Sunday, December 22, 2024

వచ్చే ఎన్నికల్లో సైతం బ్రహ్మాండమైన మెజారిటీ: కేసీఆర్

హైదరాబాద్ మాదాపూర్ లో జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం ముగింపు సభలో ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు:

•        ప్రజా ప్రయోజనాలను రక్షించేది టీఆర్ఎస్ పార్టీయే

•        90 పైచిలుకు స్థానాల్లో విజయం సాధిస్తం

•        టీఆర్ఎస్ పార్టీకి 861 కోట్ల నిధులున్నాయి.

•        పార్టీకి మొత్తంగా వెయ్యి కోట్ల ఆస్తులున్నాయి

•        మన రాష్ట్రం బాగుండాలంటే, దేశం బాగుండాలె కదా

•        టీఆర్ఎస్ పార్టీ నాయకులు విదేశాల్లో పర్యటించాలె

•        అక్కడ అభివృద్ధి పథకాలను అధ్యయనం చేయాలె

•        మనం నిర్మాణాత్మక దృక్పథంలో ముందుకెళ్లాలె

•        నియోజకవర్గాల్లో కూడా పార్టీ కార్యాలయాలు నిర్మిస్తం

•        టీఆర్ఎస్ కార్యకర్తలకు శిక్షణా తరగతులు నిర్వహిస్తం

•        టీఆర్ఎస్‌ శిక్ష‌ణా శిబిరాల్లో కేంద్రం కూట‌నీతి, దేశం ప్ర‌త్యామ్నాయం ఎజెండా చెబుతం

•        దేశం ముందుకు పోవాల్సిన విధానాలు, స్ప‌ష్ట‌మైన సిల‌బ‌స్ రూప‌క‌ల్ప‌న చేస్తం

•        అన్ని విష‌యాలు తేట‌తెల్లంగా తెలియజేయ‌డం జ‌రుగుతది.

•        దాన్ని మ‌ళ్లీ ప్ర‌జాక్షేత్రంలో పెట్టి ఈ దుర్మార్గుల నీతిని ఎండ‌గ‌ట్టాలి

•        బీజేపీ మత విద్వేష రాజకీయాలు చేస్తున్నది

•        మనిషిని మనిషి చూస్తేనే ఓర్వలేని పరిస్థితి తెచ్చారు

•        దేశంలో ఎందరో హిందూ ప్రముఖులు ఉన్నరు

•        అందరూ ప్రశాంతంగానే బతుకుతున్నరు

•        ఎవరికీ లేని భయం బీజేపీకి ఎందుకొచ్చిందో

•        హిందూత్వానికి ఇప్పుడొచ్చిన ముప్పు ఏమిటి

•        విధ్వంసం చెలరేగి అలజడులు రావాలా

•        అమెరికా లాంటి దేశంలో కూడా హిందువుల గుడులున్నాయి.

•        మరి వాళ్లు మన హిందువులను వ్యతిరేకించడం లేదే

•        మనిషి గొప్పతనాన్ని పెంచాలి గానీ, విద్వేషాన్ని పెంచొద్దు

•        సాంకేతిక పరిజ్ఞానంతో అరచేతిలో ప్రపంచం, కుగ్రామంగా ఉన్నది

•        అభివృద్ధిని కోరుకోవాలే గానీ, అశాంతిని కాదు

•        8 ఏండ్లు గడిచినా నరేంద్ర మోడీ ఏం చేశాడు?

•        ఏ రంగంలో అభివృద్ధి జరిగిందో మన అనుభవంలోకి రావాలి గదా

•        వ్యవసాయ, విద్యుత్ తదితర రంగాల్లో కూడా కిందికే పోయింది

•        ఏ ఒక్క రంగంలో ఏమీ లేదు. అబద్దాల జోరు తప్ప

•        పన్నులు పెంచేది మీరు, రాష్ట్రాలను బద్నాం చేస్తరు

•        అబద్దాల పునాదుల మీద మీరు పాలిస్తున్నరు

•        ఎన్నికల్లో గెలవడం కోసం విద్వేషాలు సృష్టిస్తున్నరు

•        బలమైన కేంద్రం – బక్క రాష్ట్రాలే బీజేపీ విధానం

•        మోదీ ప్రసంగాల జోరు తప్ప ఏమీ లేదు

•        మన దేశంలో ఉన్న వనరులను వాడుకునే పరిస్థితి లేదు

•        దేశంలోని ప్రజలంతా ఇవన్నీ గమనిస్తున్నారు

•        అభ్యుదయానికి పనికొచ్చే రాజకీయాలు చేయాలి

•        తెలంగాణ ఏర్పడ్డాక మనం ఒక్క పైసా డీజిల్ పెట్రోల్ ధర పెంచలేదు

•        కానీ కేంద్రం ఆకాశ‌మెత్తు పెంచిన డీజిల్ ధ‌ర‌ల‌తో ఆర్టీసీ మీద డైరెక్టుగా భారం ప‌డుతోంది.

•        దాదాపు 2 నుంచి 3 వేల కోట్ల రూపాయ‌లు ఇచ్చి ఆ సంస్థ‌ను మ‌నం బ‌తికిస్తున్నం.

•        ఆర్టీసీని జ‌ల్దీ అమ్మేయాల‌ని ప్ర‌ధాని మోదీ ప్రైజ్‌లు పెట్టిండు

•        ప్ర‌ధాని ఆర్టీసీని అమ్మినోళ్ల‌కు 1000 కోట్ల రూపాయ‌లు బ‌హుమ‌తి పెట్టిండు.

•        ఆయ‌న అమ్మేది చాల‌ద‌ట‌. మ‌నం కూడా అమ్ముకోవాలట‌.

•        ఉన్న సంస్థ‌లన్నీ ప్రైవేట్ ప‌రం చేయండి. ఏ రాష్ట్ర‌మైతే అమ్ముత‌దో ..వారికి వెయ్యి కోట్ల ప్రైజ్ మ‌నీ పెట్టిన ఘ‌నుడు మ‌న ప్ర‌ధాన మంత్రి..ఇది జరిగే క‌థ‌. వాస్త‌వం

•        తెలంగాణ నేడు అన్నిరంగాల్లో దేశంలోనే ముందున్నది

•        దేశ జీడీపీ పడిపోయింది, అయినా కేంద్రం ఏం చర్యలు తీసుకోలేదు

•        అయినప్నటికీ, కేంద్రం రాష్ట్రాలను బద్ నాం చేస్తున్నది

•        ఎక్కడ ఎన్నికలు వస్తే, అక్కడ ఉద్వేగాలతో రెచ్చగొడుతున్నరు.

•        లా అండ్ ఆర్డర్ చేయి దాటే పరిస్థితి ఏర్పడుతున్నది

•        అలాంటి పరిస్థితులను కంట్రోల్ చేయడం కష్టమైన పని

•        బీజేపీ వాళ్లు ప్రజల్లో భ‌యంక‌ర‌మైన విషాన్ని జొప్పిస్తున్న‌రు..

•        ఏదైనా నిర్మాణం చేయాలంటే చాలా స‌మ‌యం ప‌డుత‌ది. కానీ ఏదైనా విధ్వంసాన్ని చాలా సుల‌భంగా చేయొచ్చు.

•        అనేక వేల సంవ‌త్స‌రాల సంస్కృతి, సంప్ర‌దాయం, స‌హ‌న శీలత‌, ఓర్పు ఉన్న‌టువంటి వైవిధ్య‌మైన దేశం మ‌నది

•        500 సంస్థానాల‌ను విలీనం చేసుకుని ఒక ఫెడ‌ర‌ల్ శ‌క్తిగా ఏర్ప‌డ్డ దేశం భార‌త‌దేశం.

•        అలాంటి దేశంలో ఇపుడిపుడే అభివృద్ది ప‌థంలో న‌డుస్తున్న త‌రుణంలో భ‌యంక‌ర‌మైన విషాన్ని ఈ దేశంలో జొప్పిస్తా ఉన్న‌రు,

•        బీజేపీ విద్వేషాలపై నా ప్రసంగం విని రచయిత్రి జయప్రభ గారు ఫోన్ చేశారు

•        ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతికే ఉంది.

•        ప్రధాని మోడీ గారూ.. తస్మాత్ జాగ్రత్త అని నేను హెచ్చరికలు చేస్తున్న

•        విద్వేషాలతో దేశం 100 ఏండ్లు వెనక్కి పోతది.

•        అభివృద్ధినే అన్ని దేశాలూ కోరుకుంటున్నయి

•        ఈ దుర్మార్గాన్ని మనం తప్పకుండా నిరోధించాలె

•        విద్వేషాల్ని నిర్మూలించేందుకు మనవంతు పాత్ర పోషించాలె.

•        నేను కూడా ఆ భగవంతుడి ఆశీస్సులతో ఇందుకోసం కృషి చేస్త

•        దేశంలో మూస రాజకీయాలతో అభివృద్ధి శూన్యం

•        దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి రావాలి

•        దేశానికి కొత్త ఎజెండా కోసం సైనికుడిలా పనిచేస్తా.

•        త్వరలో హైదరాబాద్ లో దేశంలోని మేధావులు, మాజీ ఐఎఎస్, ఐపీఎస్ ఆఫీసర్లతో సదస్సు నిర్వహిస్తాం.

•        దేశ విదేశాల్లోని ఆర్థిక వేత్తలు కూడా వస్తరు

•        హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి కూడా వస్తరు

•        దేశ ప్రజల ఆకాంక్షలను సాకారం చేయడమే టీఆర్ఎస్ లక్ష్యం

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles