 1-బంగారు నల్ల పూసల గొలుసు, 1-బంగారు చైను, జత బంగారపు కమ్మల బుట్టాలు, 1-బంగారపు ఉంగరం, జత మాటీలు, ముద్ద బంగారం మరియు నగదు 58,౦౦౦/-రూపాయలను దొంగిలించుకొని వెల్లిపోయినారు . పై బంగారు ఆభరణాలు మొత్తం రాహుల్ శెట్టి వద్దనే వున్నవి మరియు నగదు 58,౦౦౦/- లు సూరజ్ తీసుకున్నాడు .
ఆ తర్వాత ఇదే సంవత్సరం మార్చి రెండవ వారం లో రామకృష్ణాపూర్ లోని తారక రామ కాలనీ కి రాత్రి సమయం లో వెల్లినారు . అక్కడ తాళం వేసి వున్నా ఒక ఇంటిని గమనించి, ఆ ఇంటి కిటికీ గ్రిల్స్ ని ఊడదీసి, ఇంటి లోపలికి వెల్లినాము.ఇంటి లోపల వున్నా బీరువా పగలగొట్టి అందులో వున్న నగదు 27,000/- లను దొంగిలించుకొని వెల్లిపోయినారు . పై నగదు 27,౦౦౦/- లను సూరజ్ తీసుకున్నాడు
పట్టుబడిన నిందితుల వివరాలు
1.సత్యవతి సూరజ్ శెట్టి @ సత్యవతి w/o సూరజ్, వయస్సు: 25 సo,, లు,, కులం:కుమ్మరి(బంగి), వృత్తి: గృహిణి, r/o బలికుంట, జగదల్పూర్, చత్తీస్గఢ్ రాష్త్రం
2.రాహుల్ శెట్టి,s/o రామ్ శెట్టి, 26yrs, మున్సిపల్ వర్కర్,కాలిపుర,జగదల్పూర్.
పరారీ లో ఉన్న నిందితుని వివరాలు
సూరజ్ శెట్టి s/o శ్రీరామ్ శెట్టి,29yrs బాలికొండ, జగదల్పూర్ చత్తీస్గఢ్ రాష్త్రం
పోలీస్ స్టేషన్ ల వారిగా దొంగతనల వివరాలు
- రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో -(8)
2.మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో -(05)
3.కాసిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో -(02)
4.మంచిర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో -(01)
స్వాధీనం చేసుకున్న వాటి వివరాలు
1.757 గ్రాముల బంగారం దీని విలువ సుమారు Rs 33,75,000/-
2.830 గ్రాముల వెండి, దీని విలువ సుమారు Rs,49,800/-
ఇట్టి దొంగలను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన రామకృష్ణాపూర్ ఎస్ఐ కటికే రవి ప్రసాద్ మరియు సిబ్బంది జంగు, శ్రీను, మార్కెండేయ, రమేష్ లను మంచిర్యాల డిసిపి ఉదయ్ కుమార్ రెడ్డి అభినందించడం జరిగింది. ఇటీ కార్యక్రమం లో రహెమన్ ఏసిపి బెల్లంపల్లి మరియు ఎడ్ల మహేష్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మందమరి పాల్గొనడం జరిగింది.
Also Read : అప్రూవల్ లేకుండా పాస్ పుస్తకాల జారీ