• నకిలీ వార్తలను మాలవీయ ట్వీట్ చేశారన్న ట్విట్టర్
• మాలవీయ పోస్ట్ కు రెడ్ ఫ్లాగ్ జత చేసిన ట్విట్టర్
బీజేపీ సోషల్ మీడియా చీఫ్ అమిత్ మాలవీయకు ట్విట్టర్ షాక్ ఇచ్చింది. ఆయన చేసిన ఓ పోస్టును తప్పుదోవ పట్టించే పోస్టు అంటూ ఫ్లాగ్ చేసింది. దీంతో నెటిజన్లు మాలవీయ తీరుపై తీవ్రంగా స్పందించారు. ఇండియాలో తొలిసారిగా ఒక ట్వీట్‌ను ఫేక్‌న్యూస్ అంటూ ట్విట్టర్ ఫ్లాగ్ చేయడం ఇదే తొలిసారి అలాంటి ఘనత ఈ వార్తకే దక్కిందంటూ నెటిజన్లు సెటైర్లు వేశారు.
అసలు ఏం జరిగింది?
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ ఛార్జి చేశారు. ఈ ప్రయత్నంలో ఓ రైతుపై పోలీసు లాఠీఛార్జి చేశాందుకు లాఠీ ఎత్తాడు. దీనికి సంబంధించిన ఫోటోను రాహుల్ గాంధీ ట్విటర్ లో పోస్ట్ చేశారు. మోదీ ప్రభుత్వ హయాంలో రైతుల దీన స్థితిని ఉదహరిస్తూ రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ట్వీట్ విపరీతంగా వైరల్ కావడంతో బీజేపీ సోషల్ మీడియా ఇంఛార్జి అమిత్ మాలవీయ స్పందించారు.
మాలవీయ ఏం చేశారు
దీనికి ప్రతిస్పందనగా మరో ఫొటోను మాలవీయ పోస్ట్ చేసి అసలు లాఠీ రైతుకు తగల్లేదని ట్వీట్ చేశారు. మాలవీయ జరిగిన వాస్తవం ఇదేనంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. పోలీసు లాఠీ దెబ్బ నుంచి రైతు తప్పించుకున్నట్లుగా వీడియోలో ఉంది. రాహుల్ చాలా కాలంగా అత్యంత అపఖ్యాతి పాలైన ప్రతి పక్ష నేత అంటూ మాలవీయ ఆ వీడియోకు వ్యాఖ్యను జత చేశారు. అయితే ఫ్యాక్ట్ చెక్ వెబ్‌సైట్ ‘ఏఎల్‌టి న్యూస్’ రైతుల ఆందోళనపై పూర్తిస్థాయి వాస్తవ వీడియోను ట్విట్టర్ లో ఉంచింది. రైతులపై పోలీసులు లాఠీచార్జీ చేసిన వైనం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు రైతులపై పోలీసులు లాఠీ ఛార్జి చేసిన వాస్తవ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. మాలవీయ మాత్రం పోలీసులు లాఠీఛార్జి చేయలేదంటూ ట్వీట్ చేశారు.
ట్విటర్ ఏం చెబుతోంది
ట్విట్టర్ నిబంధనల ప్రకారం కల్పిత, మోసపూరిత సమాచారానికి ట్విటర్ ఫాక్ట్ చెక్ పేరుతో రెడ్ ఫ్లాగ్ జత చేస్తుంది. మానిపులేట్ చేసిన ఫొటోలు, వీడియోలను షేర్ చేసినా, ప్రజల భదత్రకు విఘాతం కలిగే పోస్టులకు రెడ్ ఫ్లాగ్ ను జతచేస్తుంది. మోసపూరిత కంటెంట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాకుండా నిరోధిస్తుంది.
Also read: పోలవరం ప్రాజెక్టుపై టీడీపీ అసత్యాలూ, అతిశయోక్తులూ: జగన్