- అమెరికా చరిత్రలో రెండోసారి అభిశంసనకు గురైన ట్రంప్
- 232-197 ఓట్లతో నెగ్గిన అభిశంసన తీర్మానం
- ట్రంప్ ట్విటర్ ఖాతా నిషేధాన్ని సమర్శించుకున్నట్విటర్ సీఈవో
కొద్ది రోజుల్లో అధక్ష పదవి నుంచి వైదొలగనున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోతూ పోతూ మరో అపఖ్యాతి ని మూటగట్టుకున్నారు. క్యాపిటల్ హిల్ దాడి ఘటనను ట్రంప్ ప్రొత్సహించారని ఆరోపిస్తూ డెమొక్రాట్లు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానానికి ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో అమెరికా చరిత్రలో రెండు సార్లు అభిశంసన ఎదుర్కొన్న అధ్యక్షుడిగా ట్రంప్ తీవ్ర అపఖ్యాతిపాలయ్యారు.
ఇది చదవండి: అమెరికాలో ఎమర్జెన్సీ
జో బైడెన్ గెలుపును ధృవీకరిస్తూ ఈ నెల 6 వ తేదీన వాషింగ్టన్ లోని క్యాపిటల్ హిల్ భవనంలో అమెరికా కాంగ్రెస్ సమావేశమైంది. బైడెన్ విజయాన్ని మొదట నుంచీ వ్యతిరేకిస్తున్న ట్రంప్ ఆయన మద్దతుదారులు భారీ సంఖ్యలో క్యాపిటల్ హిల్ చేరుకుని భవనాన్ని చుట్టుముట్టారు. ఆందోళన కారులను అడ్డుకున్న పోలీసులకు, ట్రంప్ మద్దతుదారులకు మధ్య జరిగిన ఘర్షణలో ఐదుగురు మరణించారు. దాడి స్వయంగా ట్రంప్ పురికొల్పారని భావించిన అమెరికా కాంగ్రెస్ 25 వ రాజ్యాంగ సవరణను ఉపయోగించి ట్రంప్ ను పదవి నుంచి తొలగించాలని ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ను కోరుతూ డెమొక్రాట్లు ప్రతినిధుల సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం 25 రాజ్యాంగ సవరణ చట్టం కింద ఉపాధ్యక్షుడు, కేబినెట్ లోని మెజారిటీ సభ్యులు తీర్మానించడంద్వారా అధ్యక్షుడిని తొలగించే వీలుంది. 25 వ సవరణ అధికారాన్ని ఉపయోగించేందుకు తాను సుముఖంగా లేనంటూ ఉపాధ్యక్షుడు పెన్స్ ఇదివరకే సంకేతాలిచ్చారు. అయినా సరే స్పీకర్ పెలోసీ పట్టుబట్టి మరీ ఈ తీర్మానంపై ఓటింగ్ నిర్వహించారు. అయితే తీర్మానాన్ని ఉపాధ్యక్షుడు పెన్స్ తిరస్కరించారు. దీంతో ప్రతినిధుల సభలో డెమొక్రాట్లు సోమవారం ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానంపై ప్రతినిధుల సభలో చర్చ సాగింది. చర్చ అనంతరం ప్రతినిధుల సభలో 232-197 ఓట్లతో అభిశంసన తీర్మానం నెగ్గింది. ట్రంప్ సొంత పార్టీకి చెందిన 10 మంది సభ్యులు అభిశంసన తీర్మానానికి మద్దతు పలికారు. నలుగురు కాంగ్రెస్ సభ్యులు ఓటింగ్ లో పాల్గొనలేదు. మరో నలుగురు ఇండో అమెరికన్ సభ్యులు అభిశంసనకు మద్దతు తెలుపుతూ ఓటు వేశారు. ఈ తీర్మానంపై సెనేట్ లో ఓటింగ్ నిర్వహించనుంది. సెనేట్ లో ఆమోదం పొందితే ట్రంప్ అధ్యక్ష పదవినుంచి దిగిపోనున్నారు. సెనేట్ ఈ నెల 19కి వాయిదా పడింది. సెనేట్ లో అభిశంసన తీర్మానం ఆమోదం పొందడానికి 17 ఓట్లు అవసరం. జనవరి 20న బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం ట్రంప్ పై విచారణ జరగనుంది.
ఇది చదవండి: పుట్టింటిలోనే ప్రజాస్వామ్య అపహాస్యం
ట్రంప్ పై సామాజిక మాధ్యమాల మూకుమ్మడి దాడి:
కాపిటల్ హిల్ దాడి తర్వాత ట్రంప్ ట్విటర్ ఖాతాను ట్వటర్ నిషేధించింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వినిపించినా ట్విటర్ సీఈవో జాక్ డోర్సే మాత్రం సమర్ధించుకున్నారు. దాడి అనంతరం ట్రంప్ ఖాతాలో పోస్ట్ చేసిన అంశాలు హింసను ప్రేరేపించేవిగా ఉన్నాయని భావించిన ట్విటర్ 88 మిలియన్ల ఫాలోయర్లు ఉన్న ట్రంప్ ఖాతాను నిషేధించింది.
ట్విటర్ దారిలో స్నాప్ చాట్:
ఇప్పటికే పలు సామాజిక మాధ్యమాలు ట్రంప్ ఖాతాలను స్తంభింపజేస్తున్నాయి. వీటి జాబితాలో స్పాప్ చాట్ కూడా చేరింది. ట్రంప్ ఖాతా స్నాప్ చాట్ లో కొనసాగడంపై తీవ్ర విమర్శలు వస్తుండటంతో ఖాతాను శాశ్వతంగా నిషేధం విధించింది.