- అలిపిరి టోల్ గేట్ ఛార్జీలను పెంచిన ప్రభుత్వం
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళుతున్న భక్తులకు టీటీడీ షాకిచ్చింది. అలిపిరి దగ్గర ఉన్న టోల్‌గేట్ ఛార్జీల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు వసూలు చేస్తున్న టోల్‌గేట్ ఛార్జీలకు భారీ సవరణలు చేసింది. గత సంవత్సరం టోల్ ఛార్జీలను పెంచుతూ టీటీడీ చేసిన తీర్మానం మేరకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కారుకు ప్రస్తుతం ఉన్న 15 రూపాయల నుంచి 50 రూపాయలకు పెంచారు. మినీ బస్సు, మినీ లారీలకు ప్రస్తుతం వసూలు చేస్తున్న 50 రరూపాయలను 100 రూపాయలకు పెంచారు. లారీ, బస్సుకు ప్రస్తుతం ఉన్న 100 రూపాయాలను 200 రూపాయాలకు పెంచారు. అలిపిరి ఘాట్‌రోడ్డులో వెళ్లే బైక్‌ల టోల్‌ఫీజును పూర్తిగా రద్దు చేశారు.
Also Read: మున్సిపల్ పోరుకు ఎస్ఈసీ సన్నాహాలు
ఛార్జీల పెంపుపై భక్తుల ఆగ్రహం:
టోల్ ఛార్జీల పెంచడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలే పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడంతో నానా ఇబ్బందులు పడుతున్న సామాన్యులు మళ్లీ శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల వద్ధ టోల్ ఫీజు రూపంలో భారీగా వడ్డించడం పట్ల భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.